నడుముకి పాత చిరుగుల గొంగడిని చుట్టుకుని తిరిగేవాడతను. అతని చేష్టలూ, చర్యలూ అన్నీ పిచ్చి పిచ్చిగా ఉండేవి. ఎవరి నుంచీ ఏదీ ఆశించేవాడు కాదతను. బాబాలా ఆ ఇంటికీ ఈ ఇంటికీ వెళ్ళి భిక్ష కూడా అడిగేవాడు కాదు.

షిరిడీ సమీపంలో ఉన్న కొండగుట్టల్లో తిరుగుతూ ఉండేవాడు. అక్కడి గుహల్లో తలదాచుకునేవాడు. అతనికి ఆకలీ దప్పికా ఉన్నదీ లేనిదీ తెలియదెవరికీ.

అతన్ని చాలా మంది పిచ్చివాడు అనేవారు. కొందరు మాత్రం ‘గొప్ప యోగి’ అనేవారు.