Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
రామకృష్ణ పరమహంస వంగ దేశానికి చెంది, కాళీ ప్రాశస్త్యాన్ని చాటిన భక్తుడు.
ఆంజనేయ పరమహంస ఆంధ్ర ప్రదేశంలో జన్మించి రామ భక్తిని చాటిన వాడు. అయన భక్తుడే కాదు, మహా యోగి. సార్థక నామధేయుడు.
రామనామం వినబడే ప్రదేశాలలో ఆంజనేయులు మస్తకాంజలితో ఉంటాడనే సూక్తి ఆయనను ప్రభావితం చేసింది.
ఉగ్గు పాలతో రామ నామం అయన శరీరంలో ప్రవేశించింది.
ఉయ్యాలలో పరుండ బెట్టి రామ నామం చెబితేనే ఆ శిశువు నిద్రించేది. రామ నామం చెవిన బడగానే చాలు ఏడుపు మానేవాడు ఆ బాలుడు.
శరీరమే రామ సేవకని, నాలుక నామ సంకీర్తనకని, పాదములు రామ నామాన్ని పలు ప్రదేశాలకు పోయి చాటటానికని నమ్మి, ఆచరించి చూపిన రామ భక్తుడు.
ఆయన సన్యాసి కాదు, కుటుంబం కలవాడు. కష్టాలలో ఉన్నవాళ్లు ఏడుస్తూ వస్తే, రామ నామమే శరణ్యమని, ఆంజనేయుడు వచ్చి కష్టాలను తీరుస్తాడని ధైర్యం చెప్పేవాడు.
రామదాసు, త్యాగరాజు మొదలగు వారి గాథలను చెప్పి ఉత్సాహం కలిగించేవాడు.
ఆయన చూపిన మహిమ వలన మా కష్టములు తీరినవని ఎవరైనను పలికిన ఎడల అంగీకరించెడివాడు కాదు.
“రామ నామపరులెవ్వరో వారి వెంట మహిమలుండునుకదా, దీపము ధరించిన వానిచేత వెలుతురుండుట ఆశ్చర్యమా, మీరు కూడా సద్గురు కృపకు పాత్రులై రామనామ పరులుకండి.
రామ నామ మహిమ ఎంతయో మీకు తెలియగలదు” అనే వారు ఆంజనేయ పరమహంస.
ఆయన యోగ నిష్ఠలో ప్రవేశించగనే, శరీరమంతయు కట్టవలె బిగిసుకుపోయేది.
బాహ్య స్మృతి కలిగినప్పుడు “అకలౌతోంది. తినటానికేమైనా పెట్టండి” అని అడిగేవాడు. పెట్టిన దానిని ముందుగా ఇతరులకు పెట్టి మిగిలినది తాను తినేవాడు.
ఈయన తన శిష్యులతో చిరుతలు, సితార్ ధరించి రామ నామ సంకీర్తన చేస్తూ, ఆర్తితో ఎలుగెత్తి, పాడుచూ, వీధులు తిరుగుతూ అందరికి ఉదయమే రామనామముచెవుల పడునట్లు చేసేవాడు.
రాజ యోగ సాధనలో ఉంటూ రామ నామ ప్రాశస్త్యాన్ని చాటిన వారిలో ఆంజనేయ పరమహంస జీవితము అతి సరళముగ కనిపిస్తుంది.
ఆయనపై ఆధారపడిన కుటుంబమునకు భుక్తికి లోటు లేకుండ చేసిన ఆంజనేయ పరమహంస ఆదర్శకవి.
ఈయన 11.10.1941న రామునిలో ఐక్యమయ్యారు. ఆయనను స్మరించెదము గాక!
రామ, రామ, రామ….
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
- రామ స్మరణం …. మహనీయులు – 2020… అక్టోబరు 22
- పతితులారా…. మహనీయులు – 2020… జూన్ 28
- ఇంట గెలిచి .. …. మహనీయులు – 2020… డిసెంబరు 11
- ప్రసాదపు విలువ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 13
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments