Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా దగ్గరకు నానా సాహెబ్ చందోర్కరు అనే భక్తుడు తనకు సాయి సాయం చేయలేదని మూతి బిగించుకుని కూర్చున్నాడు.
సుబోధానందుడు తల్లిదండ్రులకు తెలియకుండా తన దైవమైన రామకృష్ణులను సందర్శించుకునే వాడు.
ఒకసారి సుబోధానందుడు రెండు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తనను చూచే వారెవరూ లేరు.
ఒక రాత్రి నీటి కుండ వద్దకు దాహం తీర్చుకుందామని పోతుంటే, స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు.
స్పృహ వచ్చిన తరువాత “గురుదేవా, నేను చాలా బాధపడుతున్నాను. నన్ను చూచుకునే వారెవ్వరు లేరు. నా అంతట నేను ఒక గ్లాసు నీరు త్రాగే శక్తి కూడా నాకు లేదు”. అని తన బాధను చెప్పుకున్నాడు రామకృష్ణులతో.
రామకృష్ణులు ఏనాడో మహాసమాధి చెందినా, ఆయన సజీవులే అనే దృఢ నమ్మకం ఉంది అతనికి.
అప్పుడు సుబోధానందకు నిద్ర పట్టింది. ఆ స్వప్నంలో రామకృష్ణులు “ఎందుకలా కంగారు పడతావు? నేను ఎల్లా వేళలా నీ దగ్గరే ఉండటం నీవు గమనించలేదా? నీ కేం కావాలి? ధనమా? సేవకులా?” అని అడిగారు.
సుబోధానందులు “ఆ రెండూ నాకు అవసరం లేదు. ఈ దేహమున్నంత వరకు ఎలాగూ రోగ బాధలను తప్పించుకోలేను. నేను ఎల్లప్పటికి మిమ్మల్ని మరువకుందును గాక! అదే నాకు కావలసింది.
నేను ఎక్కడకు వెళ్లినా మీరు నాతోనే ఉండండి” అని వేడుకున్నారు రామకృష్ణులను. స్వప్నం అయిపోయింది.
తెల్లవారింది. ఒక వ్యక్తి సుబోధానంద వద్దకు వచ్చాడు. అక్కడ వైదిక కర్మకాండను జరపటానికి వచ్చాడు.
“ఈ వైదిక కర్మ చేయటంకన్న ఆ కుటీరంలో జబ్బుపడ్డ సన్యాసికి సేవ చేయటం వలన ఎక్కువ పుణ్య ఫలం పొందగలవు, అని జగజ్జనని నాకు చెప్పింది. అందుకని వచ్చాను” అన్నాడా వ్యక్తి.
స్వామి సుబోధుని కన్నులలో నీరు తిరిగింది. అవసరం లేదని సున్నితంగా ఆ వ్యక్తిని పంపివేశారు సుబోధానందులు.
మరునాడు మరో సన్యాసి సుబోధానందుల వద్దకు వచ్చి “నిన్ననే నాకు డబ్బు వచ్చింది. మీకు ఆహారం, మందులు కావాలి. ఈ ధనం స్వీకరించండి” అని డబ్బు ఇవ్వబోయాడు.
ఆ సన్యాసి ఇవ్వబోయిన ధనాన్ని సున్నితంగా తిరస్కరించారు సుబోధానందులు.
వెన్నంటి ఉండే రామకృష్ణులు చాలు – ఇక ఏమీ అక్కరలేదు.
సాయి సచ్చరిత్రలో రహదారిలో దొంగలచే చావు దెబ్బలు తిన్న కాశీరాంను కొందరు చూచి అతనిని ఆసుపత్రికి తీసుకు పోవటానికి ప్రయత్నించగా, కాశీరాం తనను సాయి వద్దకు తీసుకు పొమ్మని కోరాడు. ఇది సద్గురువుపై విశ్వాసం.
స్వామి సుబోధానందుల వారు డిసెంబర్ 2, 1932లో దేహాన్ని విడిచి రామకృష్ణునిలో ఐక్యమయ్యారు.
నేడు డిసెంబర్ 2. ఆయన వర్థంతి.
సద్గురువు మనలను నీడ వలె వెన్నంటి ఉండమని వేడుకుందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఇంపు – కంపు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 12
- జీవన్ముక్తుడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 7
- దైవమె సుమా! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 29
- జ్ఞానేశ్వరుని పుత్రిక …. మహనీయులు – 2020… డిసెంబరు 19
- గురు శిష్యులు వేరు కాదు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments