భక్త మహల్సాపతి 8వ బాగం..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

జిజూరి యాత్రలో సహాయం

మహల్సాపతి ప్రతి సంవత్సరం జిజూరిలో ఉన్న ఖండోబా ఆలయానికి పల్లకి తీసుకుని 150 మైళ్ళు ఊరేగింపుగా వెళ్ళడం ఆనవాయితి.  ఒకసారి మహల్సాపతి మరియు ఆయన బృందం జిజూరి యాత్రకు గుర్రాలపై బయలుదేరారు. పోలీసులు వాళ్ళను మధ్యలో ఆపి అనుమతి పత్రం లేదని వారిలో ఒకరిని ఆపటం జరిగింది. అందుకని వారు ముందుకు వెళ్ళలేక పోయారు. ఆ అనుమతి పత్రంలేని వ్యక్తి ఆ ఊరు కరణం దగ్గరకు వెళ్ళి అనుమతి పత్రం కోరడం జరిగింది. ఆ కరణం వాళ్ళకి కట్టెలు కొట్టే పని అప్పచెప్పాడు.

ఆయన ఎవరికి సహాయం చేసే వ్యక్తి కాదు. స్వార్ధంతో ఆ మనిషి చేత కట్టెలు కొట్టించాలని ఒక గొడ్డలని ఇచ్చాడు. కాని దాని కర్ర విరిగి పోయింది. అట్లా రెండు మూడు సార్లు విరిగింది. అప్పుడు ఆ కరణం “భగవంతుడు నిన్ను పని చేయనివ్వటం లేదు” అని అనుమతి పత్రం ఇచ్చి పంపించారు.

ఇంకొకసారి మహల్సాపతి బృందం 150 మైళ్ళు నడిచి జిజూరి చేరారు. కాని ఆ సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రభలిపోయి ఉంది. అలా వారు ఊరిలోకి వెళ్ళలేక దిగాలుగ పల్లకికి ఆనుకొని నిలుచుండగా, తనవెనుక ఎవరో ఉన్నట్లు తిరిగి చుస్తే, అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు.

బాబా తనతో ఉన్నారని గుర్తించిన మహాల్సాపతి సాటివారికి  ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నారు.  ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరల షిర్డికి తిరిగి చేరగానే సాయి “యాత్ర బాగా జరిగింది కదూ! నీవు పల్లకినానుకొని నిల్చున్నప్పుడు నేనక్కదకొచ్చాను” అన్నారు.

అట్లానే ఒక సంవత్సరం తన తోటి భక్తులతో కలిసి జిజూరి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు మరొక బృందము కూడా వాళ్ళ వెనుక రావడం జరిగింది. ఆ బృందంలో మిలామి భగత్ పిల్కి అను భక్తుడు ఉన్నాడు. వాళ్ళకు మార్గం మధ్యలో కొందరు బందిపోటు దొంగలు ఎదురు పడటం జరిగింది. వాళ్ళ దగ్గర గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఈ బృందాలను దోచుకోవడానికి వచ్చారు. 

అప్పుడు మహల్సాపతి వాళ్ళపై తన దగ్గర ఉన్న రంగోలిని ప్రసాదంగా వాళ్ళపై జల్లడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమి చేయకుండా చెట్లలోకి వెళ్ళడం చూసి ఈ బృందాలు మెల్లగా జారుకున్నాయి. కొంచం దూరం వెళ్ళిన తరువాత చూస్తే ఆ పల్లకిలో విగ్రహం లేదు. మనము దేవుడు లేని పల్లకి మోస్తున్నాము అనుకొన్నారు. ఆ రోజు ఆదివారం, వాళ్ళ ఆచారం ప్రకారం అయితే పల్లకిని ఆ రోజు మోయకూడదు.

అప్పుడు ఖండోబా మహల్సా ఒంటి పైకి వచ్చి “ఈ రోజు పల్లకి మోయవద్దు. నేను ఈ రోజు కొండ మీద వేటకు వెళ్తున్నాను” అని ఖండోబా చెప్పారు. వేట అవ్వగానే నేను షిర్డికి వస్తాను, మీరు వెళ్ళండి అని ఖండోబా మహల్సాపతి ఒంటి మీద నుంచి వెళ్ళడం జరిగింది. వారు పల్లకితో  సహా షిర్డి వచ్చారు.

శాఖారాం కండూకర్ మొదలైన వారు పల్లకి చూడడానికి వచ్చి పల్లకిలో అన్ని విగ్రహాలు ఉండడం చూసి, మహల్సాపతిని ఇలా అడిగారు. విగ్రహాలు పోయాయని చెప్పారు. మరి విగ్రహాలు ఉన్నాయి కదా! షిర్డికి రాగానే విగ్రహాలు వాటంతట అవే ప్రత్యక్షం అవడం బాబా లీల కాక ఇంకేమయి ఉంటుంది. అని అందరు అనుకున్నారు.

ఇలా బాబా ఎన్నోసార్లు మహల్సాపతి వెన్నంటే ఉండి ఒక రక్షణ కవచంలాగా రక్షించడం జరిగింది. మనము ఎప్పుడైతే బాబాకు శరణాగతి చేస్తామో, అప్పుడు బాబాతో మనకి రుణానుబంధం ఏర్పడుతుంది. బాబా తన భక్తులను రక్షించడంలో తన శరీరాన్ని కూడా లెక్క చేయని ఘటనలు కూడా మనము చూశాము.

రేపు తరువాయి బాగం….

ఓం శ్రీ సాయి రామ్ !

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles