ఆటోవాని రూపంలో వచ్చి భక్తున్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుండి కాపాడిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భోపాల్ పట్టణం దగ్గర పిప్లానీలో నారాయణ అనే సాయి భక్తుడుండే వాడు. ఏ పని చేస్తున్నా అతడికి సాయి ధ్యాసే. సదా సాయి నామస్మరణే! సుఖమైనా, కష్టమైన సాయి సంకల్పంగానే భావించేవాడు.

అతడు సామాన్య కుటుంబీకుడు. అతని కుమార్తె వివాహం నిశ్చయమై ది.2-12-1984 వివాహం ప్రశాంతంగా జరిగింది. ఆ రోజు రాత్రే మగ పెళ్ళివారు ఇండోర్-బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలులో తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణమయ్యారు.

ఆడపిల్ల తండ్రిగా వియ్యాల వారిని సాగనంపడానికి నారాయణ కూడా వారితోపాటు భోపాల్ రైల్వేస్టేషనుకు వెళ్ళారు.

రాత్రి  11  గంటలకు రావాల్సిన బండి గంటపైగా ఆలస్యమై రాత్రి 12 గంటలు దాటాక వచ్చింది.

మగ పెళ్ళివారికి వీడ్కోలు చెప్పి బయలుదేరబోతూ నారాయణ ఆలోచించారు. ఇప్పుడు అర్ధరాత్రి దాటింది. ఈ సమయంలో ఆటోవాళ్ళు చాలా ఎక్కువ చార్జీ అడుగుతారు.

అయినా ఇంత రాత్రివేళ  నేను ఇంటికి వెళ్లి మాత్రం చేసేదేముంది? ఈ రాత్రికి ఇక్కడే వెయిటింగ్ హాలులో పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోతాను అని ఆలోచిస్తూ యాంత్రికంగా రైల్వేస్టేషన్ బయటికి వచ్చాడు నారాయణ.

అతను అలా బయటికి వచ్చాడో లేదో ఎటునుంచో ఒక ఆటోరిక్షా వచ్చి అతడి ప్రక్కనే ఆగింది. “నారాయణ గారూ! నేను పిపలానీ వైపుగానే వెళ్తున్నాను రండి. మీరు మాములుగా బాడుగ నాలుగు రూపాయలే ఇవ్వండి చాలు. నాకు ఎక్కువేమీ అవసరం లేదు” అన్నాడు

డ్రైవరు పరిచయస్తుడిలా ఆశ్చర్యంగా డ్రైవరు వంక చూశాడు నారాయణ ముఖ పరిచయం ఉన్న వ్యక్తిలాగానే అనిపించింది గాని, సరిగా పోల్చుకోలేక పోయాడు.

ఆటో ఎక్కి కూర్చున్నాడు. నారాయణ ఆటో డ్రైవర్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో వుండగానే పిప్లానీ రానే వచ్చింది.

డ్రైవరుకి బాడుగ చెల్లించి, ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పెళ్ళి పనులు చేసి చేసి అలిసిపోయి వున్నాడేమో, మంచం మీద వాలగానే అతడికి గాఢంగా నిద్ర పట్టేసింది.

మరునాడు ఉదయం బయట ఎదో కోలాహలం వినిపిస్తే నిద్ర లేచాడు.

ఆ రాత్రి తను రైల్వేస్టేషను నుంచి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయి ప్రమాదం సంభవించింది.

భోపాల్ రైల్వేస్టేషన్ పరిసరాలలోని వందలాది మంది జనం చనిపోయారు, మరెంతోమంది వికలాంగులయ్యారు. అదే ఆనాటి ఘోరమైన భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది.

ఆటో డ్రైవర్ పుణ్యమాని తను సురక్షితంగా ఇల్లు చేరాడు. రాత్రి రైల్వేస్టేషన్లో గడిపివుంటే తన పరిస్థితి ఏమై వుండేదోనని తలచు కోడానికే అతడికి భయం వేసింది.

సమయానికి ఆపద్బాంధవుడిలా వచ్చి తనను ప్రాణ గండం నుంచి కాపాడిన ఆటో డ్రైవరును మనసులోనే కృతఙ్ఞతలు తెలియజేసుకున్నాడు.

సకాలంలో ఆటోను పంపించి తనను రక్షించిన తన దైవం సాయినాథుడికి కృతఙ్ఞతలు తెలియజేద్దామని పూజా మందిరంలో వున్న సాయి ఫోటో దగ్గరకు వెళ్ళాడు.

ఫొటోలోని బాబా ముఖం వంక చూడగానే అతని మనసులో ఆటో డ్రైవరు ముఖం తళుక్కున మెరిసింది. ఇంకెవరు, ఆటో డ్రైవరుగా వచ్చింది బాబాయే! చెమ్మగిల్లిన కళ్ళతో, భక్తితో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు.

“బాబా, ఈ దీనుణ్ణి రక్షించడం కోసం ఆటో డ్రైవరు రూపం దాల్చి, నా నుంచి నాలుగు రూపాయలు  మాత్రమే దక్షిణ స్వీకరించి, ప్రతిగా నాకు ప్రాణాన్నే బహుకరించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను?” అంటూ విలపించాడు.

ఎందరు భక్తుల్లో అన్ని రూపాలు! బాబా ఏ భక్తుడి కోసం ఎప్పుడు ఏ రూపం ధరిస్తారో ఎవరికెరుక?! ఆపద్బాంధవా, కరుణా సాగరా, భక్త రక్షకా, సాయినాథా, నీకు జయమగుగాక!

నారాయణ, భోపాల్.

సంపాదకీయం: సాయి వాణి

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ఆటోవాని రూపంలో వచ్చి భక్తున్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుండి కాపాడిన బాబా వారు

Arya! my Wife’s Brother.. Telidevarapalli Raghava, A vaidiki Brahmin and an employee in Electricity Department at Machilipatnam, Krishna District,. AP. . What happened We donot know, last 3 years he is not going to his office. If he is not joining to his job by December 2019, his job may go. He is quarrelling with all people. His DOB 21-02-1987, Saturday, Astami, Night 10:55, Anuradha Nakshatram, Harithasa Gothram. Place of Birth: Vijayawada, AP Please help us and save the life of a poor brahmin. plz do needful to us. thank u very much. sorry for my english. Cell: 9441752866

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles