Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నెల్లూరు నుండి సాయి బంధువు ఇందిరవాణి గారు తమ స్వీయ అనుభవాన్ని సాయి బంధువులందరితో పంచుకోవడానికి saileelas.com కి పంపారు. అందుకు వారికీ మా కృతజ్ఞతలు . బాబా వారి దివ్య ఆశీస్సులు వారికీ సదా అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ అద్భుత లీలను చదివి ఆనందించిండి ప్రియ సాయి బంధువులర..
సాయి నాధ్ మహరాజ్ కి జై :-
సాయి అంటే తల్లి తండ్రి దైవం అని అంటారు. నా 12సం”ల వయస్సు లో నేను బాబా ని ఒక తాతయ్యగా అనుకునేదాన్ని. వయస్సు తో పాటుగా బాబా పట్ల నా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి .
ఇప్పుడు సాయి నాది అనుకునే నాయింటికి యజమాని. అన్నీ ఆయనే. బాబా నాపట్ల చూపే ప్రేమ కి నేను బానిసను. నా అనుభవం సాయి భక్తులతో పంచుకునే చిన్న ప్రయత్నం.
మావారు రైల్వే లో జాబ్. మేము డోర్నకల్ లో వుండేవాళ్ళం. 1998 వ సంవత్సరం లో మాబాబుకి 3″సం. ల” వయస్సు. ప్రతి రోజూ సాయంత్రం హారతి కి వెళుతూవుండేవాళ్ళం.
చాలా వరకు సాయి సేవలలో గడిపేవాళ్లం. మాపుట్టిల్లు చీరాల. మా అమ్మ బలవంతం మీద దసరా సెలవలకి ఊరు వెళ్ళాం. మాకు వెళ్ళటం, అసలు ఇష్టం లేదు. 2రోజులు భారంగా., గడిచాయి.
మనసంతా బాబా గుడిలో, దసరా ఉత్సవాలపైనే. మేము లేకుండా, అన్నదానం జరుగుతోంది కదా, సేవచేయ లేకపోతున్నా మేఅనేబాధ.
ఇంతలో పూజారి గారి, నుండి ఫోను . మీరు దసరా పండుగ కు రావలసిందే, అన్న దానం మీరు లేకుండా ఎలా అని ” ఇక అంతే అమ్మ కి ఎలాగో నచ్చచెప్పి వూరికి బయలుదేరాము. బాబా సేవ చేసే సంబరంతో.
వేకువజామున మెయిల్ ఎక్కి విజయవాడ లో ఉదయం 6 గంటలకు దిగి డోర్నకల్ వెళ్లటానికి గోల్కొండ ఎక్స్ ప్రెస్ ఎక్కాలి. విజయవాడ లో దిగాం.
మా బాబుకి పాలు పడదామని చూస్తే పాలు విరిగి పోయాయి. మావారు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి బయటకు వెళ్ళి పాలు తెస్తాను అన్నారు. ఎక్కడ చూసినా ఖాళి లేదు.
ఒక చోట బెంచి ఖాళీగా ఉంది. ప్రక్కనే వాటర్ ట్యాంక్ ఉంది. ఆ బెంచీ ప్రక్కన, ఒకబిచ్ఛగాడు కూర్చోని, ఉన్నాడు. మాసిన తెల్లబట్టలు, చేతిలోబొచ్ఛె, ఒక కర్ర అంతా ఈగలు. ఒళ్ళు జలదరించింది.
ఇక్కడ ఎలా కూర్చోవాలిఅన్నాను. మావారు ఎలాగో అలా కూర్చోఅని పాలకోసం బయటకు, వెళ్లారు. ఆబిచ్చగాడు బాబు ని చూసి నవ్వుతున్నాడు.
నాకు విసుగ్గా అనిపించింది. ప్రక్కనే ఉన్న టాప్ దగ్గర, బాటిల్ కడుగుదామని వెళ్ళా. ఇంతలో విశాఖపట్టణం ఎక్స్ ప్రెస్, వచ్చింది. అంతా ప్రయాణికుల అరుపులతో గోల గోల. బాటిల్కడుగుతూ బాబు వైపు చూశాను.
అంతే మైండ్ బ్లాంక్ బాబు అక్కడ లేడు. బాటిల్ అక్కడే పడేసి సాయి అని బాబుని పిలుస్తూ చుట్టూ ప్రక్కల చూస్తూ ఏడుస్తూ అందరి నీ అడిగితే, అలా ఎల పిల్లాడ్నీ, వదిలి వెళ్లారు,
బుద్ది వుండాలి అని తిట్టటం మొదలేట్టారు. ఎమి చేయాలో అర్థం కాక ఎడ్చే స్తున్నా. బాబా. నా బిడ్డ ఏడి అని . ఎదురుగా., ఉన్న ఎక్స్ ప్రెస్ కదిలింది.
ప్రయాణికుల హడావుడి. అంతా అయోమయం. ఒకపక్క లగేజి. అందరూ తలా ఒకమాట తిడుతున్నారు అక్కడ బెంచి దగ్గర, కూర్చున్న బిచ్చగాడు, లేచి నావైపు చూసి, సైగలు చేయటం మొదలుపెట్టాడు.
వీడిగోలేంటి మధ్యలో అని అవతలికి ఫో అన్నట్టు చూశాను. నాకు విసుగ్గా, కోపం గా అనిపించింది.
బిచ్చగాడు కోపం గా అరుస్తూ నావైపు చూస్తూ, తన చేతిలోవున్న, బొచ్చె ని కదిలే బండి వైపుబలంగా విసిరేసాడు. నేను అసంకల్పి తంగా చెవులుమూసుకుంటూ భయంగాబొచ్చె విసిరిన వైపు చూశాను.ఎదురుగా కదిలే ట్రయిన్ లో, కూర్చోని మాబాబు టాటా చెబుతున్నాడు.
బాబా నాబిడ్డ అని ఏడుస్తూ సాయి అని పిలుస్తూ బోగి వైపు పరిగెత్తా ను.
కదిలే బండిలో నుండి తెల్లని లాల్చీపైజమా, వేసుకున్న, ముస్లిమ్ ఒకతను ఎక్కడో కూర్చున్న మాబాబు ని, ఎలా తెచ్చాడో ఏమో నేను డోర్ దగ్గరకు వెళ్ళే సరికి , బాబు ని అలవోకగా, నాచేతుల్లోకి విసిరాడు.
ఎలా పట్టుకున్నానో ఏమో ఆబాబాకే తెలియాలి. బాబు ని పట్టుకొని కిందపడిపోయాను. అంతా క్షణం లో జరిగింది. ఎవరో వచ్చి మమ్మల్ని పైకి లేపారు
నేను బాబు ని తీసుకుని మేము కూర్చున్న చోటు వెతుక్కుంటూ వచ్చాను. అక్కడి వారు ఎలా చూసావమ్మా బాబు ట్రయిన్ ఎక్కటం అని అడిగారు.
ఇదంతా ఆ బిచ్చగాడి పుణ్యమే అని బెంచి వైపు చూశా. అంతా శుభ్రం గాఉంది బిచ్చగాడు లేడు.
ఇక్కడ బిచ్చగాడు ఏడి? అనినివ్వెరపోతూ ప్రశ్నించా. నువ్వు కూర్చున్న ప్పటినుండీమేము ఇక్కడే ఉన్నాం. బిచ్చగాడు ఎవరూ ఇక్కడలేరుకదా, అన్నారు అంతే పెద్దగా ఏడ్చేసాను.
పిల్లవాడు దొరికాడు కదా ఊరుకో ఏడవబాకు అని పక్కవాళ్ళు అంటున్నారు.
నాకు ఒక్కదానికి కనిపించిన బిచ్చగాడు ఎవరు? నాచేతుల్లో బిడ్డని విసిరిన ది ఎవరు? అసలు అంత జనంలో నేను ఎందుకు పరుగెత్తాను అని ఆముస్లీమ్ కి ఎలా తెలిసింది అంత బరువు వున్న బిడ్డని కరక్టుగా నాచేతుల్లోకి ఎలా అందించగలిగాడు? అన్నీప్రశ్నలే.
అనిఅనుకుంటూ బ్యాగ్ ఓపెన్ చేశా . కర్చీఫ్ కోసం. బాబు బ్యాగ్ లాక్కు ని, దానిలోవున్న బాబా ఫోటో వున్న హారతి బుక్ తీసినా చేతుల్లో పెట్టి పకపక నవ్వుతూ బాబా బాబా అన్నాడు.
సాయి ఫోటో చూడగానే, నాప్రశ్నలకు సమాధానం దొరికింది. నాబిడ్డ ద్వారా నాకు సమాధానం ఇచ్చారు సాయి. మాయ వలన బాబాను తెలుసుకోలేకపోయానే అనిబాధ.
నా బిడ్డని నాకు పదిలంగా అప్పగించిన సాయి నాధ్ కి ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి? .
ఎంత పాపాత్మురాలినో కదా! ఎం…త…గానో అసహ్య పడ్డాను? క్షమించమని ప్రాధేయపడటం తప్ప నేనేమి చేయగలను?
ఈబొందిలో ప్రాణం వున్నంత వరకూ బాబా సేవచేయాలనుకున్నా. .
అందుకుగాను ఐదుగురు పిల్లలను 4″th. Class నుండి inter దాక చదివించాము. ఇద్దరిని డిగ్రీ వరకు చదివించే భాగ్యం బాబా మాకిచ్చారు.
మానవ సేవయే మాధవ సేవ అనేదాన్నిఅనుసరించి మాకు తోచిన సేవ ఆయన మాచేత చేయించారు ఇంకా ఏదో ఒకటి చేయిస్తున్నారు. ఇంతే మేముగా ఆయనకు తెలుపుకునే కృతజ్ఞతలు.
సాయి నాధ్ మహారాజ్ కీజై.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టిన బాబా-1
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio
- విగ్రహ రూపంలో కాపాడిన సాయినాధుడు–Audio
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బిచ్చగాని రూపంలో బిడ్డని కాపాడిన బాబా – ఇందిరా వాణి గారి అనుభవము–Audio”
Sreenivas Murthy
November 19, 2016 at 12:03 pmచాల thanks Madam . మంచి లీల Late గా పంపించారు. లీల జరిగిన సంవత్సరం సురేష్ సాయి కి పంపించండి update చేస్తారు.