ఒకసారి కలలోకి రావయ్యా…..సాయి@366 నవంబర్ 8….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా అత్యధిక ఆరాధానా వ్యవస్థగల మహామహిమాన్వితుడుగా వినుతికెక్కారు. ఆయన కురుణా ప్రసరణకు పగలు లేదు, రేయి లేదు.

భక్తుల జాగ్రదావస్థను (మెలకువ) ఎంత విస్తృతంగా వినియోగించుకున్నాడో, అంతే విస్తృతంగా భక్తుల స్వప్నావస్థను కూడా వినియోగించుకున్నాడు సాయి.

ఒక ఉదాహరణ: బయ్యాజీ పాటిల్‌కు తాను భీముడంతటి బలవంతుడనని గర్వం.

అతను సాయి కాళ్ళు మర్దన చేసి, ఎత్తుకొని ధుని వద్ద కూర్చోబెట్టేవాడు.

ఒక రోజు బయ్యాజీ సాయిని ఎత్తలేకపోయాడు. సాయి నవ్వాడు. సాయి అతని గర్వాన్ని అలా తీసేసాడు.

1917లో ఫిరోజ్‌షా తల్లిదండ్రులు షిరిడీ యాత్ర చేసి సాయిని దర్శించి, సాయి ఫొటో ఒకటి తెచ్చుకున్నారు. దానిని ఒక బల్లపై ఉంచి పూజించేవారు.

తల్లిదండ్రులు సాయిబాబా దివ్యత్వాన్ని కుమారునికి తెలిపారు. అంతా విన్న షా తన తల్లిదండ్రులు బాబాల వెంట తిరుగుతున్నారే అని బాధపడ్డాడు.

సాయి దేవుడే అయితే నాకు మహిమ చూపాలి అని అనుకొని నిద్రించాడు.

ఈ రాత్రి సాయి స్వప్నంలో కనబడి ”నా దైవ శక్తి మీద నీకు నమ్మకం కలగాలా? సరే. బల్ల మీద ఉన్న ఫొటోను చేతితో ఎత్తు. ఆ ఫొటోను నీవు ఎత్తలేకపోతేనే నన్ను నమ్ము. ఎత్తగలిగితే నేను కపటిననుకో” అన్నాడు.

అతడు నిద్ర లేవగానే బల్ల మీద ఉన్న సాయి పటాన్ని ఎత్తటానికి ప్రయత్నించాడు. లేవలేదు. ఎత్తడానికి ప్రయత్నించిన కొలది బరువు పెరగసాగింది. అప్పుడు అతడు సాయి దైవమని నమ్మాడు.

సాయి స్వప్నంలో భక్తుల సంకుచిత భావాలను, దుర్గుణాలను, వ్యాధులను తొలగించే వారు. 7 నవంబరు 1920న లాలా లక్ష్మీచంద్‌కు బాబాను షిరిడీలో దర్శించినట్లు స్వప్నం వచ్చింది.

8వ తేదీన ఆఫీసుకు పోతున్నప్పుడు షిరిడీ నుండి ఏదైనా శుభవార్త కచ్చితంగా అందుతుందని ఆయనకు అనిపించింది. అదే రోజు ఉదయం 11 గంటలకు షిరిడీ నుండి ఆయనకు కవరు వచ్చింది.

అందులో సాయి బాబా ప్రసాదం ఉంది. సాయి బాబా దేహత్యాగం చేసినప్పుటికి స్వప్నాలలో కూడా దర్శనమిచ్చి అనేక విధాల సహాయం చేస్తున్నాడు.

అందుకే, సాయిని ఒకసారి కలలోకి రావయ్యా! అని ఆర్తితో వేడుకుందాం.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles