‘‘నీ నమ్మకాన్ని వమ్ము చేయలేను. లే’’ అన్నారు బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

‘‘నీ నమ్మకాన్ని వమ్ము చేయలేను. లే’’ అన్నారు బాబా. ఆమెను భుజాలు పట్టి నిలిపాడు.

అంతలో చనిపోయిన ఆమె భర్తని, బాబా దగ్గరకు మోసుకుని వచ్చారు కొందరు. శవాన్ని బాబా పాదాల దగ్గరగా ఉంచారు.

మసీదులో ధుని,శ్మశానంలా మసీదులో శవాలు…ఛఛ! ఏదీ పద్ధతిగా లేదనుకున్నాడు శ్యామా. అంత అసహనంలోనూ బాబా మహత్మ్యాన్ని పరిశీలించేందుకు ఉత్సాహాన్ని కనబరిచాడు.

బాబా ఇప్పుడేం చేస్తాడు? ఈ మృతదేహానికి ప్రాణం పోసి మామూలు మనిషిని చేస్తాడా? చెయ్యగలడా?‘‘ఏమో!

అల్లా మాలిక్‌’’ అన్నారు బాబా. శ్యామాని నవ్వుతూ చూశారు. ధుని దగ్గరగా నడిచి వెళ్ళారు. భర్త శవాన్ని చూస్తూ విలపిస్తూ ఉన్న స్త్రీని పిలిచారు. వచ్చిందామె.

‘‘ఈ ఊది తీసుకోమ్మా! తీసుకుని, నీ భర్తకి ఒంటి నిండా రాయి! వెళ్ళు.’’ అన్నారు బాబా.

ఆమె ఊది తీసుకుని, చనిపోయిన తన భర్త ఒంటి నిండుగా రాయసాగింది. గుప్పెడు గుప్పెడుగా రాసింది. అణువణువునా రాసింది.కళ్ళింతవి చేసుకుని చూడసాగాడు శ్యామా.

ఊది ఊపిరి పోస్తుందా? అనుకున్నాడు. పోసింది ఊది. అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తికి చేతనత్వం కలిగింది. కదిలాడతను. ఊపిరి తీసుకున్నాడు.

‘‘బాబా’’ అంది ఆమె. తన భర్త బతికాడు అన్న ఆనందాన్ని తట్టుకోలేక బాబాకి పడి పడి నమస్కరించింది.

శ్యామాకేదీ అంతుచిక్కట్లేదు. అంతా అయోమయంగా ఉంది. చూస్తూండగానే చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు.

ఒంటికి అంటి ఉన్న ఊదిని చూసుకున్నాడు. దులుపుకునే ప్రయత్నం చే యబోతే వద్దని వారించింది భార్య. సంగతంతా చెప్పి, అతను బతకడానికి కారణం ఆ ఊదేనని, దానిని కళ్ళకద్దుకోమంది.

అతను ఊదిని కళ్ళకద్దుకున్నాడు. తర్వాత బాబాకి నమస్కరించాడు.‘‘దీర్ఘాయుష్మాన్‌ భవ’’ అన్నారు బాబా. దీవించారు. వెళ్ళిరండి అన్నట్టుగా చేత్తో సైగ చేశారు.

తన భర్తని తీసుకుని, బంధు మిత్రులతో పాటుగా తరలి వెళ్ళిపోయిందామె.కళ్ళప్పగించి చూస్తూన్న శ్యామాని పిలిచారు బాబా. తేరుకున్నాడు శ్యామా.‘‘చెప్పండి బాబా’’ చేతులు జోడించాడు.

‘‘నమ్మకాన్ని మించిన వరం లేదు. నమ్మకాన్ని మించిన వైద్యం లేదు. ముందు నమ్మాలి. నమ్ము.’’ అన్నారు.

కళ్ళు చెమర్చుకుని, తల వంచుకున్నాడు శ్యామా.

 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles