శ్రేయో మార్గము…. మహనీయులు – 2020… జూన్ 20



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అది బెన్ తాత్ పట్నం. ఆ రోజు ఎదురుగా ఒక దొమ్మరి ప్రదర్శన జరుగుతోంది. వెదురు గడల మధ్య కట్టిన త్రాటిపై జరిపే విన్యాసాలను ఆ రాజు తిలకిస్తున్నాడు.

ప్రేక్షకులంతా వెదురు గడపై ఇలాచి కుమార్ ప్రదర్శించిన నైపుణ్యాన్ని హర్షించారు. ఆ రాజు తనకవేవి పట్టనట్టు ఆ బృందం యజమాని కుమార్తెను చూస్తున్నాడు.

ప్రదర్శన ముగిసిన తరువాత ఇలాచి కుమార్ ప్రదర్శన ఎలా ఉందని ఆ బృందం యజమాని అడిగితె, తాను ప్రదర్శన చూడలేదన్నాడు.

రెండోసారి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు ఆ విన్యాసాలను చూచి హర్షధ్వానాలు చేశారు. ఈసారి నిద్రమత్తులో ఉండి ప్రదర్శన చూడలేదన్నారు రాజు.

మూడవసారి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు మైమరచిపోయారు. త్రాటిపై ఉన్న ఇలాచి కుమార్ దూరంగా ఒక జైన భిక్షకుడు భిక్ష చేస్తుంటే చూస్తున్నాడు.

భిక్షను ఇచ్చేది అత్యంత సౌందర్యవతి. ఆమె అందం తనకేమి పట్టనట్టు, భిక్ష తీసుకుని వెళ్ళిపోతున్నాడు జైన భిక్షువు.

తానుకూడా జైన మతస్తుడే. భిక్షకుడు తన చూపును ఆ అందాలరాశివైపు త్రిప్పనేలేదు. కానీ తాను, ఒక ధనికుని బిడ్డ. దొమ్మరి బృందం యజమాని కుమార్తె అందానికి ఆకర్షితుడైనాడు.

దొమ్మరి బృందం నాయకుడు తమ కట్టుబాటు ప్రకారం, త్రాటిపై విన్యాసం చూపి బహుమతి పొందుతారో వారికే, తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు.

ఆ సౌందర్యవతిని వివాహమాడటానికి, తల్లిదండ్రులను, ఆస్తిని వదలి, అతి కష్టమైన ఆ విద్యను నేర్చుకున్నాడు.

ప్రావీణ్యత సాధించాడు. ఇదంతా దేనికోసం? ప్రాపంచిక సుఖాల కోసమేగదా? గతంలో తాను వినిన జైన ధర్మ సూత్రాలు ఒక్కసారి జ్ఞప్తికి వచ్చాయి.

అతి తక్కువ సమయంలో ఆ విద్యలో నిష్ణాతుడైనాడంటే, అది తన ఆత్మశక్తిగా భావించాడు.

ఆ ఆత్మశక్తిని అందాలరాశిని వివాహమాడటం కన్నా జ్ఞాన సముపార్జనకు వాడుకుంటే శ్రేయస్కర మనిపించింది. ఈ ఆలోచనలు అతి స్వల్పకాలంలోనే జరిగాయి.

తప్పట్లు కొడుతున్నారు ప్రేక్షకులు. త్రాడు దిగాడు ఇలాచి కుమార్. అక్కడున్న అందరికి నమస్కరించి, శ్రేయో మార్గం (ఆత్మ జ్ఞాన పథం) వైపు వడి వడిగా నడచిపోయాడు.

“బుద్ది తక్కువ వాడు ప్రియమైన (లోకికములను) వానిని కోరును. తెలివిగలవాడు శుభ్రప్రదమైన వాటిని కోరును” అంటారు ప్రత్తి నారాయణరావు గారు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో.

ఇక్కడ వివాహముకంటె, జ్ఞానం మిన్న అని ఇలాచి కుమార్ గ్రహించాడు.

ఈయన కాలము 24వ తీర్థంకరులకంటే ముందే. తేదీ, వివరములు అలభ్యము.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles