Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
‘‘అతనికి డబ్బులు చెల్లించండి.’’ బండివాణ్ణి ఉద్దేశించి, కాశీరాంతో అన్నారు బాబా.‘‘ఇస్తున్నా బాబా’’ అన్నాడు కాశీరాం.
బండివాడికి డబ్బులు చెల్లించాడతను. చేతిలో డబ్బుని ఆనందంగా చూసుకున్నాడు బండివాడు. రెండు మూడు రోజులుగా కట్టెల అమ్మకం జరగట్లేదు. దాంతో ఇంట్లో గంజి లేదు. భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు ఈ డబ్బుల్తో గంజి కాచుకోవచ్చనుకున్నాడతను. కృతజ్ఞతగా బాబాకి నమస్కరించి, వెళ్ళిపోయాడక్కణ్ణుంచి.
కట్టెల పోగు దగ్గరగా నడిచారు బాబా. చిందర వందరగా ఉన్న కట్టెల్ని నేర్పుగా మండేందుకు వీలుగా నిలబెట్టారు. సహకరించేందుకు ముందుకు వచ్చిన కాశీరాం, మహల్సాపతిని వారించారు.
చేతిలోని సటకాని ఓసారి చూశారు. నేల మీద తాటించారు దాన్ని. అంతే! మంట లేచింది. కట్టెలు అంటుకున్నాయి.
నాలుకలు సాచి మంటలు అంతెత్తున లేస్తోంటే చూసిన వారందరికీ అప్పుడు అడుగులు పడ్డాయి. బాబాని బెదిరించడం, ఆయన్ని వారించడం తమ వల్ల కాదనుకున్నారు, గ్రామస్తులు. అడుగులు పడిందే ఆలస్యం, అక్కణ్ణుంచి పరుగందుకున్నారు.
శ్యామాని చూశారు బాబా. దగ్గరకి రమ్మన్నట్టుగా సైగ చేశారు. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు శ్యామా.
’’అర్థం లేని ఆచారాలూ మూఢనమ్మకాలూ చూడెలా కాలిపోతున్నాయో! మంటల్లో మాడి మసైపోతున్నాయి. ప్రజల్ని బాధించే నమ్మకాల్నీ ఆచారాల్నీ పట్టుకుని వేళ్ళాడడం తప్పు శ్యామా! వాటిని ప్రచారం చేయడం పాపం కూడా!’’అన్నారు ‘‘బాబా’’
తన తప్పుని తెలుసుకున్నట్టుగా చేతులు జోడించాడు శ్యామా.
‘‘ఈ ‘ధుని’ ఇక అవిశ్రాంతంగా ఈ ద్వారకామాయిలో మండుతూనే ఉంటుంది. మండాలి. ఈ ధుని ఊదీయే జీవులందరికీ సంజీవని. దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చాలు, ఎలాంటి జబ్బు అయినా ఇట్టే నయమవుతుంది.’’ అన్నారు బాబా.
‘‘మహాప్రసాదం’’ అన్నారు మహల్సాపతి, కాశీరాం. అసహనంగా చూశాడు శ్యామా.‘‘ఏమిటి శ్యామా? ఎందుకంత అసహనంగా ఉన్నావు?’’ అడిగారు బాబా.
‘‘మసీదులో ధుని ఏమిటి బాబా? మతానికే విరుద్ధం.’’ అన్నాడు శ్యామా.
‘‘మతాలన్నీ మంటగలిసిపోవాలనే ఇక్కడ ఈ ధుని.’’ అని నవ్వారు బాబా.‘‘కాలుతున్న ఆ కట్టెకి మతం లేనప్పుడు, రేపు కాలిపోబోయే ఈ కట్టె(శరీరం)కి మతం కావాలా శ్యామా?’’ ప్రశ్నించారు.‘‘అల్లా మాలిక్’’ అంటూ కళ్ళు మూసుకున్నారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నీ నమ్మకాన్ని వమ్ము చేయలేను. లే’’ అన్నారు బాబా
- నా భర్తని పాము కరిచిందయ్యా!
- ‘‘గురువుని మించిన దైవం లేడు.”
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments