Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
వైతరణ అనే చోట ఉద్యోగం చేస్తున్న వీరేంద్రపాండ్య కుటుంబంలో అందరూ విద్యావంతులే, అందరూ నాస్తికులే. పాండ్య తల్లితండ్రులు మాత్రం నాస్తికులు కారు.
ఒకసారి పాండ్య తన బంధువుతో షిరిడీకి వెళ్ళి బాబా ఫోటో ఒకటి తెచ్చాడు. కానీ నాస్తికుడవటం వలన ఆ ఫోటోను పెట్టెలో పెట్టాడు.
ఒకసారి ఆతని కుటుంబ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయి, ఏ విధమైన సలహాను ఎవరూ పాటించటం లేదు.
పాండ్యకు తన పెట్టెలో ఉన్న సాయి ఫోటో గుర్తుకు వచ్చింది. ఫోటోను బయటకు తీసి పూజించసాగాడు. పరిస్థితులు ఇంకా జటిలమయ్యాయి.
సాయిని ప్రార్ధించాడు. నన్ను కాపాడు అని. లేకుంటే మరల సాయిబాబాను పెట్టెలో పెడతాను, పూజించను అని నిర్ణయించుకున్నాడు.
సమస్యను పరిష్కరించానికి తనకు ఒక మార్గం కనబడింది తన తల్లికి ఉత్తరం వ్రాశాడు ఆ మార్గాన్ని సూచిస్తూ.
తన తల్లి కూడా వ్రాసిన ఉత్తరం తనకు చేరింది, తనకు తోచిన మార్గమునే తల్లి కూడా సూచించింది ఆ ఉత్తరంలో.
అంటే సాయి ఒకే సమయంలో తనకు, తన తల్లికి ఒకే మార్గాన్ని సూచించాడని గ్రహించాడు. సాయి భక్తుడైనాడు.
జీవితాన్ని భక్తి మార్గంలోనే గడుపుతానని ఉత్తరం వ్రాశాడు తల్లికి. కానీ తల్లి కర్మ మార్గం అనుసరించుము అని వ్రాసింది.
సాయిని ప్రార్ధించాడు పాండ్య – ఏ మార్గాన్ని కర్మ మార్గాన్నా? భక్తి మార్గాన్ని అనుసరించాలో తెలుపుమన్నాడు. కాల వ్యవధి కూడా పెట్టాడు. కాల వ్యవధి గడిచినా సాయి మార్గాన్ని తెలుపలేదు.
ఏం చేయాలో తోచటం లేదు. భావనగర్ సాయి భక్త మండలి వారు ప్రచురించిన సాయి బాబా ఉపాసన పుస్తకం తెరచాడు.
రెండు, మూడు పంక్తులు చదవగానే కర్మ మార్గాన్ని పాటింపుమని ఉన్నది. అది చాలు అనుకున్నాడు.
రేపు (గురువారం) సాయి దర్శనం దొరికితే బాగుండును అనుకున్నాడు ఆగస్టు 6న 1952 ఒక ఫకీరు పాండ్య వద్దకు వచ్చి దీవించాడు.
ఆయనే సాయి అనుకున్నాడు. ఆ ఫకీరు ”మరల వచ్చే గురువారం కలుద్దాం” అన్నాడు. ”వీలుపడదు. 2, 3 రోజులో షిరిడీ వెళ్ళిపోతాం’‘ అన్నాడు పాండ్య.
”అయినా సరే కలుద్దాం” అన్నాడు ఫకీరు. 13.8.1952 బయలు దేరి 14.8.1952 గురువారం నాడు షిరిడీ చేరి మధ్యాహ్న ఆరతిలో పాల్గొన్నాడు పాండ్య. వెంటనే ఫకీరు మాటలు ”మరల గురువారం కలుద్దాం” జ్ఞాపకం వచ్చాయి.
”ఊహాతీతము నీ లీల” కదా ఓ సాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సోదరా! నన్ను మరచిపోకు!! …..సాయి@366 ఆగస్టు 13….Audio
- ప్రార్థన బలం … మహనీయులు – 2020… జూలై 24
- గురుత్వాన్నిచ్చిన సాయి…..సాయి@366 జూలై 27….Audio
- సాయి శంకర…..సాయి@366 ఆగస్టు 6….Audio
- గణేశ శరణం! శరణం గణేశ!!…..సాయి@366 సెప్టెంబర్ 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments