Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాగమణి గారి అనుభవములు మూడవ భాగం:
ఒక సారి నాకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడ్డాయి. డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఎందుకంటే రాయి సైజు పెద్దగా ఉంది.
ఎటువంటి పరిస్థితుల్లోనూ అది కిందకు రాదు, అందుకని తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలన్నారు. మా ఆర్ధిక పరిస్థితి బాలేదు.
ఆపరేషన్ చేయించుకుంటే రెండు రకాల నష్టాలు వాటిల్లుతాయని నేను బయపడుతున్నాను. ఒకటి ఆర్ధికంగా, రెండు శారీరకంగా నాకేం చేయాలో తోచని పరిస్థితిలో,
సుదర్శన్ గారు నీకేమి ఆపరేషన్ అవసరం లేదమ్మా! నువ్వు ‘సచ్చరిత్ర’ పారాయణం చెయ్యి. సచ్చరిత్రలో కూడా ఇలాంటి కధలు ఉన్నాయి కదా! నీకేమి కాదు. అంటూ నాకు చాలా దైర్యం చెప్పారు.
8 నెలల పాటు మందులు కూడా వాడాను. ఈ లోగా పారాయణంతో పాటు, ‘నామస్మరణం’ కూడా చేస్తున్నాను. నా అంతటా నాకే నాలో ఏదో మార్పు వచ్చిందనిపించింది.
నేను డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. స్కానింగ్ చేయించుకురా అన్నారు. స్కానింగ్ చేయించుకుని, రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
అందులో స్టోన్ బ్లాడర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. నాకు కూడా ఎటువంటి నొప్పి లేదు, ఏం లేదు.
అది చూసి ఆయన నమ్మలేదు. నేను చూస్తాను, అంటూ దగ్గరుండి ఆయనే స్కాన్ తీయించి మరీ చూసాడు.
రాయి బ్లాడర్ వరకు వచ్చింది. ఇంతకు మించి రాదు, రాయి పగులగొట్టి తీసేస్తాము అన్నారు. ఒక నర్సింగ్ హోమ్ లో చేరడానికి డేట్ ఫిక్స్ చేసారు.
ఉదయం 10 గంటలలోపు అయితే ఏదైనా టిఫిన్ చేసి రండి, తర్వాతా అయితే ఏం తినవద్దు అన్నారు.
నేను ఆపరేషన్ అంటే భయం తోటి, “బాబా గుడికి వెళ్లి బాబాని బాబా! నువ్వు రా నువ్వు రాకపోతే నేను ఆపరేషన్ చేయించుకొను, నాకు భయం”, అంటూ ఒక కొబ్బరికాయ ధుని లో వేసి 11 గంటలకి హాస్పిటల్ కి ఏమి తినకుండా వెళ్ళిపోయాను.
హాస్పిటల్ లో ‘చివటం అమ్మ’ చరిత్ర కనపడితే అది చదువుకుంటూ కూర్చున్నాను.
2 గంటలు అయిపోయింది, ౩ గంటలకు డాక్టర్ వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చి నీకే ముందు ఆపరేషన్ అంటూ థియేటర్ లోకి తీసుకెళ్ళారు.
నేను టేబుల్ పైన పడుకున్నాను, నాకు చాలా భయం గా ఉంది. బాబాని తలచుకుంటున్నాను నాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చారు అంతే!
“నా ముందు బాబా నిలబడి ఉన్నాడు, గళ్ళ లుంగీ కట్టుకున్నాడు, జోలె ఉంది నెత్తిన గుడ్డ కట్టుకున్నాడు, “పద వెడదాం” అన్నాడు.
నేను ఆయనతోటి వెళ్ళాను. ఆయన నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాడు. అక్కడ అంత దుమ్ము ఉంది. అక్కడ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు. అక్కడ కాసేపు ఉన్నాము, మళ్ళీ రా వెళదాం అన్నాడు.
ఆయన నన్ను ఈ సారి ఒక సమాధి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ సమాధి అయితే ఇప్పుడున్న బాబా సమాధి కాదు. బాగా పాతగా ఉంది, మెట్లు దిగి లోపలికి తీసుకెళ్ళాడు.
అక్కడంతా పైపులు అడ్డంగా ఉన్నాయి. నేను అక్కడ ఆగి పోయాను ఆయన మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి తిరిగి “ఆవో భేటీ!” అన్నాడు.
ఆయనా మాట అనంగానే ఆ పైపులు అడ్డం రాలేదు. ఆయన వెనక నేనూ లోపలికి వెళ్ళాను. ఆయన సమాధి పైన మెట్లు ఎక్కి తిన్నగా వెళ్ళి సింహాసనం పైన కూర్చున్నాడు.
నేను నిలబడి చూస్తున్నాను. మా వాళ్ళు అంత నన్ను తట్టి లేపుతున్నాను. ఉండండి!
నేను ‘షిర్డీ’ వెళ్ళాను అంటున్నాను. నేను హాస్పిటల్ లో ఉన్నానని గాని, నాకు ఆపరేషన్ అయిందని గాని నాకు తెలియడం లేదు.
4 గంటలకి ఆపరేషన్ అయిపోయింది, 5 గంటలకి సుదర్శనం సార్ వాళ్ళు వచ్చారు.
నేను లేచి కూర్చుని నేను షిర్డీ కి వెళ్ళాను అని వాళ్లకి విషయం అంత చెపుతున్నాను. అయ్యో! నీకు ఆపరేషన్ అయింది నువ్వు అలా లేచి కూర్చోకూడదు అని వాళ్ళు అంటున్నారు.
నాకేమి తెలియడం లేదు. నేను షిరిడి వెళ్ళాను అదే అనుభూతి ఉంది అంతే!
నాకేమి నొప్పిలేదు. వారం రోజులు హాస్పిటల్ లో ఉండాలన్న డాక్టర్, నా పరిస్థితి చూసి మరునాడే ఇంటికి పంపించేశాడు.
The above miracle has been typed By: Shiva Kumar Bandaru,
నాగమణి గారి అనుభవములు నాల్గవ భాగం తరువాయి……
Latest Miracles:
- తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన బాబా ………..!
- భక్తురాలకి కలలో ద్వారకామాయి దర్శనం చేయించిన బాబా వారు
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- ఆపరేషన్ లేకుండా ఆరోగ్యం ప్రసాదించిన బాబా
- సాయి మహారాజ్ పై భారం వేసి చేసిన నా భర్త Heart ఆపరేషన్ success అవ్వుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments