తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన బాబా ………..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా చిన్నప్పుడు సుమారు పది సంవత్సరాల వయసున్నప్పుడు ”షిరిడి సాయి బాబా మహత్యం” సినిమా చూసాను.

అప్పటి నుంచి నా మనసెందుకో బాబా మీదకి లాగేది. మా ఇంట్లో ముందు నుండి ”నరసింహ స్వామిని”, ”శివుణ్ణి” కొలుస్తుండేవాళ్ళం .

అదేమిటో తెలియదు కానీ నాకు ఎవరు గిఫ్ట్ లు తెచ్చినా అవి బాబావే అయి ఉండేవి.

నేను చిన్నప్పుడు బాగానే చదివేదాన్ని. సహజంగా పిల్లలు బాగా చదవాలని ప్రతి తల్లి తండ్రులు కోరుకుంటారు.

అలాగే మా నాన్న గారు కూడా అనుకునేవారు. అది నాకు చాల ప్రెషర్ గా ఉండేది.

అన్నయ్య అక్కయ్య కూడా బాగానే చదివేవారు, ఇంకా బాగా చదవాలని, ఇంకా మంచి మార్కులు రావాలని, అన్నయ్యనైతే కొట్టేవారు. ఇవన్నీ నా మనసుకి చాలా ప్రెషర్ గా ఉండేవి.

నేను చాలా బాధ పడుతుండేదాన్ని. మా నాన్న గారు నన్ను ఏమీ అనేవారు కాదు, కానీ చదువు చదువు అని అన్నయ్య ని అంటుంటే అది నాకు తగులుతుండేది.

ఆ బాధలో ఉండగానే ఒక రోజు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కలలో నేను మా అక్క ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాను, బాబా వచ్చి మా అక్కతో చెబుతున్నారు, ”చిన్నప్పుడు నడవటానికి ఇబ్బంది పడింది, ఇప్పుడు ఇక ముందు కూడా ఇంకా ఇంకా కష్టపడుతుంది” అని చెప్పారు. అదీ కల.

నాకు మెలకువ వచ్చాక తెల్లవారాక మా నాన్న గారికి ఎవరో తీసుకువచ్చి ఒక ఫోటో ఇచ్చారుట, ఆ ఫోటో నాకు ఇచ్చారు, ”ఇది నువ్వు తీసుకో ” అని, అది నేను చూస్తే ”సాయిబాబా” ఫోటో. అప్పుడు నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నాను.

నేను ఇంకా కష్టాలు పడాల్సి ఉంది అని నాకు బాబా ముందుగానే చెబుతున్నాడు అనిపించింది.

అమ్మ నాన్న ఎందుకో తరచూ చాలా గొడవలు పడుతూ ఉండేవారు. ఇద్దరికీ నేనంటే చాలా కోపంగా ఉండేది.

నాన్నకి కూడా బాగా కోపం నామీద ఉండేది. నన్ను ఆయన ఏనాడూ ముట్టుకోలేదు.

పాపం ఆయన్ని తప్పు పట్టకూడదు, ఎందుకంటే నేను అందరి ఆడపిల్లల్లాగా పుట్టలేదు. నేను చాలా పొట్టిగా గూనిగా ఉంటాను, నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఆపరేషన్ చేయించితే నేను మామూలు అవ్వవచ్చు అనుకునేవారు.

ఆ బాధను నా మీదే చూపించేవారేమో నాకు తెలియదు. మా నాన్న ఇంట్లో ఉంటే 144  సెక్షన్ ఉన్నట్లుగా ఉండేది, ఆయన బయటికి ఆఫీస్ కు వెళ్ళగానే ఊపిరిపీల్చుకునేవారంతా.

ఒక రోజు నేను మధ్యాహ్న హారతికి బాబా గుడికి వెళ్ళాను. హారతి జరుగుతుండగా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరిగి పడిపోయాను. కాసేపటికి తేరుకున్నాను.

అసలలా ఎందుకు జరిగిందంటే నాకు 9th, 10th క్లాసులు చదువుతున్నప్పుడే టెన్షన్ కో, భయానికో గుండెల్లో నొప్పి వస్తుండేది, ఇప్పుడు అలాగే నెప్పి వచ్చి అది తట్టుకోలేక పడిపోయాను.

నేను ఇంటికి వెళ్లేసరికి ఆ రోజు ఆదివారం, నాన్న ఇంట్లోనే ఉన్నారు, నన్ను చూస్తే నాకు నెప్పి అని తెలిస్తే, ఆయన తిడతాడని నేను అనుకున్నాను, ఏమనుకున్నారో కానీ ”ఏమైంది” అని అడిగారు.

ఇలా నెప్పి దాదాపు మూడు ఏళ్లుగా వస్తోంది అని చెప్పాను. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అన్నీ టెస్టులు చేసారు, echo కూడా చేసారు.

కొంచెం గుండెల్లో సమస్య ఉంది అని చెప్పారు. మందులకు తగ్గుతుంది అని మందులు రాసారు.

అప్పుడు డాక్టర్ ని నాన్న అడిగారు, ”ఈ అమ్మాయి కి ఆపరేషన్ చేయిస్తే సరి అవుతుందా” అని. [ గూనే ] ” సరి అవుతుందో లేదో తెలియదు కానీ గుండెల్లో సమస్యగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ అంటే, అమ్మాయి ఒకళ్ళ మీద ఆధారపడే ఉంటుంది తప్ప పూర్తిగా బాగయ్యే అవకాశం ఉండచ్చు, ఉండకపోవచ్చు చెప్పలేము, అందుకని ఆమెకి ఆపరేషన్ చెయ్యకుండా ఇలాగే ఉండనీయండి” అని నిమ్స్ లో డాక్టర్లు చెప్పారు.

అప్పటి దాకా నాన్న నాకు ఆపరేషన్ చేయిస్తే ఏమైనా బాగవుతుందేమో అన్న ఆలోచన ఉండేది. ఈ సంఘటన తర్వాత ఇంకా విషయం వదిలేసారు .

నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నేను BIPC గ్రూప్ తీసుకోవాలని నా కోరిక, ఎందుకంటే అందరి ఆడపిల్లలాగా నేను బస్సులు ఎక్కి కాలనీ దాటి బయటికి వెళ్లాలని, ARTS కి సంభందించిన గ్రూపులు కాలనీలోనే ఉన్నాయి. సైన్స్ గ్రూపులు అయితే దిల్ సుఖ్ నగర్ వరకూ వెళ్ళవచ్చు, అందుకని నాకాకోర్కె ఉండేది.

నేను అడగగానే నాన్న ”నువ్వు చదవలేవు వద్దు” అన్నారు. నాకు అప్పటికే ఆపరేషన్ చేయించుతానని, నాన్న అంటుండేవారు కాబట్టి ఆపరేషన్ కాస్త అయిపోతే నేను అందరి ఆడపిల్లల లాగా ఉండవచ్చు అని బాగా కలలు కన్నాను.

నాన్న ఆ గ్రూపు వద్దన్నా బలవంతగా తీసుకుని ఇంటర్ ఫస్ట్ ఏడాది తప్పాను, బాగా తిట్టారు, ” ఆ గ్రూపు వద్దంటే వినకుండా బలవంతగా చేరావు ఇప్పుడేమైంది తప్పావు ” అంటూ నాన్న బాగా తిట్టారు.

అందరూ ఇంటర్ 2  ఏళ్ళు చదివితే నేను 3  ఏళ్ళు చదివాను.

అన్నయ్య మగపిల్లాడు వాడ్ని చదివించి ఎలాగైనా ఇంజినీర్ చేయాలని నాన్న చాలా పట్టుదలగా ఉన్నారు.

వాడికి ఇంటర్ అయ్యాక EMCET రాంక్ రాలేదు మళ్లీ ప్రయత్నం చేసాడు, తిట్లు, శాపనార్ధాల మధ్య, అయినా ఫలితం లేకుండా పోయింది.

ఈ సారి నాన్నకి కోపం తార స్థాయికి చేరింది, అన్నయ్య ని బాగా కొట్టారు.

అన్నయ్య కి జీవితం మీద ఆశ పోయి ఆత్మహత్య చేసుకోవాలనుకొని నిద్ర మాత్రలు మింగేశాడు. వెంటనే తెలుసుకొని ఆసుపత్రికి తీసుకువెళితే బాబా దయ వలన బ్రతికాడు.

మా నాన్న ఇంక లాభం లేదని తెలుసుకుని వాడిని డిగ్రీ లో చేర్పించారు. ఆ తర్వాత మా అక్కయ్య పెళ్లి అయ్యింది.

మా అక్క B.ed ఎగ్జామ్స్ తిరుపతిలో రాయాలని మా నాన్న అక్కకి బావకి తనకి టికెట్స్ బస్సులో తీసుకున్నాడు. ఆఖరి నిమిషంలో మా బావ రానన్నాడు. ఆ టికెట్ మీద నేను వెళ్ళాను.

” వేంకేటేశ్వర స్వామి ” దర్శనానికి వెడితే పెద్ద లైను ఉంది. ఆ లైనులో కుమ్ముకుంటున్నారు. నేను బాగా పొట్టిగా ఉండటాన నాకసలు ఊపిరి ఆడటం లేదు.

నేను ఏమిటి పరిస్థితి, నేను ఇంక ఈ లైనులోనే ప్రాణాలు పోగొట్టుకుంటాననుకుంటా, అనుకుంటూ బాబా కి దండం పెట్టుకున్నాను.

ఇంతలో ఒక పెద్దాయన నన్ను చెయ్యి పట్టుకుని ఇవతలికి లాగి ” ఇలా ఈ పక్కన నించోమ్మా! అలా లైనులో నువ్వు ఉండ లేవు” అన్నాడు.

అలా ఒక్క నిముషం ఊపిరి పీల్చుకుని మరల లైనులో వెడుతూ  ”ఇంత ఖర్చు పెట్టి కష్ట పడి లైనులో భగవంతుడిని దర్శించు కోవటానికి వస్తే ఒక్క సెకను కూడా ఆయన ముందు నిలబడనీయరు”, అని అనుకునేంతలో ఒకాయన నన్ను ”ఇంత కష్ట పడి ఇంత దూరం ఆయన్నీ చూడటానికి వచ్చి చూడకుండానే వెళ్ళిపోతావా ? ” అంటూ దేవుడి దగ్గర నన్ను 10 నిముషాల సేపు ఆపి దర్శనం ఇప్పించాడు.

అలా నాకు బాబా దయ వలన బాబాయే వెంకటేశ్వర స్వామి, ఇద్దరూ వేరు కాదు అనిపించింది.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన బాబా ………..!

Sai Baba

ఈ భక్తురాలు జీవితము చుస్తే చాల భాధ అనిపిస్తుంది. బాబా వారు ఆమెకి ముందుగానే తన కష్టాలు గురించి చెప్పడము , తర్వాత ఆమె కి కష్టం వచ్చినప్పుడల్లా ఆమె కి సహాయము చేయడము అనేది బాబా యెక్క అనుగ్రహానికి నిదర్శనము.

Sai Baba

The devotee’s life is really heartfelt. Baba telling her about her troubles beforehand and helping her whenever she faces difficulties. Let’s pray, Baba grace always on her.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles