”పిచ్చి దాన! బాబా విభూది నీళ్లలో కలిపి నీ భర్త చేత తాగించు కిడ్నీ లో రాళ్లు కరిగి పోతాయి.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా పాప మీరాకు , అది రెండో కాన్పు. మొదటిది సిజేరియన్ అయ్యింది. 23 అక్టోబర్ కాన్పు తేది.

ఆ ముందు వారం పది రోజులలో సిజేరియన్ చెయ్యడానికి మంచి ముహూర్తం చూడమని మాకు ఎప్పుడూ ముహూర్తం పెట్టే స్నేహితులను అడిగాను.

వాళ్ళెంతో కష్టపడి ఎన్నో ముహుర్తాలకి రాశులు, చక్రాలు వేసి, బాధపడుతూ అన్నిటికీ రవి నీచంలో ఉన్నాడు, ప్రాబ్లమ్ గా ఉంది అన్నారు. ఇంకెవరినో కూడా అడిగితే వారు ఇలానే చెప్పారు.

జ్ఞానేంద్రియాలలో ఏదయినా లోపం ఉండేందుకు అవకాశం ఉంది, అన్నారు. చాలా ఆందోళన అనిపించింది.

నాకింకా ఏం చేయడానికి పాలుపోక సాయి నువ్వే దిక్కనిపించి, ” శ్రీ సాయి సచ్చరిత్ర ” పారాయణ చేస్తే నాకు బాబా దగ్గరే కూర్చున్నంత మనశాంతి కలుగుతుంది అనిపించి, నేను ” సచ్చరిత్ర ” గురువారం సాయంత్రం చదవడం మొదలుపెట్టాను.

శుక్రవారం పొద్దున్నే నేను పూజలో ఉండగా కొంచెం మగతగా అనిపించింది. ఆ మగతలో బాబా కనిపించి, ”15 వ తేది ఫిక్స్ చెయ్యి , ఉదయం 5 – 6 గంటలు మధ్య ” అని ముమ్మారు ఆజ్ఞాపించినట్లుగా చెప్పారు.

చాలా ఆనందం తో 24 గంటలు లోపులోనే  నా సమస్యకి బాబా సమాధానం చెప్పారు . ‘అక్టోబర్ 15 వ తారీఖు’ ఉదయం 5 – 6 గంటల మధ్యలో ఆపరేషన్ చేసి పాపను బయటికి తీశారు.

ఆ ముహూర్తంలో పుట్టిన పాప రాశి చక్రాన్ని వేసి, ఆహా! ఓహో! లగ్నంలో గురు, బుధ లిద్దరూ ఉన్నారు, రవి నీచంలో ఉన్న పరవాలేదు, ఆహా అంటూ ఆనందపడ్డారు అందరూ.  ఆ చిట్టి తల్లికి ”సాయి స్మరా,  శ్రీ స్మరా” అని పేరు పెట్టారు.

నా భర్తకి దాదాపు 34 ఏళ్ల క్రితం కారణం లేకుండా మూత్రంలో రక్తం వస్తూ ఉండేది.

ప్రస్తుతం  ఉన్నట్లుగా హైదరాబాదులో C .T స్కాన్లు లేవు. తరచూ మద్రాస్ లో చేయించు కు రావలసి వచ్చేది.  ఏమి లేదని రిపోర్ట్ వచ్చేది. కానీ ఆయనకి మాత్రం మూత్రం లో రక్తం పడుతూ ఉండేది.

ఏ కాన్సరో, TB  నో అనుకున్నాము. ఒక విజయదశమి రోజున అమ్మవారు, మా పేషెంట్ లాగా కలలో కనపడి ”పిచ్చి దాన! బాబా విభూది నీళ్లలో కలిపి నీ భర్త చేత తాగించు కిడ్నీ లో రాళ్లు కరిగి పోతాయి.” అని చెప్పింది .

అప్పటికి సమస్య మొదలై 5 సంవత్సరాలు అయింది. ఆయన రోజు ఉదయం సాయంత్రం ”శిరిడి” విభూది ని  నీళ్ళల్లో కలిపి తాగేవారు.

ఒక రోజు నొప్పి వచ్చింది. వెంటనే వెళ్లి x ray తీస్తే అందులో రాయి ఉందని తేలింది. మరో పది రోజులలో అది పడిపోయింది. అంత వరకు 5 సంవత్సరాలుగా రోగ నిర్ధారణ చేయలేకపోయారు.

నాకొచ్చిన కలలన్నీ నిజమవుతూ ఉండేవి. ఎక్కడైనా ఆక్సిడెంట్ అవుతుందని, ఎవరికైనా నాకు ముందే తెలిసి పోతుండేది.

ఇలా నాకే ఎందుకవుతోంది. దీనికి ఏమైనా సైన్సు పరంగా ఎమన్నా కారణాలున్నాయా? అనుకుంటూ ”పరమహంస యోగానంద” పుస్తకం చదవడం మొదలు పెట్టాను.

అందులో చేరి ”క్రియ ”తీసుకుందామనుకున్నాను . బాబా నన్ను గురుస్థానం లో పిలిచాడు, గురువు గా ఆయన్ని అనుకున్నాను కదా, అందుకని ” క్రియా” తీసుకునే ముందు గురు పరంపరని ఆమోదించమంటూ వాళ్లొక కాగితం రాయించుకుంటారు.

గురు పరంపరని నేను ఆమోదిస్తేనే గానీ నాకా పాఠాలు అర్ధం కావు. నేనప్పటికే బాబాని గురువు అనుకుంటున్నాను.

మరి ఇది ఎలాగా  అనుకుంటూ, ఆ కాగితాన్ని బాబా దగ్గర ఉంచాను. ఒక నెల రోజులు అయినా కూడా ఎటువంటి సమాధానం రాలేదు.

దక్షిణేశ్వర్ లో ”యోగధామ మఠం” ఉంటుంది, ఇప్పుడు గోడ కట్టారక్కడ, దానికి అనుకోని గంగా నదిలోకి మెట్లు ఉంటాయి అక్కడ .

ఆ మెట్ల మీద ఒక్కో మెట్టు మీద ఒక్కొక్క గురువు కిందనుండి పైకి నిలబడి ఉన్నారు. గురు పరంపరలో కృష్ణుడు కూడా ఉంటాడు.

అలాగే  క్రీస్తు ఉంటాడు. కృష్ణుడి స్థానం లో బాబా ఉండి మురళి ఊదుతున్నట్లుగా, నాకు కల వచ్చింది.

ఆలా వచ్చేటప్పటికి నాకు బాబా నుండి క్రియా యోగాలో చేరడానికి ఆమోదం లభించిందని పించి, నేను అందులో చేరిపోయాను.

కొన్నాళ్ళు కొన్ని exercise లు, కొన్ని టెక్నీక్స్ చెప్పి దీక్ష ఇస్తారు. ఇప్పుడు క్రియా దీక్ష ఒక్కటే ఇస్తున్నారు.

అప్పట్లో హంస దీక్ష కూడా ఇచ్చేవారు. హంస దీక్ష ముందు రోజు రేపు దీక్ష తీసుకుంటాననగా, నేను రూములో పడుకొని ఉన్నాను,

నాకు దగ్గరగా బాబా మొహం కనపడి, ఒక ఫారెన్ అతని మొహంలాగా మారి నాకేసి మొహం తిప్పుతూ ”నేనమ్మా! గిరిని” అన్నాడు బాబా.

వీళ్ళందరూ యోగాలో ”గిరి సెట్” అన్నమాట. (యుక్తేశ్వర్ గిరి, పరమహంస యోగానంద గిరి) సన్యాసులలో సెట్స్ ఉన్నాయి.

అవి గిరి, సరస్వతి, దయానంద, ఆలా వీళ్ళు గిరి సెట్ అన్నమాట. మరుసటి రోజు నేను దీక్ష తీసుకోవడానికి వెళ్ళాను.

ముందు రోజు నాకెవరైతే కలలో కనపడిన ఫారెనర్ అక్కడ కనపడ్డాడు. ఆయన పేరు ”శాంతానంద గిర ” ఆయన మొహం అక్కడ చూసి నేను ఆశ్చర్య పోయాను.

ఆయన చేతుల మీదనే నాకు హంస దీక్ష అయింది, క్రియా దీక్ష అయింది. బాబా నేనే ఆయన్ని అని నాకు ముందే చూపించారు.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles