Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీచంద్ సిక్కు మత స్థాపకుడైన గురునానక్ మొదటి కుమారుడు. సెప్టెంబర్ 9, 1494 శ్రీచంద్ మాతామహుని ఇంట జన్మించాడు.
అతనిని అందరూ శివుని అవతరంగానే భావించేవారు. గురునానక్ ప్రథమ శిష్యుడు శ్రీచంద్.
ఒకసారి శ్రీచంద్ నదిని దాటటానికి పడవ ఎక్కబోయాడు. “మీకున్న శక్తులతో నదిని దాటవచ్చుగా! పడవ కావాలా?” అని ఎగతాళిగా మాట్లాడాడు ఆ పడవ నడిపేవాడు.
శ్రీచంద్ అక్కడ ఉన్న ఒక చిన్న కొండను ఎక్కాడు. అంతే, అది కదిలి, నదిని దాటటం చూచి అందరూ విస్మయం చెందారు.
శ్రీచంద్ కాశ్మీరులో పర్యటిస్తున్నాడు. అక్కడ ఒక చోట ధుని వెలిగించాడు. నవాబైన యాకుబ్ అగ్నిని చూచి కోపగించుకున్నాడు.
శ్రీచంద్ వెంటనే వెలుగుతున్న – మండుతున్న కట్టెను ఒక దానిని తీసుకున్నాడు, దానిని నెల మీద కొట్టాడు.
ఆ కట్టే నేలకు అతుక్కుపోయింది. చూచు చుండగానే అందమైన చినార్ వృక్షంగా మారింది. ఈ సంఘటనను అందరూ చూచారు. నవాబు చల్లబడ్డాడు.
హిందువులు, ముస్లింలు కూడా శ్రీచంద్ ను ఆరాధించసాగారు. సాయిబాబా కూడా మత వివక్షత లేని మహనీయుడుగా కీర్తింపబడ్డాడు.
చక్రవర్తి జహంగీర్ మియాన్ మీర్ అనే ఒక సూఫీ యోగిని “ప్రస్తుతం ఉన్న యోగులలో అత్యంత శక్తివంతుడైన యోగి ఎవరు?” అని ప్రశ్నించాడు.
మియాన్ మీర్ వెంటనే “గురునానక్ మొదటి కుమారుడైన శ్రీచంద్” అని అన్నాడు.
ఈ మియాన్ మీరే మహనీయుడు. అద్భుత శక్తులెన్నో ఉన్నవాడు. ఈయనే అమృతసర్ లోని హార్ మందిర్ కు శంకుస్థాపన చేసిన మహనీయుడు.
ఇంతటి మహనీయుడు తన త్రండ్రి అయిన నానక్ స్థాపించిన సిక్కు మతానికి గురువు ఆంటే వారసుడు కాలేదు.
సిక్కు మతానికి, శ్రీచంద్ కు ఏ విధమైన పొరపొచ్చాలు లేవు. శ్రీచంద్ బ్రహ్మచారి, ఆయన ఉదాసీన సాంప్రదాయాన్ని ఏర్పరచాడు.
ప్రపంచంలో అన్నిటిపట్ల నిర్లిప్తంగా ఉండటమే ఈ సాంప్రదాయంలోని ముఖ్యమైన విశేషం.
నానక్ తరువాత వచ్చిన గురువులు కూడా శ్రీచంద్ పట్ల ప్రేమాభిమానాలు చూపేవారు.
దేశంలో వివిధ సాంప్రదాయాలు, మతాలు ఉన్నాయి. ఆ యోగులందరికీ ఒక విన్నపం చేసాడు శ్రీచంద్.
తామందరు అడవుల నుండి, పర్వత గుహల నుండి బయటకు వచ్చి నిస్సహాయులైన ప్రజలను ఆదుకోండి అని.
నేడు సెప్టెంబర్ 9, శ్రీచంద్ జన్మదినం. మనం యోగులం కాకున్నా, మానవాళికి తగు రీతిలో చేయూతనిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- వారసత్వం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 22
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
- పదవి వారసత్వం కారాదు! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 16
- బాల గురువు … …. మహనీయులు – 2020… మార్చి 30
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments