Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా చూడటానికి ముస్లింలా కనబడుతున్నా, హిందువులకు, ముస్లింలకు ఆయా మతాల గూర్చి తెలిపేవాడు.
చాగలమర్రిలో జన్మించాడు హుసేన్ సాహెబ్. మహనీయుడైన కుమారుడు జన్మిస్తాడని ఒక యోగిని చెప్పింది.
జన్మించింది మహమ్మదీయలకైనా హుసేన్ సాహెబ్ లేదా హుసేన్ గురుడు భక్తులకు అమనస్కం భోధించేవాడు, ఆధ్యాత్మ విద్యా బోధన చేసి, పంచ ముద్రల విధానం చెప్పే వాడు.
ఇంకా సంఖ్యా సూత్రాన్ని, పిండోత్పత్తి క్రమాన్ని తెలిపేవాడు భక్తులకు. ఈ తురక గురువు హిందువులను భ్రష్టులను చేస్తున్నాడనే వదంతి కూడా వచ్చింది.
అంతదాక ఎందుకు, ఆయనను కన్న తల్లే తన కడుపున మహాత్ముడు జన్మిస్తాడని దీవిస్తే, సంసారాన్ని పట్టించుకోని వాడు పుట్టాడేమిటని విచారించేది.
ఒకసారి ఈయన పెసర కాయలు ఏరుకుని తింటున్నాడు. పొలం యజమాని చూశాడు. కొట్టటానికి కర్ర పైకెత్తాడు.
పైకి చూడమన్నాడు హుసేన్ గురుడు. యజమాని పైకి చూస్తే చెట్టు కొమ్మలు, ఆకులు జ్యోతుల్లాగా వెలిగిపోతున్నాయి.
యజమాని ఇతని మహత్తును గుర్తించాడు. దీనిని ఎవరికీ చెప్పవద్దు. చెప్తే, నిస్సంతువుగానే మరణిస్తావు అన్నాడు గురుడు. కాని, యజమాని, తన భార్యతో మాత్రమే చెప్పాడు.
పెదవి దాటితే, పెన్ననే లంఘిస్తుంది గదా మాట – అందరికి తెలిసింది ఈ విషయం. చివరకు నిస్సంతువుగానే మరణించాడు ఆ యజమాని.
ఒకసారి హుసేన్ గురుని నారాపుర స్వామి రధోత్సవం చూడటానికి రమ్మని, అయన శిష్యులు బలవంతం చేశారు.
అసలే ఎండా కాలం, పైగా మధ్యాహ్న సమయం. ఎండ వేడిమికి తట్టుకోలేక పోయింది ఆ శిష్య బృందం.
అందరూ ఒక చెట్టు క్రిందకు చేరారు. హుసేన్ వారిని కనులు మూసుకుని ప్రార్థన చేయమన్నాడు.
వారికి ఆ రధోత్సవం కన్నులకు కట్టినట్లు కనిపించింది.
ఈయన వివిధ గ్రామాలకు పోయేవాడు. ఆయా గ్రామాలలో ఉన్నటువంటి కలరా వంటి వ్యాధులు తగ్గిపోయేవి.
భక్తులు కోరికలతో వచ్చే వారు అయన దగ్గరకు. ఆయనకు పూలు, పండ్లు సమర్పించే వారు. ఆయన ఎవరి వద్ద నుండి తీసుకుంటే వారి కోరికలు తీరేవి.
ఒక భక్తుడు పోలు సుబ్బా రెడ్డి హుసేన్ గురుని దగ్గరకు పోయాడు. హుసేన్ కు పూలు, పండ్లు తెచ్చి ఇచ్చాడు కూడా.
హుసేన్ గురుడు రెండు పూలు రెడ్డి చేతిలో పెట్టాడు. ఆతడు అట్లాగే ఒక ముహూర్తాన ఇద్దరు కన్యలను వివాహమాడాడు.
ఆ సవతుల మధ్య పొరపొచ్చాలు లేవు. వారి సంతానం తామరతంపర అయింది.
తాను మహాసమాధి చెందుతానని ముందే తెలిపి 27 – 10 – 1929న దేహం చాలించాడు. నేడు అక్టోబర్ 27. హుసేన్ గురువు వర్థంతి.
మన మతమేదైనా, పర మతాన్ని నిరసించకుందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- రారా కృష్ణయ్య… .మహనీయులు – 2020… అక్టోబరు 9
- రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27
- చద్ది కూడు.. …. మహనీయులు – 2020… అక్టోబరు 3
- శ్రేయో మార్గము…. మహనీయులు – 2020… జూన్ 20
- గొడ్డలికి పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments