Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఆనందతీర్థుడన్నా, పూర్ణ ప్రజ్ఞుడన్నా చాలామందికి తెలియకపోవచ్చును. కానీ మధ్వాచార్యులు అనగానే మధ్వ సంప్రదాయాన్ని ఏర్పరచిన మహనీయుడని అందరికి తెలుసు.
ఈయన పూర్వపు అవతారాలుగా హనుమంతుడు, భీముడు అని అంటారు. అంటే వాయుదేవుని తృతీయావతారం ఈయన.
వీరి దృష్టిలో జీవుడు వేరు, బ్రహ్మము వేరు. జీవుడు మిధ్య కాదు. అలాగే జగత్తు కూడా మిధ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జగత్తు అంత సత్యం.
మధ్వాచార్యుల వారు విజయదశమి రోజున (1238) జన్మించారు.
ఈయన బాల్యంలో తన తండ్రి, ఒకనికి కొంత సొమ్ము చెల్లించాలి. కానీ ఈయన తండ్రి వద్ద ధనం లేదు.
ఈ సంగతి తెలుసుకున్న ఆ బాలుడు, రుణదాతను చింత చెట్టు వద్దకు తీసుకుపోయి, చింత గింజలను ఆ రుణదాతకు ఇచ్చాడు.
రుణం తీరిందని ఆ బాలుడు చెప్పాడు. చింత గింజలతో రుణం ఎలా తీరుతుందని ఆ రుణదాత నివ్వెరబోయారు.
చేతిలోని చింత గింజల వైపు మరో మారు చూచాడు. అవి నాణెములు. వాటిని లెక్కించాడు రుణదాత. రుణం సరిపోయిందని చెప్పాడు ఆ రుణదాత. నేటికీ ఆ స్థలాన్ని ప్రవిత్రంగా భావిస్తారు.
వేదములను నమ్మని ఒక రాజు వేద సూక్తాలను పఠిస్తే గింజలు మొలుస్తాయా? అని హేళనగా మాట్లాడాడు.
వెంటనే మధ్వాచార్యులు కొన్ని గింజలను తీసుకున్నాడు. వేద మంత్రాలను చదివాడు.
ఆ గింజలు (విత్తనాలు) మొలకెత్తి మొక్కలయి, పూలు పూచి, కాయలుగా, పండ్లుగా మారాయి. ఇక ఆ రాజు తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
సాయి స్వహస్తాలతో తోటను పెంచాడు.
ఒకసారి మధ్వాచార్యులు ఉడిపి దగ్గరలో నున్న సముద్ర తీరం వద్ద ఉన్నారు.
అద్భుతమైన సంఘటన ఒకటి జరుగనున్నదని ఆయనకు తోచింది. ధ్యానంలోనికి వెళ్లారు. కళ్ళు తెరచారు.
ఎదురుగా సముద్రంలో ఒకటి జరుగనున్నదని ఆయనకు తోచింది. ధ్యానంలోనికి వెళ్లారు కళ్ళు తెరచారు.
ఎదురుగా సముద్రంలో ఒక ఓడ అలల తాకిడికి తట్టుకోలేక మునిగిపోయేటట్టు ఉంది.
వెంటనే మధ్వాచార్యులు తన ఉత్తరీయాన్ని ఆ నావ వైపు చూపాడు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది.
ఆ నావ యజమాని ఏదైనా బహుమతిని కోరుకొమ్మన్నాడు. ఓడలోని సుగంథపు మొద్దును అడిగి తీసుకున్నాడు. సంతోషంగా ఇచ్చాడు యజమాని.
ఆ సుగంథపు మొద్దులో నుండి బాల కృష్ణుని విగ్రహం బయటకు వచ్చింది. అది ఉడిపి క్షేత్రంలో ప్రతిష్టింపబడి పూజలందుకుంటోంది నేటికిని.
మధ్వాచార్యులను స్మరించెదము గాక!
‘హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ…!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 26
- గడ్డిపోచ! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 16
- అఘోరం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 29
- చెప్పవద్దు…. మహనీయులు – 2020… అక్టోబరు 27
- దర్శనం…. మహనీయులు – 2020… అక్టోబరు 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments