నిమోనియాను నివారించిన సాయినాధుడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: పవన్

నివాసం:హైదరాబాద్

సాయి బంధువులకి నమస్కారం. నా పేరు పవన్. నాకు వివాహం జరిగి, కొన్నినెలలకి ఒక పాప పుట్టింది.

తనకి ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు అంతా బాగానే వుంది గాని, ఆ తరువాత, నిమోనియా వచ్చి, రెయిన్బో హాస్పిటల్ లో చేర్పించాము.

ఒక వారం రోజులు హాస్పిటల్ లోనే వుంచుకొని అంతా సరిచేసి డిశ్చార్జ్ చేశారు. ఆ తరువాత నుంచి తనకు చల్లని పదార్ధాలు కాని, చల్లటి వాతావరణం గాని అస్సలు పడకుండా వచ్చింది.

ఏ మాత్రం చలి గాలి తగిలినా, ఏ మాత్రం చల్లని పదార్ధాలు వాడినా, ఏ మాత్రం తీపి తగిలినా, వెంటనే జలుబు, దగ్గు వచ్చి పరిస్థితి చాలా సీరియస్ అయ్యేది.

అలా ఎన్నో రోజులు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి తిరిగి విసుగు వచ్చేసింది మా ఇంట్లో వాళ్ళందిరికి కూడా.

ప్రతిసారి హాస్పిటల్ లో మా పాపకి ఇంజక్షన్స్ చేయడం, సెలైన్ పెట్టడం, ఆ నొప్పికి మా పాప విపరీతంగా యేడ్చేది. దాన్ని చూసి మా అందరికి ఏడుపు వచ్చేది.

ఎంత మనోవేదన పడ్డామో నేను నా మాటల్లో చెప్పలేను. ఇక విసిగిపోయి, పాపని శిరిడీకి బాబా దగ్గరకే తీసుకెళ్ళాలని నిర్ణయించుకొని, రైలు టికెట్స్ బుక్ చేసుకొని, శిరిడీకి బయలుదేరాము.

మరుసటి తెల్లవారు జామున 4 గంటలకి నాగర్ సోల్ కి చేరుకొన్నాము. బయట వాతావరణం చాలా చలిగా వుంది, దానికి తోడు అప్పుడే వర్షం కూడా మొదలయ్యింది.

ఆ వాతావరణం చూసి పాపకి మళ్ళీ ఏమైనా అవుతుందేమోనని నాకు, నా భార్యకు కూడా చాలా భయం వేసింది, కాని మేమున్నది శిరిడీలో కదా బాబా సన్నిధిలో గదా! ఏటువంటి ప్రమాదం జరగదు అని నా భార్యకి సర్దిచెప్పి, బాబా దర్శనం చేసుకొని, మా పాప ఆరోగ్యం గురించి బాబాతో చెప్పుకొని, మూడు రోజులు అక్కడే వుండి, తిరిగి బయలుదేరి హైదరాబాద్ కి వచ్చేశాము.

నిజంగా అయితే నాగర్ సోల్ లో మేము దిగినపుడు వున్న వాతావరణానికి మా పాపకి ఎంతో సీరియస్ అయ్యి వుండాల్సింది కాని, మేము అక్కడున్న ఆ మూడు రోజులలో పాపకి ఏమి కాలేదు. అంతే కాదు, అక్కడి నుండి వచ్చిన తరువాత కూడ మా పాపకి మళ్ళీ అంత సీరియస్ అవ్వలేదు.

శిరిడీ వెళ్ళకముందు, వెళ్ళిన తరువాత ఎంతో వ్యత్యాసం కనబడింది.

శిరిడీ వెళ్ళక ముందు మేము అనుభవించిన  ఆ మనోవేదన తలచుకొన్నప్పడు, ఆ ప్రేమమూర్తి సాయినాధుడు మా పాపని కాపాడిన విధానం తలచుకొన్నప్పడు, నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు జల జలా రాలుతాయి.

ఇందుకే మా పాప పేరు ద్వారకామాయి శ్రీ మోక్ష అని పెట్టుకున్నాము.

పైన చెప్పిన మూడు సంఘటనలు నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన బాబా చేసిన లీలలు.

నా కోసం మా నాన్నకి, మా అమ్మకి, మా పాపకి, ఆ తరువాత నాకు, ఆరోగ్యం ప్రాసాదించి, నన్ను, మా కుటుంబాన్ని కాపాడిన విధానం తలచుకున్నప్పుడల్లా నా శరరం రోమాంచితమయి, నా కన్నులు ఆనంద భాష్పాలతో నిండిపోతే ఆశ్చర్యమేముంది.

కరుణామయా, దయాసాగరా, ఆరోగ్య ప్రదాత, సమర్ధ సద్గరు సాయినాధా, ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోము.

తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగ కరుణించే దైవము నీవే. పైన చెప్పిన సంఘటనలే కాకుండా బాబా నన్ను, నాతో పాటు, మా కుటుంబాన్ని ఎన్నో సార్లు ఎన్నో రీతుల కాపాడారు. ఎన్నో ఆపద సమయాల్లో,  ఆపద కంటే ముందు ఆయన వచ్చి మాతో పాటే వుండి మమ్మల్ని కాపాడారు, కాపాడుతూ ఉన్నారు.

ఆయనతో నాకున్న అనుభవాల చిట్టా చాలా చాలా చాలా పెద్దది. Thank You BABA.

|| అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ || 

|| పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్మహారాజ్ కి జై ||

   ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

***సాయిసూక్తి:

 

  “హరినే మాయ వదిలిపెట్టలేదు ఇంకా మనమెంత”?

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles