Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నారాయణ భట్టాద్రికి పక్షవాతం వచ్చింది. ఆ వ్యాధి రాలేదు, ఆయన కోరి తెచ్చుకున్నారు.
భట్టాద్రి గురువు అచ్యుత పిషారటి. ఆ గురువుకు సంభవించిన వ్యాధిని తనపై తీసుకుంటానన్నాడు నారాయణ భట్టాద్రి.
గురువు అంగీకరించలేదు. చివరకు నారాయణ భట్టాద్రి దీనాతి దీనంగా ప్రాధేయ పడటం వలన, గురువు “సరే” అన్నాడు.
ఆ వ్యాధి పిషారటి గురువు నుండి శిష్యుడైన నారాయణ భట్టాద్రికి వచ్చింది.
నారాయణ భట్టాద్రి ఆ వ్యాధిని తీసుకోవటం గురు సేవగా భావించాడు. అది సంతోషమే.
గురు చరిత్రలో దీపకుడు, రామకృష్ణ పరమహంస చరిత్రలో నాగ మహాశయుడు గురు సేవ చేయ సంకల్పించిన ఉత్తమ శిష్యులు.
అయితే బాధను గైకొన్న నారాయణ భట్టాద్రి, ఆ బాధకు తట్టుకోలేకపోయాడు.
వివిధ వైద్య ప్రక్రియలు ప్రయత్నించాడు. నారాయణ భట్టాద్రి గురు సేవను, ఆ గురువు తెలుసుకుని,
తన శిష్యునకు కలిగిన ఆ బాధను తొలగించగల శక్తి, ఆ గురువుకు లేదా? గురు సేవను ప్రోత్సహించే దైవానికీ సంగతి తెలియదా? తెలిసి ఊరుకున్నాడా?
నారాయణ భట్టాద్రి కూడా తనకు కలిగిన వ్యాధి తన సేవా ఫలమే అని ఊరుకుని, బాధను అనుభవించ వచ్చును కదా? అలా నారాయణ భట్టాద్రి ఎందుకు చేయలేదు.
చివరకు నారాయణ భట్టాద్రి ఎలుత్తాచ్చన్ అనే మలయాళీ మహనీయుని కలిశాడు, వ్యాధిని గూర్చి చెప్పాడు.
అంతా విని “చేపతో మొదలెట్టు” అన్నాడు. నారాయణ భట్టాద్రి నంబూద్రి బ్రాహ్మణుడు. మత్స్య మాంసాదులను ఆయన దరి చేరనీయడు.
ఆ సంగతి తెలిసి కూడా ఎలుత్తాచ్చన్ “చేపతో మొదలు పెట్టు” అని ఎందుకన్నాడా అని ఆలోచించాడు. అందులో ఏదో దైవ సంకల్పముందని గ్రహించాడు.
వెంటనే నారాయణ భట్టాద్రి గురువాయూర్ లోని కృష్ణ మందిరం చేరాడు అతి కష్టం మీద. వెంటనే ఆలోచన వచ్చింది.
ఇక చేపతో, అంటే మత్స్యావతార వర్ణనతో శ్రీకృష్ణుడిని ప్రార్ధించసాగాడు. రోజుకు పది శ్లోకాలు చొప్పున ఆ కృషుని ప్రార్ధించాడు.
ఇలా వంద రోజులు గడిచాయి. నవంబరు 27, 1597న అన్ని శ్లోకాలను పూర్తి చేసి శ్రీకృష్ణుని ప్రార్ధించాడు.
వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుండి ఆ గ్రంథరాజము పారాయణీయ గ్రంథమైనది.
నారాయణీయం పూర్తి అయిన మాసం మలయాళ పంచాంగం ప్రకారం వృశ్చిక మాసం (నవంబర్ 15 – డిసెంబరు 15) ఆ దినాన మలయాళీయులు పండుగ చేసుకుంటారు.
సర్వ కార్యములను (కోర్కెలను) తీర్చు గ్రంథమును నారాయణ భట్టుచే రచింప దలచాడు భగవానుడు. నారాయణ భట్టు వలె ఆ నారాయణుని (శ్రీకృష్ణుని) స్తుతించెదము గాక!
“….నీ పాదమూలం నిత్యం నా చిత్తము నందు నిలచి, ఆశేష తాపాలను హరించి, పరమానంద సందోహ లక్ష్మిని అనుగ్రహించు గాక!”
హరి ఓం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఒక్కడు చాలు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 27
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
- స్వామి నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 1
- రాతి హృదయము …. మహనీయులు – 2020… జూన్ 26
- గొడ్డలికి పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments