Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత భక్తులకు స్వప్నంలో కనిపించి గాని, సాక్షాత్కరం ఇచ్చిన సందర్భాలు గానీ ఎన్నో ఉన్నాయ్.
రామకృష్ణ పరమహంస దేహాన్ని విడిచి ఐదు ఏండ్లు పూర్తి అయ్యాయి.
అన్నద ఠాకూర్ అనే వ్యక్తికి రామకృష్ణ పరమహంస స్వప్నంలో దర్శనమిచ్చి, తలను ముండనం చేయించుకోమని,
కలకత్తాలోని ఈడెన్ ఉద్యానవనంలో ఉన్న గంగరావి, కొబ్బరి చెట్ల మధ్య దాగి ఉన్న ఒక విగ్రహాన్ని నివాసానికి తెచ్చుకోమని, తరువాత చేయవలసినది చెబుతానన్నారు.
అన్నద ఠాకూర్ తన స్నేహితులు మువ్వురతో జాగ్రత్తగా ఆ విగ్రహాన్ని పరుల కంట పడకుండా తెచ్చారు. ఆ విగ్రహం కాళీ మాతది.
అడుగు పొడవుగా నల్ల రాతితో ఉంది. ఎంత రహస్యంగా తెచ్చినా ఆ విగ్రహం గూర్చి చాల మందికి తెలిసింది.
ఆ విగ్రహపు కన్నులు సజీవంగా ఉన్నాయన్నారు. కొందరు ఆ విగ్రహం ఫోటోలు తీసుకొన్నారు, అందులో అన్నద ఠాకూర్ ఒకరు.
ఆ విగ్రహం బుద్ధుని కాలం నాటిదని, గయలో ఉండేదని తెలిసింది.
మరి కొద్ది రోజులకు ఆ విగ్రహం (కాళీ మాత) అన్నద ఠాకూర్ కలలో కనిపించి తాను ఆద్యా మాతనని గంగానది మధ్యలో నిమజ్జనం చేయమని ఆజ్ఞాపించింది.
మరల అన్నద ఠాకూర్ స్నేహితులతో ఆ విగ్రహాన్ని గంగ మధ్యలో వదలి వచ్చాడు.
ఆ విగ్రహాన్ని ఫోటోలు తీసిన ఫోటోలను నిమజ్జనం చేయమని అన్నద ఠాకూర్ ఫోటోలు తీసిన వారికి చెప్పాడు. ఇటువంటి సంఘటన సాయి సచ్చరిత్రలో కూడా ఉంది.
ఇక బ్రాహ్మణ పురోహితునిగా ఉండటం ప్రారంభించాడు. నిజానికి ఆయనది వైద్య శాస్త్రం.
తాను పూజ చేసే ఒక ఇంట్లో పసి బాలునకు జబ్బు చేస్తే, కాళీ మాతను వేడుకున్నాడు.
“నన్ను (ఫోటో రూపంలో) సరిగా చూడనందుకు ఇది శిక్ష” అన్నది కాళీ మాత.
ఆ ఇంటి వారు ఆ కాళీ మాత ఫొటోకు పూజ చేయకుండా ఎక్కడో పెట్టారు.
ఆ ఫొటోకు చెదలు పట్టాయి. ఇక శ్రద్దగా పూజ చేయగా, ఆ ఇక్కట్లు తొలగిపోయాయి.
కొంత కాలం తరువాత మరల రామకృష్ణులు గంగా నది ఒడ్డున ఆద్యా మాత ఆలయం ఎలా నిర్మించాలో తెలిపారు.
ఆ ఆద్యా మాత ఆలయం నిర్మితమైంది. రామకృష్ణ పరమహంస, ఆద్యామాత, రాధాకృష్ణుల విగ్రహాలు వరుసగా ఒక దానిపై మరొకటి నిర్మాణ మయ్యాయి.
ఆద్యా మాత మందిరం హిందూ, మహమ్మదీయ, క్రిస్టియన్ మతాలకు ప్రతీకగా భావిస్తారు.
నేడు అక్టోబరు 12. గురువు సజీవ గురువు కానక్కరలేదని, దేహ త్యాగాన్ని చేసిన వారు కూడా గురువులుగా స్వీకరింప తగునని తెలిపే అన్నద ఠాకూర్ జయంతి నేడే!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- తెలియగలేరే నీ లీలలు …..సాయి@366 డిసెంబర్ 2….Audio
- తెలియగలేరే నీ లీలలు! …..సాయి@366 ఆగస్టు 26….Audio
- రామ దీపం …. మహనీయులు – 2020… అక్టోబరు 11
- దివిజ గాయకుల గుండియల్ …. …. మహనీయులు – 2020… నవంబర్ 6
- రారా కృష్ణయ్య… .మహనీయులు – 2020… అక్టోబరు 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments