Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
2002 మార్చ్ 14 న నేను మా కుటుంబసబ్యులతో కలసి షిర్డీ ని దర్శించు కోవాలిసి వచ్చింది నిజం చెపాలంటే షిర్డీ ప్రయాణానికి ముందు నేను హేతువాదినే. ఎంత కష్టమయిన నా పని నేను చేసుకోవటమే తప్ప దేవుడి మీద కానీ మరే ఇతరుల మీద గాని ఆధార పడటం నాకు పెద్దగా యిష్టముండేది కాదు. ఆసలు దేవుడే లేడు ఆనేదినా వాదన ! కానీ నా ఆబిప్రాయలకి పూర్తిగా వ్యతిరేకం గా వుండేది మా కుటుంబం. మా చిన్నఆమ్మాయి సరళ చిన్నతనం నుంచే షిర్డీ సాయి భక్తురాలు. బాబాకు నైవేద్యం పెట్టనిదే పచ్చి గంగఅయిన ముట్టేది కాదు. అయితే ఆమెకు లబించిన భర్త కూడా సాయి భక్తుడే కావటంతో వారి ఇల్లుఎప్పుడు ఒక సాయి మందిరం లాగా వుండేది.
వారి మనసుకి తగ్గట్లే ఆ దంపతులు పెళ్లి అయిన ఏడాదికే పండంటి పాపకు జన్మనిచ్చారు. అయితే ఆ పాపకు నామకరణ ఆన్నప్రాసనా రెండిటిని షిర్డీ లోనే జరిపిస్తాను ఆని మా ఆమ్మాయి మొక్కుకోవటంతో మా కుటుంబం అంత కలసి షిర్డీ కి ప్రయాణమయింది, ఒక్క నేను తప్ప! అయితే మా ఆమ్మాయి మాత్రం యిసారి ఎలాగయినా సరే నన్ను కూడా షిర్డీ తీసుకు వెళ్ళాలని బిష్మించుకు కూర్చోటంతో అందరితో పాటు నాకు కూడా టిక్కెట్ రిజర్వేషన్ అయింది. యి లోపల షిర్డీ కి బయలు దేరవలసిన రోజు రానే రావటంతో నాకు మాత్రం ఎలా తప్పించు కోవాలో ఎమాత్రం పాలుపోలేదు! చివరికి ప్రయాణానికి ఒక్క గంట మాత్రమే వ్యవది వుంది ఆనగా రైల్వే స్టేషన్నుంచి తిరిగి వెనక్కు బయలుదేరాను. ఆలా బయలుదేరిన నాకు మార్గ మద్యంలో “ప్రాణమేపోతున్న యితరుల ఆనందాన్ని మాత్రం భంగపరచుకు “ ఆనే వాక్యం తారస పడటంతో నా ఒక్కడి వల్ల అంతమంది సంతోషం పాడు కావటం యిష్టంలేక, యిష్టంలేక పోయిన వెనుతిరిగి వెళ్ళి ట్రైన్ లోకుర్చునాను. దానితో మా ఆమ్మాయి మరియు మిగత కుటుంబ సబ్యుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది. ఆలా ఆత్చంత వ్యయ ప్రయాసలతో బయలుదేరిన మేము మరుసటి రోజు ఉదయం కళ్ళ షిర్డీ గడ్డ పై ఆడుగు పెట్టాము. అయితే “ట్రైన్ దిగామో లేదో యింతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియని ఒక పకిర్ నేరుగా మా దగరికి వచ్చి ” జావ్ జావ్ లెండిబాగ్ మే మేరాబేటా కా సాత్ జావ్, అల్లహ్ ఆచ్చా కరేగా బచ్చి కో నామ్ మిలేగా ” అంటూ కేకలూ వేసుకుంటూవెళ్ళి పోయాడు. అయితే ఆప్పటి దాక మాతో ప్రయాణం చేస్తున్న కొంత మంది తెలుగు వారు ముఖ్యంగా బాబా పట్ల ఆవధుతల పట్ల స్టిరమైన ఆవగాహన వున్నవారు మాత్రం విషయాన్నిమాకు వ్యక్త పరచి నేరుగా మమల్ని వెళ్లి షిర్డీ లోని లెండిబాగ్ ని దర్శించుకొమ్మని సలహానివ్వటంతో వారు చెప్పినట్లు గానే మేమంతా కలసి లెండిబాగ్ కి బయలు దేరాము, అయితేఆలా బయలుదేరిన మేము సరిగ్గా ద్వారకామాయి సమీపించగానే లోపలికి వెళ్లి బాబా నుదర్శించుకున్న పిమ్మటే, లెండిబాగ్ కి వెళ్ళాలనే ప్రేరణ కలిగి, లోపలికి వెళ్ళే క్యూ లైను లోనిల్చునాము. అయితే బాబాను దర్శించుకోని తిరిగి వస్తున మాకు ఎవరో గుర్తు తెలియని కొందరు బాబా భక్తులు మీరు తెలుగువార అంటూ మమల్ని పరిచయం చేసుకొని, మీరు కనుక లెండిబాగ్ కు వెళ్తునట్లయితే ఇదుగోండి ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి లెండిబాగ్ లో బావి దగ్గర కూర్చొనిపారాయణ చేస్తున్న వారికి మా తరపున ఆందిచండి, అంటూ మా చేతిలో కొంత బాబా ప్రసాదాన్నివుంచి వెళ్ళిపోయారు.
అయితే యిది కూడా బాబా గారి లీల గానే బావించిన మేము వారిచ్చిన ప్రసాదాన్ని కూడా తీసుకోని లెండిబాగ్ కు బయలుదేరాము. అయితే లెండిబాగ్ లోని బావి దగ్గర మాత్రం జనం ఎవ్వరు పెద్దగ లేరు , ఒక మూలగా సుమారు 14, 15, సంవత్చరాల వయసు గల ఒక ఆబ్బాయి మాత్రంనిచ్చలంగా కూర్చొని పారాయణం చేసుకుంటూ కనపడ్డాడు. !అయితే ఎవరి ఆబ్బాయి?! వాళ్ళు ప్రసాదం అందించమన్నది యితనికేనా? పైగా ఆతడు ఎకాగ్రతుడై పారాయణ చేసుకుంటూవున్నాడు, యిలాంటి సమయంలో ఆతనికి ప్రసాదం అందించటం ఎలా ..? యిలా ఎ విదంగానూపాలుపోక సతమతమవుతూ వుండగా, మా ఆమ్మాయి కొంచెం దైర్యం చేసి వారు అందించమన్నప్రసాదాన్ని తీసుకోని ఆ ఆబ్బాయి ముందుకు బయలుదేరిది. అయితే యెంతటి దైర్యవంతులైన యోగ పూర్ణుల ముందు బలహినులే.. కదా! ఆ విధంగా దైర్యం చేసి వెళ్ళిందే కానీ మా ఆమ్మాయి మాత్రం ఒక్క ఆడుగు కూడా ఆతని ముందుకు వెయ్యలేక నివ్వెరపోయి ఆతని తేజ్జసునే చూస్తూ ఆతని కెదురుగా సాగిళ్ళపడి కూర్చుండి పోయింది. సుమారు 4, 1/2 గంటల తర్వాత పారాయణంపూర్తీగావించిన ఆ ఆబ్బాయి ఎమి సరళ ఆక్క ఎక్కడ ని కూతురు అంటూ మా ఆమ్మాయినిపలకరించి, మా కోసం వచ్చిన ప్రసాదం ఎక్కడ? అంటూ ఆడిగేటప్పటికి మా అందరికీ ఒక్కసారిగా ముచ్చెమటలు పోసినంత పని అయింది. ఎవరో పంపిన ప్రసాదం గురించి తెలుసుకోవటమే కాక మా ఆమ్మాయిని కూడా పేరుపెట్టి పిలిచిన ఆతని దివ్య దృష్టికి మా కుటుంబ సబ్యులు అంతనివ్వెరపోయి ఒక్కసారిగా ఆతనికి సాష్టాంగ నమస్కారాన్ని ఆచరించారు. అంతే కాకుండా మా చేతిలో వున్న చిన్న పాపను తన వొడిలోకి తీసుకోని హాయ్ ” సాయి కీర్తి ” అంటూ పలకరించిచేయ్యకనే చేసినట్లుగా నామకరణాన్ని చేసి , వేను వెంటనే సెకండ్ల వ్యవదిలోనే తన కొసమై తీసుకురాబడ్డ బాబా ప్రసాదాన్ని తన ఉంగరపు వేలితో తీసుకోని పాప పెదవులపై రాసి పెట్టకనేపెట్టినట్లుగా గోరుముద్ద్దలు తినిపించి, కళ్ళు మూసి కళ్ళు తెరిసే అంతటి కాలం లోనే యిటు నామకరణాన్ని ఆటు ఆన్నప్రాసనాన్ని రెండిటిని ఒకే కాలంలో ఆత్చంత ఆద్బుతంగా జరిపించి మమల్ని మా కుటుంభాన్ని చరితార్దులను గావించిన వారి కీర్తిని .. సాయి నాధుడు మాపై మా కుటుంబం పై చూపించిన దయార్ద హృదయాన్ని మేము మా కుటుంబం సబ్యులం జన్మ జన్మలకు మర్చిపోలేము. నిజానికి ఆ క్షణం లో మేము ఆనుభవించిన ఆనందం మాటల్లో చెప్పనలవికానిది. యోగ పూర్ణుల గురించి వినటమే తప్ప ప్రత్యక్షంగా ఆటువంటి వారి గురించి తెలుసుకోవటం నాకదే మొదటిసారి.
నిజానికి భక్తుల మనోబావలకు ఆనుకులంగా ఆనుభవాలని యిచ్చి తన భక్తుల భక్తీ విశ్వాసాలను పెంపొందించటంలో వారికీ వారె సాటి ఆని సాయి నాధుల వారు ఈ ప్రత్యక్ష లీల ద్వార మరోసారి తన భక్తకోటికి తెలియచేసారు.
అయితే 14, 15, సంవత్సరాల బాలుడుగా ఆనాడు షిర్డీ లోని లెండి బాగ్ లో మాకు దర్సనమిచ్చి మమల్ని మా కుటుంభాన్ని ఆబ్బుర పరచిన అ దైవిక బాలుడినే నేటి శ్రీ స్వామి జగద్విఖ్యాత గా గుర్తించి స్మరించు కోవటం నిజంగా మేము చేసుకున్న పూర్వజన్మ సృకృతం గా బావిస్తునాము. అయితే పొద్దుగూకే కొద్దీ నక్షత్రాలు బయటపడినట్లుగా కాలం గడిచేకొద్ది చిన్నతనం నుంచే వారు ప్రదర్శించిన లిలలన్ని ఒకొక్కటిగా బయటపడుతుంటే విని ఆశర్యచకితులం ఆవుతున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఆమ్మాయి నిత్యం తను పూజించే బాబా చిత్రపటంతో పాటు శ్రీ స్వామి జగద్విఖ్యాత గారి చిత్రపటాన్ని కూడా వుంచి నిత్యం పూజాది ఆబిషేకాలు చెయ్యటం ఆనవాయితీగా మార్చుకుంది. యిలా హేతువాదులను సైతం తమ ప్రధమ దర్శన బాగ్యం చేత నే పరమ భక్తులుగా మార్చగలిగిన ఆవధూతల శక్తి కి సదా ప్రణమిల్లుతూ”
భవదియుడు !
మాగంటి సత్యనారాయణ
కైకలూరు, క్రిష్ణాజిల్లా.
ఈ సమాచారం ఈ లింక్ http://shirdidwarakamai.blogspot.nl ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నేను ఎల్లప్పుడు నీతో లేనా? ఇంట్లో ఉండు, నా నామం స్మరించు
- రోజు కాకడ ఆరతి ఇచ్చే భక్తురాలికి ఎప్పుడైనా మెలకువ రాకపోతే, ఆవిడా తండ్రి గొంతుతో పిలచి నిద్ర లేపే బాబా వారు.
- సాయిబాబా వారి భక్తుల కోసం పరిగెత్తుకు వచ్చారు
- తమ భక్తుల షిర్డీ రాకకై తామే స్వయంగా టికెట్లు అందించిన అద్భుత లీల
- బాబా మాట వినక జ్వరము పాలగుట (తుకారాం బర్కు)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments