Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
బాబా మీద మనకు అచంచలమైన భక్తి, విశ్వాసం, నమ్మకం ఉండాలేగాని, అసాధ్యమనుకున్నవాటిని కూడా బాబా సాధ్యం చేసి చూపిస్తారు.
బాబా మన చెంతనే ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు. అటువంటిదే ఇప్పుడు మీరు చదవబోయే అధ్బుతమైన బాబా లీల.
సాయినాధుడు రైలును ఆపుట
ఒక చిన్న పిల్లవాడు ఒంటరిగా నడుస్తున్నప్పుడు, తనకి ఏ వైపునుంచయినా ప్రమాదం కలుగుతుందేమోననే భయంతో చుట్టు జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తాడు.
కాని తండ్రితో గాని, తల్లి గాని కూడా ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ తనని గురించి కూడా ఏమాత్రం పట్టిచుకోకుండా నడుస్తాడు. ఎటువంటి భయం ఉండదు.
అలాగే మనతో కూడా మనం సాయినాధుని విగ్రహాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు, మన క్షేమం గురించి గాని, యిక ఏ యితర సమస్యల గురించి గాని ఎటువంటి ఆందోళన చెందనక్కరలేదు.
దారిలో ఎదురయ్యే విఘ్నాలు చిన్నవైనా గాని, పెద్దవైన గాని వాటివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సాయినాధులవారు మనలని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.
బరోడాలోని ఖందేరావ్ మార్కెట్ కు ఎదురుగా ఒక కుటుంబం నివసిస్తోంది.
వారు బాబా విగ్రహాన్ని 1980వ.సంవత్సరం ఫిబ్రవరి 14వ.తేదీ గురువారం మహాశివరాత్రి నాడు తమ యింటిలో ప్రాణప్రతిష్ట చేయిద్దామనుకొన్నారు.
బొంబాయిలో రెండు అడుగుల బాబా విగ్రహాన్ని కొన్నారు. బరోడాకు వెళ్ళేముందు ఆ పవిత్ర విగ్రహాన్ని షిరిడీలో బాబా సమాధి వద్దకు తీసుకొని వెడదామనుకొని ట్రాన్స్ పోర్ట్ వారితో మాటలాడి ఒక వెహికిల్ ని ఏర్పాటు చేసుకొన్నారు.
కాని తరువాత ట్రాన్స్ పోర్ట్ వాళ్ళు బుకింగ్ కాన్సిల్ చేశామని చెప్పడంతో వారికి పెద్ద సమస్య ఎదురయింది.
ఆఖరికి ఫిబ్రవరి 11వ.తేదీ 1980వ.సంవత్సరం సోమవారం మధ్యాహ్న్నం ఒంటిగంటకు ఒక మెటాడోర్ వ్యాను ఏర్పాటు చేసుకొన్నారు.
గుర్గావ్ నించి ముగ్గురు కుటుంబసభ్యుల బృదం షిరిడీకి బయలుదేరారు. సాయంకాలానికి నాసిక్ చేరుకొన్నారు. త్రయంబకేశ్వరుని దర్శించుకొని రాత్రికి ముక్తిధాంలో బస చేశారు (నాసిక్ రోడ్).
మరుసటిరోజు 12వ.తేదీ ఉదయం వారు షిరిడీ చేరుకొన్నారు. పూజారులు, భక్తుల సహాయంతో వారు విగ్రహాన్ని సమాధి మందిరంలోకి తీసుకొని వెళ్ళి తమ కోరికను తీర్చుకొన్నారు.
సాకోరీ వెళ్ళి నాసిక్ కి సాయంకాలం 5.30 కి తిరిగి వచ్చారు. 12వ.తారీకున వారు బరోడా ఎక్స్ ప్రెస్ లో బొంబాయికి బయలుదేరాలి.
అందరూ తొందర తొందరగా బయలుదేరారు. రైలు బొంబాయి సెంట్రల్ లో రాత్రి, 10.30 కి బయలుదేరి భొరివలి కి వచ్చి అక్కడి నుంచి 11.21 కి బయలుదేరుతుంది.
థానా లో ట్రాఫిక్ జాం వల్ల వాళ్ళు చేరుకోవడానికి కనీసం 50నిమిషాలు ఆలస్యమవుతుంది. ఇక బొంబాయి సెంట్రల్ కి గాని, బోరివలీ కి గాని రైలు బయలుదేరే సమయానికి చేరుకోవడం చాలా కష్టం. రైలు బోరివాలి నించి 11.21 కి బయలుదేరుతుంది.
కాని వాళ్ళు 11.20 కి ఇంకా పోవాయి లోనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయానికి బరోడా ఎటువంటి పరిస్థితులలోనూ తప్పకుండా చేరి తీరాలి.
మీరంతా ఒప్పుకుంటే ఆరే కాలనీ నుండి దగ్గరదారిలో తీసుకెడతానన్నాడు వ్యాన్ డ్రైవరు. (ఆరయ్ చెక్ పోస్ట్ వాళ్ళు రాత్రి 9 తరవాత ప్రైవేట్ వాహనాలని అనుమతించరు) ఏదోవిధంగా చెక్ పోస్ట్ వాళ్ళకి నచ్చచెప్పి ఒప్పించి ఆరే కాలనీ నించి దగ్గర దారిలో రాత్రి 11.30 కి గోరేగావ్ హైవే కి చేరుకొన్నారు.
ఏదో విధంగా సాయినాధుల వారు అసాధారణమైన పరిస్థితులలో రైలును ఆపుచేస్తారనే గట్టినమ్మకంతో ఉన్నారు. హైవే మీద చాలా వేగంగా బోరివలి రైల్వే క్రాసింగ్ కి రాత్రి 11.42 కి చేరుకొన్నారు (రైలు బయలుదేరే సమయం రాత్రి 11.21) బరోడా ఎక్స్ ప్రెస్ ఇంకా మూడవ నంబరు ప్లాట్ ఫారం మీదే ఉండటంతో చాలా ఆశ్చర్యపోయారు.
వారిలో ఒకరు వెంటనే ఇంజిన్ డ్రైవరు దగ్గరకు వెళ్ళి రైలుని 3,4 నిమిషాలపాటు ఆపమని కోరారు. డ్రైవరు దానికి ఒప్పుకొన్నాడు.
అందరూ బాబా విగ్రహాన్ని మోసుకొంటూ హడావిడిగా ప్రవేశ ద్వారం నించి యింజన్ దగ్గరే ఉన్న మొదటి బోగీ జనరల్ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేశారు.
తరువాత రైలు బయలుదేరింది. సాయినాధులవారు వారికోసం రైలుని 24,25 నిమిషాలపాటు ఆపుచేయించారు. ఏ కారణంలేకుండా రైలు ఆగిపోవడం డ్రైవరుకి కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది.
డ్రైవరు (కాంతిలాల్ మేఘా) వసాడ్ స్టేషన్ లో బాగా రద్దీగా ఉన్న వీరి బోగీ దగ్గరకి వచ్చి శ్రీసాయినాధుల వారి దర్శనం చేసుకొన్నాడు.
వారితో పాటుగా మెటాడోర్ వ్యానులో ఉన్న షీల్ భాటియా, డా.మహేష్ దోషి రెండు కుటుంబాల వారు కూడా నమ్మశక్యంగాని ఈ అద్భుత లీలను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయారు.
వారు షిరిడీ వెళ్ళడం కూడా అదే మొదటిసారి.
పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారు తమ ఇంటిలో శ్రీసాయినాధులవారి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా జరుపుకొన్నారు.
శ్రీసాయిలీల
జూన్ 1980 డా.షిరిష్ కె.స్వాడియా
ముంబాయి
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా డాక్టరు (సాయినాధుడు) నాకు సులభంగా అందుబాటులోనే ఉన్నప్పుడు నేను మరొక డాక్టర్ వద్దకు వెళ్ళడమేమిటి–Audio
- నిమోనియాను నివారించిన సాయినాధుడు
- విగ్రహ రూపంలో కాపాడిన సాయినాధుడు–Audio
- భక్తుల మనోబావలకు ఆనుకులంగా ఆనుభవాలని ఇచ్చే సాయినాధుడు
- కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడి సాయినాధుడు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “సాయినాధుడు రైలును ఆపుట–Audio”
kishore Babu
September 30, 2016 at 11:36 amనాకు కూడా ఒకసారి బాబా వారు రైలు అపి ఒక లీల చేసినారు. నేను వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళడానికి రాత్రి సమయంలో 12. 30 మిడ్ నైట్ రైలు ఎక్కాను. ఆ రోజు నేను చానా అలసి పోయి ఉన్నాను. వరంగల్ నుంచి ఖమ్మం 1.30 నిముషాలు మాత్రమే పడుతుంది. నిద్ర పోతే లేగలేము అని తెలిసిన, బాగా అలిసి పోయి ఉండడము వలన బాబా వారిని తలుసుకొని పడుకొన్నాను. చాలా సెపటి తరువాత నాకు మెలుకువ వచ్చేసరికి రైలు ఆగివుంది అప్పుడు నేను టైం చూసుకొంటే 5.00 am అయింది. విజయవాడ కూడా దాటిపోయానేమో అని చాలా భయపడిపోయాను. సరే బాబా వారు ఇలా చేసారు ఏమిటి అని మనసులోతలుచుకొని రైలు క్రిందికి దిగి ఒక ప్రయాణికుడి అడిగాను. అతను ఏమి చెప్పాడు అంటే ఖమ్మం కు 10 కిలోమీటర్స్ ముందే టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల రైలు ఆగిపోయింది అని చెప్పాడు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. నేను అప్పుడు ఒక టీ త్రాగడానికి వెళ్ళాను. ఆ టీ త్రాగిన తరువాత రైలు స్టార్ట్ అవడం మొదలయింది. తరువాత 5 నిమిషములలో ఖమ్మం వచ్చింది.
మనం ఇక్కడ ఒక విషయం గమనించ వచ్చు..బాబా వారిని నమ్ముకుంటే అది ఎంత పెద్ద సమస్య అయినా సులభమముగా నెరవేరుతుంది.
మనము ఎప్పుడైనా నిద్ర పోతుంటే మన తలిదండ్రులు కూడా , మన మీద ప్రేమ కొద్దీ లేపడానికి ఇష్టపడరు. ఇక్కడ బాబా వారు కూడా తల్లి ప్రేమ నా మీద చూపించారు. బాబా వారికీ ఏమి చేసిన ఎప్పడికి ఋణం తీర్చుకోలేము.
sreenivas Murthy
October 3, 2016 at 4:31 amThank You Sai.