సాయి తొమ్మిది గురువారముల వ్రతము – శివ–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

సాయి తొమ్మిది గురువారముల వ్రతము – శివ

సాయిరాం,

ప్రపంచం నలుమూలల ఉన్న సాయిభక్తులు సాయి 9 గురువారముల వ్రతమాచరించి మంచి ఫలితాన్ని పొందారని మనకు తెలుసు.

ఇది చాలా శక్తివంతమైనదని, మహిమగలదని రాయవలసిన అవసరం లేదు. దాని శక్తియొక్క తీవ్రత సూటిగా మీకు బాబా మీద ఉన్న నమ్మకం మీద ఆథారపడి ఉంటుంది.

యెవరైనా సరే , వయసు, కులం, ఆడ/మగ వివక్షత లేకుండా, మతం, వీటి నియమ నిబంధనలు ఏమీ లేకుడా చేయవచ్చు. బాబా రోజు ఏరోజైనా సరే ఈ వ్రతాన్ని ఆరంభించవచ్చు.

ఇప్పుడు నేను సాయి సోదరుడు శివ యొక్క సాయి వ్రతం అనుభవాన్ని మీకు వివరిస్తాను. ఈ సుందరమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నందుకు నేనతనిని అభినందిస్తున్నాను.

మీరు కూడా మీ సాయి తొమ్మిది గురువారముల వ్రత అనుభవాలను పంచుకోవాలనుకుంటే మాకు మెయిల్ చేయండి.

మీతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి నాకీ అవకాశమిచ్చిన పవిత్రమూర్తికి నా శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

నేను నా జీవితంలో గొప్ప కష్టాలలో ఉన్నప్పుడు, బాబా నా జీవితంలోకి వచ్చారు. బాబా నన్ను, మా కుటుంబాన్ని జీవితంలో యెన్నో కష్టాలనుండి అనవసరమైన పరిస్థితులనుండి రక్షించారు.  

చాలా కాలంగా మాజీవితాల్లో యేమి జరుగుతోందన్నది మేమెరగము.  మాస్టర్ (బాబా) మీద నానమ్మకం చంచలంగా ఉంటూఉండేది కాని యెలాగో బాబా నన్ను సరైన గాడిలోకి తీసుకువచ్చారు. 

చాలా అనుభవాలలో నేనొక అనుభూతిని వివరిస్తాను. (తొమ్మిది గురువారాల వ్రత మహత్యం)

కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నాకు ఇప్పుడు చేస్తున్నలాంటిదే మరొక మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలిపెట్టిన రోజులలో జరిగిందిది.

మొదటి రెండు నెలలు నాకు తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుందని బాగా ఆశతో ఉన్నాను.

పరిస్థితులు దిగజారడం మొదలెట్టాయి, నా తల్లితండ్రులు కూడా నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందసాగారు. యింకా చెప్పలంటే నా మూర్ఖత్వం వల్ల మా నాన్నగారికి ప్రమాదం సంభవించింది.

చేతిలో డబ్బు లేక నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాన్నగారి మంచి మిత్రులు కొంతమంది సహాయంతో, నా బంధు వులతోనూ పరిస్థితిని నెట్టుకొస్తున్నాము.

యిదంతా కూడా నా సోదరి తొమ్మిది గురువారముల వ్రతం చేస్తున్నప్పుడు, జరిగింది. అది నాకు తెలీదు. ఆమె 8 వ్రతాలు పూర్తి చేసింది, కాని మా నాన్నగారు ఆస్పత్రిలో ఉండటం వల్ల ఆఖరి గురువార వ్రతం చేయలేకపోయింది.

కాని బాబా దయతో అన్నీ చక్కబడ్డాయి. మా నాన్నగారు చాలా త్వరగానే కోలుకుని, యింతకు ముందులాగే యెటువంటి బాధ లేకుండా నడవగలుగుతున్నారు.

ఆఖరి గురువారమునాడు నా సోదరి ఆఖరి గురువారం వ్రతం పూర్తి చేయగానే, నాకు అదే గురువారము నాడు రెండు కంపెనీల నుంచి పిలుపు వచ్చింది ( ఇది ఒక అద్భుతమైన లీల లేకపోతే యిన్ని నెలలుగా నాకు ఏ కంపెనీ నుంచి పిలుపు రాకుండా, నాసోదరి గురువారము వ్రతము ఉద్యాపన రోజునే పిలుపు రావడమేమిటి) అందరూ చెప్పిన సలహాప్రకారం నేనొకదానిని యెంచుకున్నాను అదికూడా బాబాగారి ఇష్ట పడ్డదె. 

అప్పటినుంచీ నేనెక్కడికి వెళ్ళినా బాబాగారు ఉన్నారనే అనుభూతిని పొందడం మొదలైంది.

నేనీ కొత్త కంపెనీ లో ప్రవేశించిన నాలుగు నెలల తరువాత ప్రాజెక్ట్ నిమిత్తమై అమెరికాకి పంపబడ్డాను. ఇక్కడా నాకు గొప్ప ఆశ్చర్యకరమైనది యేమిటంటే నేనొక మంచి మితృడిని సంపాదించాను,

అతను కూడా గొప్ప సాయి భక్తుడు. అతను నన్ను ప్రతి గురువారం సాయి మందిరానికి తీసుకుని వెడుతూ ఉండేవాడు.

నిజానికి సాయి నాకు యెంతో మంది స్నేహితులని బహుమతిగా ఇచ్చారు, వారంతా కూడా సాయి భక్తులే.

అందుచేత నేను సాయి భక్త స్నేహితులందరికీ చెప్పదలచునేదేమిటంటే ఈ సాయి తొమ్మిది గురువారముల వ్రతాన్ని కనక నమ్మకంతో చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది.

మరొక్కసారి నా హృదయాంతరాళలోనించి, నా మాస్టర్ సాయికి, నా ఉద్యోగంకోసం సాయి వ్రతమాచరించిన నా సోదరికి, మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నవారందరికీ, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

నా సాయి మనందరిమీద ఆయన అనుగ్రహపు జల్లులను కురిపంచుగాక.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles