వారసత్వం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 22



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


జగద్గురువుల పరంపరలోనివాడు గురు నానక్. ఈయన స్థాపించిన సిక్కు మతాన్ని గూర్చి ఎందరో ఎన్నెన్నో విధాలుగా చెబుతుంటారు.

అయన హిందూ, ముస్లిం ధర్మములకన్నా నవ్యమైన మత ధర్మాన్ని ప్రబోధించిన కరుణామూర్తి, మానవతా వాది, మహాదార్శనికుడు.

చిన్న తనంలోనే తండ్రి పొలమునకు కాపలా పెట్టగా, చేనులో మేసి పోవుచున్న పిట్టల నైననూ అదిరించ నిరాకరించిన దయామూర్తి.

సాయి కూడా తన కొలంబాలోని రొట్టెలను జంతువులు తినుచున్నను, లక్ష్యపెట్టలేదు.

వ్యాపారము చేసి లాభమార్జింపుమని పెట్టుబడిగా తండ్రి ఇచ్చిన ధనమును సాధువులకు, పేదలకు పంచిపెట్టిన భాగవత శిరోమణి గురునానక్.

“దేవుడు ఒక్కడే, మానవులందరూ సోదరులు” అని విశ్వమానవ సౌభ్రాతృత్వమును బోధించిన ప్రవక్త, దైవపు ఏకత్వాన్ని చాటినవాడు.

ఇతర దేశములను పర్యటించి, సిక్కు మతాన్ని అర్దమయ్యేల వివరించటమే కాక, ఆయా దేశస్తుల అభిమానాన్ని, గౌరవాదరాలను పొందిన వ్యక్తి.

ఆయన ఆప్ఘన్ దేశంలో నానక్ పీరుగా, నేపాల్ లో నానక్ రుషిగా, ఇరాక్ లో నానక్ లామాగా పేరు పొందిన మహోన్నతుడు.

సర్వ జనులకు ఒకే భోజన శాల నేర్పరచిన ప్రథముడీయనే అంటారు.

ఆయన గురువాణి గీత వలె నిత్య నూతన విలక్షణ మైనదిగాను, రామాయణం వలెనే మధుర మైనదిగాను, మత గ్రంథాల వలె శాశ్వతమైనదిగా భావిస్తారు.

తన అద్భుత ఆశయాల కొనసాగింపునకై, ఆయన తన విశ్వాసపాత్రుడైన అనుయాయి భాయి లెహ్నాజీని తన మతవారసునిగా నియమించాడు, కుమారులను నియమించలేదు.

శ్రీచంద్ ఆయన కుమారుడు. శ్రీచంద్ “ఉదాసీ” తెగను  స్తాపించినను, సిక్కు మతాన్ని ఆ   తెగ  ఏనాడూ వ్యతిరేకించలేదు.

నానక్ తన దేహత్యాగానంతరము హిందు, సిక్కులను కుడి వైపున, ముస్లింలను ఎడమ ప్రక్కన పుష్పముల నుంచి,  తెల్లవారిన పిదప పుష్పములు ఏ వైపున తాజాగా ఉంటాయో, వాటిని ఆ మత ఆచారముల ప్రకారం చేయండని చెప్పారు.

నానక్ సెప్టెంబర్ 22 1539న కన్ను మూసారు. ఆ మతముల వారట్లే చేసి, వస్త్రమును కప్పారు.

మరునాడు ఉదయమున వస్త్రము తీయగ, నానక్ పార్థివ శరీరము లేదు. పుష్పములు నవనవ లాడుచున్నవి.

ఆ మతస్తులు ఆశ్చర్యపోయి, ఆయా మతాచారముల ప్రకారం పుష్పములకు అంత్యక్రియలు చేశారు.

నేడు సెప్టెంబర్ 22. నానక్ వర్థంతి.

నానక్ ను  స్మరించెదము  గాక  – ఓం

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles