Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా కరుణాహృదయం
ఈ రోజు అమెరికా నుంచి ఒక అనామిక భక్తురాలు పంపిన బాబా లీలను తెలుసుకుందాము.
ఇది 22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన
మా మేనమామకు అబ్బాయి పుట్టినప్పుడు వాక్సినేషన్ ఇంజెక్షన్ యొక్క సూది తొడలోని ఎముకకు తగిలి ఇంఫెక్షన్ సోకింది. బాబు కాలు కూడా కదల్చలేకపోయేవాడు. బాబుని డాక్టర్ గారికి చూపించాము. డాక్టర్ గారు పరీక్షించి చాలా చీము పట్టిందని చెప్పి తొడ భాగములో చిన్న ఆపరేషన్ చేసి, నడుము దగ్గరనించి కాలిపాదం వరకు కట్టు కట్టారు.
2 – 3 నెలల వయసున్న ఆ బాబుని ఆ స్థితిలో చూడటం మాకు చాలా బాధగా ఉండేది. ఆ సమయములో మేము గుంటూరులో వుండేవారము. మేము బాబుని చాలామంది ప్రముఖ ఎముకల వ్యాధులను నయం చేసే డాక్టర్స్ వద్దకు తీసుకుని వెళ్ళి చూపించాము. అందరూ కూడా పరీక్షించి బాబు నడవలేడని ఒకే మాట చెప్పారు. జీవితాంతమూ కఱ్ఱల సాయంతో కుంటుతూ నడవవలసినదేనని చెప్పారు.
10 నెలల వయసు ఉన్న బాబుని అటువంటి పరిస్థితిలో చూడవలసి వచ్చినందుకు మా కుటుంబమంతా ఎంతో బాధ పడ్డాము. ఆ సమయములో మా మేనమామ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మనస్ఫూర్తిగా ఎంతో భక్తితో తన బాబుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్ధించారు.
బాబుని ఢిల్లీలోని డాక్టర్ వద్దకు తీసుకునివెడుతూ కరోల్ బాగ్ లో ఆగారు. మా మేనమామ స్కూటర్ పార్క్ చేయడానికి వెళ్ళగా మా అత్తయ్య బాబుని ఎత్తుకుని కింద నుంచుని ఉంది. బాబుని మెత్తని తెల్లటి తువ్వాలులో చుట్టి పట్టుకుని ఉంది. లోపల కాలుకి కట్టు ఉంది . చూడటానికి భయంకరంగా ఉంది.
ఆ సమయంలో ఒక ముసలివ్యక్తి అక్కడికి వారికి చాలా దగ్గిరగా వచ్చాడు. మా అత్తయ్య మంత్రం వేసినట్టుగా అయిపోయి అతనిని వారించలేకపోయింది. ఆ ముసలి వ్యక్తి బాబుకు చుట్టిన తువ్వాలును విప్పి బాబు పాదం మీద ముద్దు పెట్టుకుని, “బాబు చాలా అందంగా ఉన్నాడు, బాబా ఆశీర్వదిస్తారు” అని వెళ్ళిపోయాడు.
మా అత్తయ్య అప్పుడు స్పృహలోకి వచ్చింది. వచ్చిన ఆ ముసలి వ్యక్తి ఎవరు, అతను కాలికి కట్టుతో ఉన్న బాబుని ముద్దు పెట్టుకుంటుంటే ఎందుకని వారించలేకపోయాను అని ఆశ్చర్యపడింది. జరిగినదంతా మా మామయ్యకు చెప్పింది. తరువాత ఇద్దరూ డాక్టర్ వద్దకు బాబుని తీసుకుని వెళ్ళారు. బాబుని పరీక్షించి డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా?
“బాబుని ఆడుకునేవాడిని ఆడుకోనివ్వకుండా ఎందుకంత పెద్ద కట్టుకట్టి కష్ఠపెడుతున్నారు? బాబు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. కాలిలో ఎటువంటి సమస్యాలేదు. ఇన్ ఫెక్షన్ కూడా లేదు” అని బాబుకు ఉన్న కట్టుని విప్పేశారు. బాబు తన రెండు కాళ్ళతోనూ చక్కగా ఆడుకుంటున్నాడు.
ఆ వచ్చిన ముసలి వ్యక్తి బాబా తప్ప మరెవరూ కాదు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కష్టములొ ఉన్న భక్తురాలికి, మరచిన మ్రొక్కును గుర్తు చేసిన బాబా వారు….
- పసివాళ్లుగా దర్శనం ఇచ్చిన బాబా, దత్త భగవానుడు…!
- భక్త రక్షణలో సదా అప్రమత్తుడు
- బాబా ని నమ్ముకున్న వారికి నమ్ముకున్నంత ;
- కంటి సమస్యను తీర్చిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments