Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పొలాసపూర్ ను పాలించే విజయుని కుమారుకు ఐముత్తుడు. తల్లి శ్రీమతి.
అప్పుడు ఐముత్తునకు సుమారు ఆరు ఏండ్లు.
ఒకనాడు ఆ రాకుమారుడు వీధిలో భిక్షార్థియై పోతున్న గౌతముని చూచాడు. గౌతముడు 24వ జైన తీర్థంకరుడైన మహావీరుని శిష్యుడు.
ఆ రాకుమారుడు గౌతముని చూచి, తమ గృహానికి వస్తే, భిక్షను సమర్పిస్తానని అన్నాడు. ఐముత్తునితో గౌతముడు రాజసౌధంలోనికి వెళ్లాడు.
శ్రీమతి ఎంతగానో సంతోషించింది. గౌతమునికి నమస్కరించింది. ఐముత్తుడు ఆహార పదార్దాలన్నీ గౌతముని జోలెలో వేశాడు. ఆ జోలె నిండిపోయింది.
“మీరు మోయలేరు, ఆ జోలెను నాకీయండి. నేను తెస్తాను” అన్నాడు. “అలా ఇవ్వకూడదు. దీక్ష తీసుకున్న వారికే దానిని ఇవ్వాలి” అని చెప్పాడు.
దీక్ష అంటే ఏమిటి అని అడిగాడు ఐముత్తుడు. విపులంగా చెప్పాడు గౌతముడు. “నేను దీక్ష తీసుకుంటాను” అన్నాడు ఐముత్తుడు.
“తల్లిదండ్రుల అనుజ్ఞ కావాలి” అన్నాడు గౌతముడు. ఐత్తముని ఉబలాటం చూచి తల్లి అయిన శ్రీమతి సంతసించింది.
“దీక్ష తీసుకుని జీవించటమంటే తేలిక అయిన పని కాదు. మోక్షాన్ని పొందాలి. ఏ జీవిని హింసించ కూడదు” అని తల్లి చెప్పింది.
“నేను ఎంత కష్టమైనా మోక్షాన్ని పొందగలను” అన్నాడు సుపుత్రుడు. తల్లిదండ్రులు అంగీకరించారు.
ఐత్తముడు బాలముని ఐత్తముడు అయ్యాడు. జైన ధర్మాన్ని పాటిస్తున్నాడు.
అప్పుడు అతనికి 13 ఏండ్లు వచ్చాయి.
ఒకసారి అతడు భిక్ష చేసి ఒక సరస్సు తీరాన్నుండి వస్తున్నాడు. అక్కడ చిన్న పిల్లలు కాగితాలతో పడవలు చేసి ఆటలాడుకుంటున్నారు.
ఐత్తముని బాల్య చాపల్యంతో తానూ పడవలు చేసి ఆ నీటితో ఆడుకోసాగాడు. అప్పుడే వస్తున్న కొందరు జైన సన్యాసులు, చూసి “నీవు జలచరాలకు హాని కలిగించావు” అన్నారు.
వెంటనే అతను ఆటమాని, వారితో ఆశ్రమం చేరాడు. తాను తెలియక తప్పు చేశాడు. అనాలోచితంగా ఇతరులకు హాని కలిగించినప్పుడు ఎప్పుడూ “ఇరియా వహియాం” అనే సూక్తాన్ని చదువుతారు జైనులు.
ఆ బాలుడు మనస్ఫూర్తిగా క్షమ పొందాలనే ఉద్దేశంతో పంచ ప్రాణాలను ఆ సూక్తంలో పెట్టి పఠించాడు. జ్ఞానాన్ని పొందాడు ఆ బాలుడు.
మరునాడు ఆ బాలుడు జైన జ్ఞానులు కూర్చుండే ప్రదేశంలో కూర్చోబోయాడు. జ్ఞానులు, “నీవు కూర్చుండ వలసినది ఇక్కడ కాదు, బాల మునులు కూర్చుండే చోటుకు పోయి కూర్చో” అన్నారు.
ఆ మాటలను వర్ధమాన మహావీరుడు విని “అతను బాలునిగా ఉన్నప్పుడే ఆ సూక్తాన్ని హృదయపూర్వకంగా పఠించటం వలన జ్ఞాని అయ్యాడు. జ్ఞాని అవటానికి కావలసినది వయస్సు కాదు” అన్నాడు.
13 ఏటనే జ్ఞాని అయిన ఆ బాలుడు, తుదకు మోక్షాన్ని పొందాడు.
తేదీ తదితర వివరాలు తెలియరాలేదు.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
- “నేను అమ్మను…”… మహనీయులు – 2020… జూలై 21
- నా గానం, నా ప్రాణం…. మహనీయులు – 2020… నవంబర్ 28
- నీకు అర్ధం కాదులే! …. మహనీయులు – 2020… నవంబర్ 15
- ఎందరో మహానుభావులు …. మహనీయులు – 2020… నవంబర్ 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments