Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఆగస్టు 13, 1854వ సంవత్సరములో వాసుదేవ్ జన్మించారు. ఆయనే అనంతరం శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతీ నద్గురు మహారాజ్ అయ్యారు.
ఆయన ప్రసక్తి హేమాడ్‌పంత్ విరచిత సాయి సచ్చరిత్రలో చోటు చేసుకున్నది.
ఆయన గొప్ప అంతర్‌జ్ఞాని. కర్మ మార్గాన్ని నిష్టగా అవలంభించిన మహనీయుడు. ఆయనను అందరూ సాక్షాత్ దత్తాత్రేయుడే అని కీర్తించే వారు.
అటువంటి వాసుదేవానందులు, సాయిబాబా విషయంలో యతుల నియమాన్ని ఉల్లంఫిుంచారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే.
వారు తమ గతాన్ని గూర్చి తెలుపరు. దేనినీ కోరరు. బంధం పెట్టుకోరు.
వాసుదేవానందులు 1908 సం||లో 18వ చాతుర్మాస దీక్షకై కృష్ణా జిల్లాలోని ముక్త్యాల వచ్చారు. అది దిగ్విజయంగా పూర్తి అయింది.
వాసుదేవానందులు కొంత కాలం రాజమండ్రిలో మకాం చేశారు. అప్పుడు సాయి భక్తుడైన దాసగణు తీర్థయాత్రలు చేయుచు రాజమండ్రి వచ్చారు.
వాసుదేవానందులు అక్కడనే ఉన్నారని తెలుసుకుని తన స్నేహితులతో ఆయన దర్శనం చేసుకున్నాడు.
వారు మహారాజ్ (వాసుదేవానందుల)తో మాట్లాడినప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చింది.
సాయిబాబా పేరు విని, మహారాజ్ చేతులు జోడించి, ఒక టెంకాయను తీసి దాసగణుకు ఇచ్చి ”దీనిని నా సోదరుడు సాయికి ప్రణామములతో సమర్పింపుము. నన్ను మరువ వద్దని వేడుము. నాయందు ప్రేమ చూపుమనుము” అన్నారు.
మహారాజ్ మాటలు విని దాసగణు ఆశ్చర్యపోయాడు. దానికి కారణాన్ని గ్రహించారు వాసుదేవానందులు.
వాసుదేవానందులు ”స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరు. కానీ బాబా విషయమున ఇది యొక అపవాదము (మినహాయింపు)” అన్నారు.
సాయి విశిష్టత అప్పుడు అందరికి అవగతమైనది. పిచ్చి ఫకీరు వలె పాడుపడిన మసీదులో బిక్ష చేసుకుని జీవించే సాయిని, వాసుదేవానందుల వారు సోదరులని భావించారు.
అసలు వాసుదేవానందులే అఘటనాఘటన సమర్ధులు. అట్టి వారు సాయి ప్రేమను కోరుట, ఎవ్వరికీ నమస్కరించని యతీంద్రుడు మినహాయింపుగా సాయిని కీర్తించుట పండిత పామరులకు కనువిప్పు కల్గునట్టివిగా అయ్యాయి.
నేడే ఆగస్టు 13 శ్రీశ్రీశ్రీ వాసుదేవానందుల వారి జన్మ దినం. తమ కృపా కటాక్షములను మనపై ప్రసరింపమని మనసారా వేడుకుందాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో! …. మహనీయులు – 2020… జూన్ 24
- సాయి ముంగిట తొలి ‘స్వాతంత్య్ర’ వేడుక …..సాయి@366 ఆగస్టు 15….Audio
- గురువుకే నామం! …..సాయి@366 ఆగస్టు 9….Audio
- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ …..సాయి@366 ఆగస్టు 25….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments