Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయిబాబాకు ఎందరెందారో భక్తులు, సందార్శకులు నైవేద్యాలు సమర్పించే వారు. ఇందుకు భిన్నంగా ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి.
అందులో ఒకటి సాయిబాబాయే స్వయంగా, నైవేద్యం కోసం షిరిడీ నుండి బాంద్రాలోని రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఇంటికి వెళ్ళటం.
రామచంద్ర ఆత్మారాం భార్య సీతాదేవి. ఆమె బాల్యం నుండి గణేశుని భక్తురాలు. ఇంకా ఆమెకు గణేశుని భక్తి హెచ్చించిన సంఘటన ఒకటి గలదు.
ఆమె భర్త ఒక ఆంగ్లేయుడు గణపతి విగ్రహాన్ని పేపర్ వెయిట్ గా ఉపయోగించటానికి కొనబోతుంటే ఆంగ్లేయుడు ఇచ్చే డబ్బుకంటే 8 రెట్లు డబ్బు ఎక్కువిచ్చి ఆ విగ్రహాన్ని కొని ఇంటికి తెచ్చాడు.
ఆ గణేశుని విగ్రహము తొండము కుడి ప్రక్కకు తిరిగి యుండెను. ఇటువంటి సిద్ధ వినాయకుని విగ్రహమును నిత్య పూజలలో ఉపయోగించరు.
అయితే ప్రతి వినాయక చవితికి ముందు రోజు ఆ విగ్రహపు పాత రంగులన్నీ తీసివేసి, క్రొత్త రంగులు వేసినచో పూజించవచ్చును అని పండితులు చెప్పగా ఆ కుటుంబం అలాగే చేయసాగింది.
వినాయక చవితి ముందు రోజును హరితాళిక దినం అంటారు. ఇది ఎంతో ప్రాశస్త్యము గల రోజు.
ఆ రోజునే తర్కడ్ కుటుంబం ఆ విగ్రహపు రంగులు తీసివేసి క్రొత్త రంగులు వేసెడి వారు.
ఒక రోజున ఆ విగ్రహపు చేయి విరిగినది. ఇక హిందు శాస్త్ర ప్రకారము ఆ విగ్రహము పూజార్హము కాదని ఎందారో చెప్పినారు.
సరిగ్గా ఇలాంటి సంఘటనే దాక్షిణేశ్వరంలో జరిగింది. దాక్షిణేశ్వరంలోని గోవిందుని విగ్రహం కాలు విరిగింది. ఆ విగ్రహం పూజార్హం కాదన్నారు పూజారులు.
రాణి రస్మని, రామకృష్ణులను సలహా అడిగింది ”రాణిగారి అల్లుళ్ళలో ఎవరైనా క్రిందపడి కాలు విరగ్గొట్టుకుంటే, అతని స్థానాన్ని మరొక వ్యక్తితో భర్తీ చేస్తారా? లేక సముచిత చికిత్స చేయిస్తారా? విగ్రహం కాలును జాగ్రత్తగా అతికించి, పూజ కొనసాగించాలి. విగ్రహాన్ని త్యజించనవసరమే లేదు” అన్నారు రామకృష్ణులు.
రాణి రస్మణి రామకృష్ణుల ఆదేశాన్ని సంతోషంగా పాటించింది.
ఇక్కడ సీతా దేవి ఆ గణపతిని ఏం చేయాలని సాయికి విన్నవించుకున్నది. ”నీ బిడ్డ ఒక చేతిని విరగగొట్టుకుంటే ఆ బిడ్డను నీటిలో పారవేస్తావా? ప్రతి రోజు ఆ విగ్రహాన్నే పూజించు” అన్నారు. ఆమె ఆనందానికి అవధులు లేవు.
వినాయకుడు కరుణామయుడు. ఒక హరితాళిక పర్వ దినంనాడు సీతా దేవి ఆత్మను వినాయకుడు తనలో లీనం చేసుకున్నాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నాస్తికులకు సాయే శరణం…..సాయి@366 ఆగస్టు 14….Audio
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
- గృహమే సాయి మందిరం!…..సాయి@366 జూన్ 22….Audio
- గ్యారా సాల్ బాద్ ….సాయి@366 సెప్టెంబర్ 19….Audio
- వివాహ భోజనం.. …. మహనీయులు – 2020… డిసెంబరు 23
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments