ఆపరేషన్ లేకుండా ఆరోగ్యం ప్రసాదించిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: పవన్

నివాసం: హైదరాబాద్

సాయి బంధువులకి నమస్కారం. నా పేరు పవన్. అవి నేను ఉద్యోగరీత్యా పూనేలో వుంటున్నరోజులు.

ఒక ఆదివారం రోజు ఉదయం బాబా పూజా  పూర్తి చేసుకొని టిఫిన్ చేస్తుంటే మా ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

మా అమ్మకు చాలా సీరియస్ గా వుంది, హాస్పిటల్లో చేర్పించాం, త్వరగా ఇంటికి రమ్మని చెప్పారు.

ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు నాకు మా ఇంట్లో నుంచి మా అమ్మమ్మ గట్టిగా ఏడవటం కూడా వినిపించింది.

తరువాత కొద్ది సేపటి తరువాత మా బావగారు ఫోన్ చేసి, అమ్మకి చాలా సీరియస్ గా వుంది. చెన్నైలో పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాము, త్వరగా బయలుదేరి చెన్నైలో విజయ హాస్పిటల్ కి రమ్మన్నారు.

నాకు అయితే చెప్పలేనంత భయం వేసింది. పూనే నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని చెన్నైకి బయలుదేరాను.

వెళ్తూ వెళ్తూ నేను ప్రతిరోజు పూజా  చేసుకొనే బాబా పటం ముందు నిల్చోని చాలా బాధతో వేడుకొన్నాను మా అమ్మని కాపాడమని.

నేను ప్రయాణం చేస్తున్నంతసేపూ నా మనసులో మా అమ్మ గురించి తలచుకొన్నప్పుడు విపరీతమైన భయం, వెంటనే బాబాని తలచుకున్నప్పుడు ఏమి కాదులే అని ఎక్కడలేని ధైర్యం.

చివరికి చెన్నై చేరి హాస్పిటల్ కి వెళ్ళాను. మా అమ్మని హాస్పిటల్  ఐ.సి.యు లో వుంచారు. మా అమ్మని అలా చూసేసరికి నాకు చాలా బాధ, ఏడుపు వచ్చి వెంటనే బయటికి వచ్చేశాను.

మనసులో మాత్రం బాబాని తలచుకొంటూనే వున్నాను, మా అమ్మని కాపాడమని.

ఆ తరువాత రోజు మా అమ్మ పరిస్తితి కొంచెం మెరుగైందని చెప్పి ఐ.సి.యు నుంచి నార్మల్ రూమ్ కి మార్చిన తరువాత డాక్టర్ పిలిచి చెప్పారు,

మా అమ్మకి కిడ్నీలో ప్రాబ్లమ్ వుంది, కొన్ని మెడికల్ పరీక్షలు చేయాలి, ఆ తరువాత గాని నిర్ధారించలేము ఖచ్చితంగా ఏమి సమస్య అని.

మా అమ్మని నెఫ్రాలజీ వార్డ్ కి మార్చారు. మెడికల్ టెస్ట్ లు  చేయడం మొదలు పెట్టారు. మెడికల్ టెస్ట్ ల కోసం మేము అక్కడే ఒక వారం రోజులు వుండవలసి వచ్చింది.

ఆ వారం రోజులలో ఆ నెఫ్రాలజీ వార్డ్ లోనే పక్క పేషెంట్ల సమస్యలు (కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్) విని నాకు చాలా భయం వేసింది.

కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎంత ప్రమాదకరమైనవో అప్పుడే తెలిసి, మా అమ్మ పరిస్థితి ఊహించుకొని, నాకు ఇంకా చాలా భయం వేసింది.

అప్పుడు హాస్పిటల్ పక్కనే వున్న వినాయకస్వామి గుడికి వెళ్ళి బాబాను ఊహించుకొంటూ ఈ విధంగా నమస్కరించుకొన్నాను,

ఇంత పెద్ద సమస్యలు, ఇంత పెద్ద ఆపరేషన్ లు భరించే శక్తి మాకు లేదు బాబా, ఆపరేషన్ లు లేకుండా మందులతోనే మా అమ్మకి జబ్బు తగ్గించమని వేడుకున్నాను.

ఆ తరువాత రోజే మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్లు పిలిచి చెప్పారు మాకు.

అమ్మకి ఆపరేషన్ ఏమి అవసరంలేదని, కాని 2 నెలలు మందులు వాడాలని, వాడుతూ ఆ రెండు నెలలూ రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ వుండమని చెప్పారు.

ఆ మాట వినగానే కళ్ళలో నుంచి నీళ్ళు ఆగలేదు, మా అమ్మని నా బాబానే కాపాడారని నాకు చాలా క్లియర్ గా అర్ధం అయిపోయింది.

ఆ రెండు నెలలు మందులు వాడిన తరువాత మా అమ్మకి మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్య రాలేదు.

హాస్పిటల్లో వారం రోజులు వుండి ఇంటికి క్షేమంగా చేరిన మమ్మల్ని చూసి మా చుట్టాలందరు ఎంతో ఆశ్చర్యపోయారు.

ఇంక తిరిగి రాదనుకన్న మా అమ్మని కాపాడి మా అమ్మకి ఆరోగ్యం ప్రసాదించిన ఆ ప్రేమ స్వరూపి సాయినాధునికి నేను, మా నాన్న, మా అమ్మ, మా కుటుంబం అంతా ఋణపడి వుంటాం.

~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

 

“నా భక్తులకి  శ్రేయస్కరమైనవి నేను ప్రసాదిస్తూనే ఉంటాను”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles