Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
స్వామి నారాయణ సాంప్రదాయంలో ముఖ్యమైన గురువుగా భగత్ జీ మహారాజ్ పరిగణింపబడతాడు. ఆయన అసలు పేరు ప్రాగ్జీ దర్జీ.
ప్రాగ్జీ మహారాజ్ ఉపన్యాసాన్ని ప్రప్రథమంగా యజ్ఞపురుషదాస్ జీ వింటున్నాడు.
క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సులభంగా అర్ధమయ్యే విధంగా చెప్పే ప్రాగ్జీమహారాజ్ కు మనసులోనే వందనాలర్పించాడు.
యజ్ఞపురుషాదాస్ ను ఆకట్టుకున్న మరో అంశం ఉంది. ఎంత సులువుగా తత్వాన్ని చెబుతున్నాడో, అంతే వేగంగా తన ఒడిలో ఉన్న బట్టలను కుడుతున్నాడు ప్రాగ్జీ.
ప్రాగ్జీ జన్మతః ఎంత దర్జీ అయినా, బట్టవైపు చూచుకోకుండా సూదితో కుట్టటం ఆశ్చర్యానికి గురి చేసింది యజ్ఞపురుషుడిని.
ప్రాగ్జీ గుణాతీతానంద స్వామిని తన గురువుగా స్వీకరించాడు. గురువు ఆదేశం ఇచ్చినా, గురు భావం ఫలానాగా ఉంది అని ప్రాగ్జీ గ్రహించినా, గురువుకు ఆ సేవ చేసేవాడు.
ఒకసారి గురువు ఆదేశం ప్రకారం ఒక భవంతి నిర్మాణమవుతోంది. సున్నమును ఇసుకను కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఏ విధమైన పరికరాలు అప్పుడు లేవు.
తన కాళ్లతోనే ఆ మిశ్రమాన్ని తయారు చేశాడు. అందరూ అలా చేయవద్దు, కాళ్లు, చేతులు మంటలతో మాడిపోతాయి అని సలహా ఇచ్చారు.
“నేను చేసేది గురువు కోసం. నా బాధ్యత అంత ఆయన చూసుకుంటారని నా తిరుగులేని నమ్మకం” అన్నాడు. విచిత్రంగా ప్రాగ్జీకి ఏమీ కాలేదు. అది గురువుపై పెట్టుకున్న నమ్మకం.
మరోసారి ప్రాగ్జీ, ఇంకా ఇతరులు శెత్రుంజి అనే నదిని దాటాలి. దాటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఎందుకంటే ఆ నదికి వరదలొచ్చాయి. నది చూడటానికి భయంకరంగా ఉంది. ఎవరు సాహసించి పడవను నడుపుతారు?
అందరిని గుండ్రంగా వృత్తాకారంలో కూర్చోమన్నాడు, ఒకరి బొటన వ్రేలును వేరొకరు పట్టుకొమ్మన్నాడు.
చెప్పే వరకు కన్నులు తెరవవద్దన్నాడు. అందరూ అలానే చేసారు. “ఇక కళ్ళు తెరవండి” అన్నాడు ప్రాగ్జీ.
కళ్లు తెరచి చూడగా అవతలి తీరంలో ఉన్నారందరూ. ఇదంతా గురుదేవుని అనుగ్రహమే కదా!
గురువు అద్భుత శక్తులను మాత్రమే కాదు, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు.
ప్రాగ్జీ తన ఎదురుగా కూర్చున్న యజ్ఞపురుషుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు.
యజ్ఞపురుషుడు వెళ్లాడు – “చూడు బాబూ, మనిషికి రెండు కనులుంటాయి, విద్వాంసులకు మూడుంటాయి, ధర్మబద్ధంగా ఉండేవారికి ఏడు ఉంటాయి, జ్ఞానికి అనేక నేత్రలుంటాయి. నేను నా వ్రేళ్లతో చూస్తూనే కుట్టగలను అది విషయం” అన్నాడు ప్రాగ్జీ, యజ్ఞపురుషునితో.
ప్రాగ్జీ నవంబరు 7, 1897న దేహాన్ని విడిచాడు.
ప్రాగ్జీలాంటి ఎందరో మహానుభావులు! అందరికీ వందనాలు!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- గురువును మించిన శిష్యుడు …. మహనీయులు – 2020… నవంబర్ 1
- దొంగల్లో దొంగ…. మహనీయులు – 2020… నవంబర్ 2
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- ఒకే మాట! … మహనీయులు @2020 – జనవరి 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments