Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
బాబా మూడురోజుల సమాధి
సాయిబాబా శరీరాన్ని వదలడానికి ముప్పై రెండు సంవత్సరాలకు పూర్వమే వారి సమాధి అయిపోయి ఉండేది. కాని మహల్సాపతి యొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట సంఘటన ఆగింది. 1886వ. సంవత్సరం డిశంబరు నెలలో మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు బాబా విపరీతమయిన ఆయాసంతో అస్వస్థులయ్యారు.
రాత్రి పది గంటల సమయంలో బాబా మహల్సాపతితో తాను తాత్కాలికంగా సమాధి స్థితిలోనికి వెడుతున్నానని చెప్పారు. తన శరీరంలో ప్రాణం ఉండదనీ, మూడు రోజులు విశ్రాంతిగా ఉంటాననీ చెప్పారు. మూడు రోజుల తరువాత తిరిగి తన శరీరంలోకి ప్రాణం వస్తుందనీ అప్పటివరకు కదలకుండా తన శరీరాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని చెప్పారు.
ఒకవేళ అలా కాక తన ప్రాణం తిరిగి రాకపోయినట్లయితే మసీదులోని సభా మండపంలో ఒక మూలన ఉన్న స్థలాన్ని వ్రేలితో చూపించి అక్కడ నా సమాధి కోసం త్రవ్వి ఆ స్థలంలో తన శరీరాన్ని సమాధి చేసి ఆసమాధి మీద గుర్తుగా రెండు జండాలను పాతమని చెప్పారు. మహల్సాపతితో మూడురోజుల వరకూ నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు అని స్పష్టంగా చెప్పారు.
“నా సమాధి పై రెండు జండాలు ఉంచండి” అని చెప్పుతూ బాబా తమ ప్రాణాలను సహస్రారంలో నిలిపారు. శరీరధర్మాన్ని సహించటానికి ప్రాణాలను బ్రహ్మాండంలో చేర్చారు. ఆకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు నిశ్చేష్టగా పడిపోతే వారు క్రింద పడకుండా మహల్సాపతి తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు. బాబా యొక్క శ్వాసకాని, నాడికాని ఆడటంలేదు. బాబా ప్రాణాలు వదిలివేసినట్లే అనిపించింది.
మరునాడు షిరిడీ గ్రామ ప్రజలందరూ నిర్జీవంగా ఉచ్చ్వాశ నిశ్వాసలు లేని బాబా శరీరాన్ని చూసి ఆయన మరణించారని భావించారు. ఎవరికి నోట మాట రాలేదు. జనులకు ఆ పరిస్థితి భయంకరంగా ఉంది. జరగవలసిన లాంచనాలన్నీ నిర్ణయించి మహల్సాపతి చెప్పినదానికి ఏమీ అంగీకరించక బాబా శరీరాన్ని సమాధి చేయవలసిందేనని తీర్మానించారు.
కాని మహల్సాపతి ఒక్క అంగుళం కూడా కదలలేదు. బాబా తలను ఒడి నుంచి క్రిందకు దించలేదు. బాబ చెప్పిన ప్రకారం మూడు రోజులపాటు వేచి చూసినందువల్ల కలిగే నష్టమేమీ లేదని మహల్సాపతి అక్కడున్నవారితో చెప్పారు. బాబా చెప్పిన మాట ప్రకారం మూడు రోజుల తరువాత తప్పకుండా బాబా తిరిగి వస్తారని ఘంటాపధంగా చెప్పారు.
మహల్సాపతి అతిజాగరుకతతో అహర్నిశలూ సావధానంగా సాయిని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. బాబా సమాధి స్థితిలో ఉండటం చూసి, గ్రామ ప్రజలందరూ అక్కడ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు.
ప్రాణాలు పోయాయని తెలిస్తే, ఒక్కసారిగా భక్తుల గుండెలు అవిసిపోతాయని “మూడు రోజులు ఉంచండి” అని బాబా లోకులను మభ్యపెట్టారు అని భక్తులు అనుకున్నారు. సమాధిని త్రవ్వడానికి సాయి స్వయంగా ఆజ్ఞాపించినా గాని అలా చేయటానికి ఎవరికి ధ్యైర్యం చాలలేదు.
బాబా శ్వాస ఉచ్వాసలు ఆగిపోయాయి. వారి ఇంద్రియాలన్ని చలన రహితమయ్యాయి. ఏదీ కదిలే సూచన లేదు. శరీరంలోని వేడి కూడా మందగించింది. బాహ్య వ్యవహారాల స్పృహ అసలులేదు. వాక్కు ధృడ మౌనం వహించినట్లుంది. మరల ఎలా స్పృహకు వస్తారు అని అందరికి చింత పట్టుకుంది.
రెండు రోజులు గడిచిపోయినా బాబాకు స్పృహరాలేదు, మౌల్వి ఫకీరులు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించసాగారు. అప్పాకులకర్ణి, కాశీరాం వచ్చి బాగా ఆలోచించి, బాబా తన ధామానికి చేరుకున్నారు. కనుక వారి శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు.
అయితే ఇంత తొందర పనికిరాదు. కొంతసేపు ఆగటం మంచిది. బాబా ఇతరుల వలె కాదు. వారి మాట తిరుగులేనిది అని కొందరు అన్నారు. వెంటనే మిగతా వారు శరీరం చల్లబడిపోయింది, ఇక ఎక్కడి నుండి చైతన్యం వస్తుంది? అంతా ఎంత తెలివిలేనివారు అని అన్నారు.
వారిని సరియైన వేళలో సమాధి చేయడానికి వారు చూపించిన స్థలంలో త్రవ్వండి. భక్తులందరిని పిలవండి, అన్నీ సిద్ధపరచండి అని అలా చర్చించు కుంటూనే మూడు రోజులు గడిచిపోయాయి.
ఆ మూడు రోజుల పాటు కృతనిశ్చయంతో నిద్రాహారాలు లేకుండా మహల్సాపతి బాబా శరీరాన్ని తన ఒడిలో ఉంచుకొని కూర్చున్నారు. 72గంటలు గడిచిపోయాయి. సూర్యోదయానికి 3గంటల ముందుగా అనగా తెల్లవారుఝాము 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం కలిగింది. మెల్లమెల్లగా బాబాకు స్పృహ వచ్చింది. శరీరం కదిలింది. శ్వాస ఉచ్వాసలు మొదలయ్యాయి. పొట్టకూడా కదల సాగింది. బాబా వదనం ప్రసన్నంగా కనిపించింది. వారి కళ్ళు తెరుచుకున్నాయి. బాబా మహల్సాపతి ఒడిలోనించి లేచారు. మహల్సాపతి బాబా ముఖాన్ని సంతోషంగా చూచాడు. సాయిబాబా కూడా తలను ఆడించారు. మహల్సాపతికి ఆనంద పారవశ్యంతో కళ్ళంబట నీరు కారింది.
మౌల్వీలు ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలగిపోయింది. ఆ తర్వాత బాబా 32 సంవత్సరాలు జీవించారు.
మౌల్వీల యొక్క బలవంతానికి మహల్సాపతి బాబా ఆజ్ఞను పాలించకుండా, తన నిర్ణయాన్ని ఏ కాస్త సడలించి ఉన్న కఠిన పరిస్థితి ఏర్పడేది. కాని బాబా మీద విశ్వాసంతో మూడు రోజులపాటు కొంచెం కూడా కదలకుండా అలాగే కూర్చున్నాడు మహల్సాపతి. అంతటి బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాడు మహల్సాపతి.
మహల్సాపతి ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా, గురువాక్య పరిపాలన చేసి తన నమ్మకాన్ని ఏమాత్రము సడలనివ్వకుండా మనందరికి గొప్ప ఉపకారం చేశారు. ఈ సేవ కేవలం మహల్సాపతి గారు మాత్రమే చేయగలరు. దీనివలన బాబా యొక్క బోధలు, లీలలు మనందరికి లభ్యం అయ్యాయి. 1886 నుంచి 1918 వరకు బాబా నిరవధికంగా ఎంతో మంది భక్తులను సంరక్షించడం జరిగింది. మహల్సా గనక ఈ ప్రయత్నంలో విఫలం అయితే అన్న ఆలోచన కూడా మనము జీర్ణించుకోలేము.
రేపు తరువాయి బాగం….
ఓం శ్రీ సాయి రామ్!
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- భక్త మహల్సాపతి 6వ బాగం..
- భక్త మహల్సాపతి 8వ బాగం..
- భక్త మహల్సాపతి 1వ బాగం..
- భక్త మహల్సాపతి 7వ బాగం..
- భక్త మహల్సాపతి 9వ బాగం..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments