Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పుట్టుకతోనే కొందరు తమ జీవితాలను భగవదర్పితం చేస్తారు. అటువంటి వారిలో ఒకరు బాబా నందసింగ్ జీ. ఈయన నవంబర్ 8, 1870లో జన్మించారు.
బాల్యంలోనే ఆ పిల్లవాడు ఏకాంత ప్రదేశములో ఉన్న ఒక బావిపై కూర్చుండి ధ్యానంలోనికి వెళ్లిపోయేవాడు.
ఎన్నోసార్లు అతనిని అక్కడ నుండి తీసుకు వచ్చేవారు. “ఏ మాత్రం కన్ను మూతపడినా, బావిలో పడిపోతావని నీకు తెలిసి కూడా అలా ఎందుకుచేస్తావు?” అని అందరూ అతనిని మందలించే వారు.
“గురు నానక్ ను విస్మరించి నిద్రించే కంటే, బావిలో పడి చావటమే మేలు” అనేవాడు అది ఆయనకు ప్రథమ గురువైన నానక్ పై గల ప్రేమాభిమానాలకు గుర్తు.
ఆయనకు అనేకసార్లు గురు నానక్ సాక్షాత్కరించాడంటారు.
ఒక వేసవి దినాన ఎండి పోయిన నదిలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆ స్థలంపైన ఇంకెందరో జపం చేసుకునే వారు.
ఒక్కసారిగా నదీ ప్రవాహం ఎప్పుడైనా వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న భూభాగమంతా జలమయ మవుతుందని అందరుకూ తెలుసు.
క్రొత్త వాడైన నందకు తెలియదు. ఉన్నట్టుండి నదిలో జలం ఉద్ధృతంగా వచ్చింది. దీన్ని గమనించి, అందరూ కేకలు వేశారు నందను పారిపొమ్మని.
ధ్యానంలో ఉన్న నందకు ఇవేమీ తెలియలేదు. ఆ ప్రదేశమంతా నీటితో ప్రవహిస్తోంది.
ఎందరో చూస్తున్నా ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు ప్రేక్షకుల వలె. బాబా నంద జపం ముగించుకుని లేచాడు.
చుట్టూ జలమయం. తన చుట్టూ రెండు, మూడు అడుగుల దూరం నుండి అంతా జలం. కంగారు పడలేదు.
భగవానుని తలచుకుంటూ నడవసాగాడు. ఆ నదిలో నందకు అటు ఇటు నడిచి పోయేందుకు భూమి కనిపించసాగింది.
ఆ భూమిపై నడుస్తూ ఒడ్డు చేరాడు నంద. చూచిన వారికి నంద ఎంత శక్తి వంతుడో గ్రహించారు.
ఆయన భక్తికి మెచ్చి ఎందరో ఆయన పేర గురుద్వారాలను నిర్మిస్తామన్నారు. సున్నితంగా తిరస్కరించాడు నంద.
ఆయన భగన్ వాల అనే చోట ప్రార్థనాలయంలో ఉపన్యసించాలి అంటే బోధ చేయాలి.
సంతోషంగా బయలుదేరాడు ఆయన. ఆ గ్రామం చేరాడు. ప్రార్థనా ప్రదేశం తయారు కాలేదు.
“నేను ఇక్కడకు వచ్చింది విందు భోజనం కోసం కాదు, రేపు ఉదయానికి ప్రార్థనాలయం తయారు కాకపోతే నే వెళ్ళిపోతాను” అన్నాడు.
ఆ రాత్రంతా గ్రామస్తులు కలిసికట్టుగా ప్రార్థనాలయం నిర్మించారు. ఉదయమే సుఖ సింగ్ నే భక్తుడు ప్రేమతో గురుగ్రంథ్ సాహెబ్ ను తెచ్చాడు.
ఉదయపు ప్రార్ధనాలైపోయాయి. వెంటనే నంద సింగ్ తన శిరస్సుకున్న ఉత్తరీయాన్ని విప్పతీసి, దానితో సుఖసింగ్ పాదాలను తుడిచి, ఆ ఉత్తరీయాన్ని నేలపై పరచి, సుఖసింగ్ శిరస్సుపై పవిత్ర గ్రంథాన్నుంచి, ఆ ఉత్తరీయంపై భక్తుని ఆ గ్రంథముతో నడిపించి ప్రార్థనా స్థలానికి చేర్చాడు.
పవిత్ర గ్రంథంపై భక్తి, ఆ గ్రంథాన్ని తెచ్చిన పునీతునిపై ప్రేమకు చిహ్నం.
నేడు నవంబర్ 8. బాబా నంద జయంతి. ఆ పుణ్య పురుషుని స్మరిద్దాం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- పరీక్షలు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 23
- వారసత్వం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 22
- సందర్శనం …. మహనీయులు – 2020… జూన్ 8
- గురువుకు తిలకం దిద్దిన భక్తుడు… .మహనీయులు – 2020… అక్టోబరు 6
- మట్టి బొమ్మలను మహారణానికి …. మహనీయులు – 2020… అక్టోబరు 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments