Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
కమ్మరి బిడ్డ కొలిమిలో పడబోతుంటే మసీదులో కూర్చొని మండుతున్న ధునిలో చేయిపెట్టి బిడ్డని కాపాడారు మన దేవాదిదేవుడు. అదేవిధంగా మొన్న 22–11–2016 న విజయవాడకి చెందిన సునీత గారి పూజగదిలో ఉన్న బాబాగారు తన కాలువిరగ్గొట్టుకొని వారి అబ్బాయిని కాపాడరు. అది వారి మాటల్లోనే విందాము.
అందరికీ నమస్కారమండి. నా పేరు సునీత. మన “సాయిపత్” గ్రూపులో ఈ మద్యే చేర్చబడినాను.
బాబాగారి బిడ్డనైనందకు ఈ జన్మంతా బాబాగారికి ఋణపడి ఉంటాను. బాబాగారి లీలలు వర్ణించడం ఎంత మధురం.
నా జీవితంలో ఈ మద్యే జరిగిన బాబాగారి లీల మా కుటుంబమును కాపాడిన ఒక సందర్భమును మీ అందరితో పంచుకుంటున్నాను.
నవంబరు 22 వ తారీకు మంగళవారము పూజ చేసుకొని పని మీద బయటకు వెళ్ళివచ్చాము.
ఇంటి తలుపులు తెరవగానే బాబా మందిరంలో బాబాగారి పటము, విగ్రహము రెండూ క్రింద పడిపోయి ఉన్నాయి. బాబాగారి విగ్రహం మోకాలు దగ్గర నుండి విరిగి పోయింది.
చూస్తూ కూర్చుండి పోయి ఏడ్వటం జరిగింది. ఏమి చేయాలో తెలియదు.
దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఆ విగ్రహములోనే బాబాగారిని చూసుకుంటూ నా కుటుంబము గడుస్తుంది. స్వామి ఏమిటి ఈ ఆపద అని మన “సాయిపత్” సాయిబంధువులైన సాయి శ్రీనివాస్ మూర్తి గారికి, సాయి సురేష గారికి, సాయి మూర్తి గారికి ఏమైనా సలహా ఇస్తారేమోనని ఫోన్ చేసాను.
కాని ఒక్కరి ఫోన్ కూడా కలవలేదు. ఒక్కరితోనైనా మాట్లాడేందుకు బాబా నాకు అవకాశం ఇవ్వలేదు. భయము ఇంకా పెరిగింది. ఏమి ఆపద ముంచుకొస్తుందో అని భయంతో బాబా నామ స్మరణ చేస్తూ ఒక రోజు గడిపాము.
సాయిసురేష్ గారి ఫోన్ వచ్చింది. తిరుపతి వెళ్ళినందుకు ఫోన్ కలవలేదు అని వారే నాకు ఫోన్ చేసారు. జరిగినది అంతా చెప్పాను. వారి మాటలతో కొంచెం ఓదార్పు కలిగింది.
అదే రోజు సాయంత్రం సాయిమూర్తి గారు ఫోన్ చేసారు. వారికి కూడా జరిగినదంతా చెప్పాను. వారు వెంటనే ఆ యొక్క విగ్రహం ఫోటో తీసి పంపించు తల్లీ అని చెప్పారు.
వెంటనే రెండు ఫోటోలు తీసి సాయిమూర్తి గారి వాట్సప్ కి పంపించాను. బాబాగార్ని అడిగి చెబుతానమ్మా అని అన్నారు.
ఒక పెద్ద షాకింగ్ న్యూస్. సాయిమూర్తి గారు ఫోన్ చేసి మీ ఇంట్లో ఎవరికైనా ఏదైనా చిన్నదో, పెద్దదో ప్రమాదమేమైనా తప్పిపోయినదా! అని అడిగారు. నాకు పూజలో ఉండగా అలాగే తోచింది.
మా ఇంటికి దీపం మా బాబు. బాబాగారి వరప్రసాదం. వెంటనే మా బాబుని అడిగాను. నిన్న నీకు స్కూలులో ఏమైనా జరిగినదా అని అడిగాను. నిన్న స్కూలులో యోగా(spiritual games) నిర్వహించారు.
అందులో పాల్గొన్నప్పుడు కాలు విరిగే పరిస్ధితి అవుతుందేమో అన్నట్లు పడబోతుంటే ఎలాగో ఆగిపోయాను ఆపినట్లు అని చెప్పాడు.
సరిగ్గా మా బాబాగారి విగ్రహం ఎక్కడా ఏమీ అవ్వలేదు, కాలు మాత్రమే విరిగిపోయింది.
నిజంగా నాకు కన్నీళ్ళు ఆగలేదు. సాయిమూర్తి గారు చెప్పినది నిజమైంది. మీ ఆపదను బాబాగారు ఈ విధంగా తొలగించి మీ అబ్బాయిని కాపాడారు అని చెప్పారు.
ఈ లీలని ఎరుకపడేలా బాబా ఆయనతో నాకు తెలియపరిచేలా చేసారు. సాయిసురేష్ గారికి పూజలో మాకు ఒక విగ్రహం ఇప్పించమని బాబాగారు తెలియపరిచారు.
వారు మాకు బాబాగారి విగ్రహం ఇవ్వబోతున్నారు. నిజంగా “సాయిపత్” గ్రూపులో చేర్చబడి సాయిబాబా లీలను చదువుతూ వారికి దగ్గరగా ఉండేలా చేస్తున్న అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
బాబాగారు మన బాధలను ఎలా పంచుకుంటున్నారు, మన బిడ్డలకి రక్షణగా ఎలా ఉంటున్నారు అనేదానికి ఈ లీల ప్రత్యక్ష నిదర్శనం.
సాయిశ్రీనివాస్ మూర్తి గారికి, సాయిసురేష్ గారికి, సాయి మూర్తి గారికి మరీ మరీ కృతజ్ఞతలు.
“సర్వేజనాః సుఖినోభవంతు, లోకా సమస్తాః సుఖినోభవంతు”.
ఇట్లు
మీ
సునీతామధుసూధన్.
నాకు(సాయి సురేష్) సోదరి సాయి సునీత గారు జరిగిన సంఘటన చెప్పినప్పుడు బాబా తనను అమితంగా ప్రేమించే భక్తులకు కష్టం రానివ్వరు ఏదో కర్మ ఈ రూపంలో తొలగించి ఉండవచ్చు, మీరు దిగులు పడకుండా దైర్యంగా, ప్రశాంతంగా ఉండండి. ఏమి కాదు అని చెప్పాను.
బహుశా బాబా నే అలా పలికించారు. తర్వాత సాయి మూర్తి గారి ద్వార అసలు విషయం బాబా తెలియజేసారు. బాబా తన కాలు విరగ్గొట్టుకొని తన బిడ్డను రక్షించారు.
అప్పుడు అర్థం అయ్యింది భక్తల బాధలు తాను భరించే బాబా యొక్క భక్తవత్సలత. ఇలాంటి బాబా లీలలు అనంతం.
కాబట్టి ప్రియ సాయి బంధువులారా ఎటువంటి విపత్కర పరిస్టితి సంభవించిన బాబా తన వారికీ అండగా ఉండి రక్షణ ఇస్తారని దృడ విశ్వాసం, సహనంలతో ఉండండి.అదే బాబా మన నుండి కోరే రెండు పైసల దక్షిణ శ్రద్ధ, సబూరి.
సాదరణముగా మన సమాజంలో విరిగిన విగ్రహం ఇంట్లో వుండకూడదు, వుంటే తప్పు లేక ఏదో జరుగుతుంది వంటి చాలా అపోహలు వున్నాయి.
కాని ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. బాబా మనకు రానున్న ఆపధను ఆయన స్వీకరించి మనల్ని రక్షిస్తే మనం ఆయన విగ్రహం తీసుకొని వెళ్ళి ఏ గంగ లోనో, ఏ గుడి లోనో వదిలి రావడం ఎంత వరకు సమంజసం? అంతేకాదు మనం తర్ఖడ్ కుటుంబ అనుభవాలు చదివాము.
అందులో గణపతి విగ్రహం విరిగిపోయిన సంధర్భంలో శ్రీమతి తర్ఖడ్ తో బాబా “ఓ ! అమ్మా! మన కొడుక్కి చేయి విరిగితే అతనిని మన యింటినుంచి వెళ్ళగొట్టము. దానికి ప్రతిగా అతనికి తిండి తినిపించి, కోలుకునేలా చేసి తిరిగి మామూలు మనిషి అయేలా చేస్తాము” అని అనలేదా. అందుకే వివేకంతో ఆలోచించి నడుచుకోండి
తర్వాత రోజు నాకు బాబా సునీత గారికి పెద్ద బాబా విగ్రహం ఇవ్వాలన్న ప్రేరణ కలిగించారు. అది బాబా ప్రేరణ అవునా, కాదా అన్న సందేహంతో బాబా వారిని అడిగాను.
బాబా అవునని సమాధానం ఇచ్చారు. బాబా అనుమతి ఇచ్చారన్నమాట చెప్పకుండా సునీత గారికి ఈ విషయం చెప్పాను.
అప్పుడు సునిత గారు ఇంట్లో పెద్ద విగ్రహం ఉండకుడదేమో అనే సందేహం వ్యక్త పరిచారు. (ఇది కేవలం సునీత గారి సందేహం మాత్రమే కాదు. చాలామందికి ఉంది ఈ అనుమానం. దీనికి నా సమాదానం ఒక్కటే,
బాబా నాకు నా ప్రతి రూపానికి భేదం లేదని స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు విగ్రహం చిన్నదైన, పెద్దదైన ఆ రూపంలో ఉన్నది సాక్షాత్ మన సాయినాధుడే. ఇంక భయమెందుకు?.
ఎందుకు పెట్టారో అర్థంకానీ ఆచారాలతో మనకేం పని. స్వయంగా బాబా మన పూజలండుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు. ఇంకేం కావాలి.)
బాబా అనుమతి లభించాక తగిన పరిస్తితుల ద్వారా ఆమె సందేహ నివృత్తి చేసి ఆమెను ఒప్పుకోనేలా బాబా చేస్తారనే నమ్మకంతో మీ ఇంట్లో మాట్లాడి రేపు చెప్పండి అన్నాను. మరుసటి రోజే సునీత గారు సరేనని చెప్పారు. త్వరలో బాబా వారి ఇంటికి వెళ్లనున్నారు.
నాకు(శ్రీనివాస మూర్తి) కూడా ఎప్పుడు ఇదే (ఇంట్లో పెద్ద విగ్రహం ఉండకూడదనే) సంశయం ఉండేది. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో 1 1 /2 feet సాయి బాబా వారి విగ్రహం ఉంది.
అందరు పెద్ద విగ్రహం ఉంటె ప్రతిరోజూ పూజ చేయాలి ప్రసాదం ఎక్కువ పెట్టాలి లేకపోతే అరిష్టం అని భయపెట్టేవాళ్ళు. నేను ఒక్కసారి కిషోర్ బాబు గారిని ఈ విషయమై అడిగాను.
సర్ చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందం కలిగించింది. ఏమన్నారంటే “మీ అన్న ఎక్కడవున్నా తినే ముందు ఇంట్లో ఉన్న బాబాకి నైవేద్యం పెడుతునట్లుగా భావిస్తే ఏమి కాదు” అని అన్నారు.
సర్వత్ర నిండి ఉన్న బాబా సర్వదా మనతో పాటే ఉంటారు. అటువంటప్పుడు మనం ఎక్కడ ఉన్న బాబా కు ఏది సమర్పించిన ఇంట్లో ఉన్న ఆయనకు సమర్పించుకున్నట్లే కదా!
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దిల్ సుఖ్ నగర్ బాబా గుడి విగ్రహ ప్రతిష్ట కు ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
- బిచ్చగాని రూపంలో బిడ్డని కాపాడిన బాబా – ఇందిరా వాణి గారి అనుభవము–Audio
- ఆటోవాని రూపంలో వచ్చి భక్తున్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుండి కాపాడిన బాబా వారు
- మా ఇంటిలో జ్యోతి (పూజ) పెట్టించుకోమని వేరే భక్తురాలి రూపంలో వచ్చి చెప్పిన బాబా వారు….
- పాలరాతి విగ్రహం కావాలనుకుంటే, పంచలోహ విగ్రహం గా ఇంటికి వచ్చిన బాబా …!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “విగ్రహ రూపంలో కాపాడిన సాయినాధుడు–Audio”
sreenivas Murthy
December 5, 2016 at 8:52 amసునీత గార్కి బాబా ఇచ్చిన లీల, సాయి సురేష్ గారి వివరణ చాల బాగుంది. నాకు కూడా ఎప్పుడు ఇదే (ఇంట్లో పెద్ద విగ్రహం ఉండకూడదు) సంశయం ఉండేది. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో 1 1 /2 feet సాయి బాబా వారి విగ్రహం ఉంది. అందరు పెద్ద విగ్రహం ఉంటె ప్రతిరోజూ పూజ చేయాలి ప్రసాదం ఎక్కువ పెట్టాలి లేకపోతే అరిష్టం అని భయపెట్టేవాళ్ళు. నేను ఒక్కసారి kishore sir ని ఈ విషయమై అడిగాను. సర్ చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందం కలిగించింది. ఏమన్నారంటే మీ అన్న ఎక్కడవున్నా తినే ముందు ఇంట్లో ఉన్న బాబాకి నైవేద్యం పెడుతునట్లుగా భావిస్తే ఏమి కాదు అని అన్నారు.
kishore Babu
December 5, 2016 at 9:37 amIt is a Great Miracle…Sai Baba…Sai Baba