Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
సాయి భక్తులలో అత్యంత ముఖ్యుడు మొదటివాడు మహల్సాపతి అతడు బంగారు పని చేసుకుంటూ శిరిడీలోని ఖండోబా ఆలయంలో పూజారిగా కూడా పనిచేసేవాడు. బాబాను గొప్ప మహానీయుడని మొట్టమొదట గుర్తించినది మహల్సాపతే. బాబాను మొదటి నించి చివరి వరకూ భక్తితోనూ విశ్వాసంతోనూ పట్టుదలతోనూ సేవించి తరించినవాడు మహల్సాపతి.
ఆయన పూర్తీ పేరు మహల్సాపతి చిమనాజీ నగారే. ఎప్పుడు జన్మించారో ఆవివరాలు తెలియవు. కాని, చనిపోయేనాటికి ఆయన వయస్సు 85 సంవత్సరాలు. ఆయన వృత్తిరీత్యా కంసాలి. తండ్రి తాతల నుంచి అందరూ కూడా షిరిడీలోనే నివాసమేర్పరచుకొన్నారు.
వారి కులదేవత ఖండేరాజ్ (ఖండోబా). పూనా జిల్లా జుజూరీ గ్రామంలోని దేవాలయం ఖండేరాయ్ (ఖండోబాకి) అంకిత భక్తుడు. సంవత్సరంలో ఒకసారయినా జిజూరీ యాత్రకి వెడుతూండేవాడు.
శిరిడీలో బాబా కనిపించిన క్రొత్తలో ఆయన పిచ్చి ఫకీరనే అందరూ తలచేవారు ఎందుకంటే ఆయన పిచ్చివాడిలా ప్రవర్తించేవారు తనలో తానె మాట్లాడుకునేవారు నిష్కారణంగా కోపించేవారు కానీ బాబాను చూడగానే మహల్సాపతి మాత్రం బాబా గొప్ప తనాన్ని గుర్తించి సేవించసాగాడు తన సమయమంతా ఆయన సన్నిధిలో సేవలోనే గడిపేవాడు.
బాబా మొదటిసారి శిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలం శిరిడీలో ఉండి తర్వాత ఎటో వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక పెళ్లి బృందంతో కలిసి శిరిడీ చేరారు. బాబాను మహల్సాపతి వెంటనే గుర్తుపట్టి ఆయనను “యా సాయి” (రండి స్వామీ) అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి ఆయనకు “సాయిబాబా” అనే దివ్యనామం స్ధిరపడింది.
తన స్నేహితులయిన కాశీరాం షింపీ, అప్పా జాగ్లే లను మహల్సాపతి బాబాకు పరిచయం చేశాడు. వారిద్దరూ కూడా ఎంతో ఉదార స్వభావులు, భక్తి భావం కలిగినటువంటి వారు. సాధువులు, సన్యాసులు అంటే వారికెంతో గౌరవం. అటువంటి వ్యక్తులు గ్రామంలోకి ఎవరు వచ్చినా వారెంతో గౌరవ భావంతో స్వాగతం పలికేవారు. ఆవిధంగానే బాబాను కూడా గ్రామంలోనికి ఆరాధనా భావంతో స్వాగతం పలికారు.
అంతేకాదు బాబా పూజను మొట్టమొదట ప్రారంభించినవాడు మహల్సాపతి. అతడే మొదట బాబాను పూజించాడు. అందరూ ఆయన్ని పిచ్చివాడిగా భావిస్తున్న సమయంలోనే ఆయనని భగవంతుడుగా ూగుర్తించి పూజించిన వాడు. ఆయనకి రొజూ చందన మద్ది పూజించి బాబాని పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించిన వాడు మహల్సాపతి.
కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, సాక్షాత్తూ భగవంతుని సన్నిధిలో వున్నానని తెలిసి కూడా ఆయన్ని ఏ రోజు ఏ కోరిక కోరని వాడు. ఒక్కొక్క సారి మహల్సాపతి ఇంట్లో పది రోజుల వరకు కూడా తినడానికి ఏమీ వుండేది కాదట. అయినా అపరిగ్రహ వ్రతాన్ని పాటించి బాబాని ధనం గాని మరే ఇతర లౌకిక వస్తువులు గాని కోరలేదు. అతడిని చూసి క్రమంగా అందరూ బాబాకు పూజ చేయడం ప్రారంభించారు అలా మనందరికీ బాబాను పూజించుకునే సాంప్రదాయాన్ని మొదలు పెట్టాడు మహల్సాపతి.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- భక్త మహల్సాపతి 2వ బాగం..
- భక్త మహల్సాపతి 7వ బాగం..
- భక్త మహల్సాపతి 6వ బాగం..
- భక్త మహల్సాపతి 8వ బాగం..
- భక్త మహల్సాపతి 5వ బాగం..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments