భక్త రక్షణలో సదా అప్రమత్తుడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తుడు: డా. రాజశేఖర్

నివాసం: హైదరాబాద్

డా. రాజశేఖర్ హోమియోపతి డాక్టరుగా వర్క్ చేస్తున్నారు.

ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ వచ్చి గుడివాడలో పోస్టింగ్ వచ్చింది.

అప్పుడే స్కూలుకీ వెళుతున్న ఒక కూతురు, చిన్న బాబు ఉన్నారు.

పాపని దగ్గరలో ఉన్న స్కూల్లో జాయిన్ చేయించి, భార్య శ్యామల ప్రతి రోజు 12:30 PM కి స్కూల్ నుండి ఇంటికి తీసుకుని వచ్చేవారు.

ఒక రోజు ఎందుకో తెలియకుండానే 12:20 కి అలా అలారం పెట్టి, బాబుని పడుకోబెట్టి, ఏదో పని చేసుకుంటుంది.

అలారం మ్రోగగానే బెడ్ రూమ్ లో వచ్చి చూసేసరికి బాబు ఒళ్ళంతా రక్తంతో ఉంది.

ముక్కు నుండి రక్తం కారుతుంది. చూడగానే తనకి భయమేసింది.

ఏమి చేయాలో అర్ధం కాక రాజశేఖర్ గారికి కాల్ చేస్తే తాను అంబులెన్సులో ఏదైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పారట. ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటే.

అప్పటికే ఆ అపార్టుమెంటులో అక్కడ గుమిగూడిన వాళ్లలో ఒకరు అంబులెన్సు వచ్చేసరికి లేట్ అవుతుంది.

నా బైక్ మీద హాస్పిటల్ కి తీసుకువెళ్దాం పదండి అని అక్కడ ఏదో హాస్పిటలుకి తీసుకు వెళ్లారట.

బాబు కనురెప్పలు కొట్టుకోవడం ఆగిపోయాయి. అచేతనంగా, ఏ కదలిక లేకుండా ఉన్నాడట.

హాస్పిటల్ కి వెళ్ళగానే డాక్టరుకి చూపిస్తే ఆ డాక్టర్ బాబు పొట్ట మీద చేతితో ఒత్తేసరికి, గడ్డలు, గడ్డలుగా రక్తం నోటి నుండి వచ్చిందట.

అప్పటికే రాజశేఖర్ గారు హాస్పిటల్ కి వచ్చి పల్స్ చూస్తే కొద్దిగానే ఉందట.

మళ్ళీ కడుపు మీద ఒత్తేసరికి మళ్ళీ గడ్డలు గడ్డలుగా రక్తం వచ్చిందట.

మళ్ళీ పల్స్ చూస్తే కొంచెం బెటర్ గా అనిపించిందట. కను రెప్పలు కొంచెం ఆడించాడట.

ఆ డాక్టర్ ఎవరు తీసుకొచ్చారో కానీ, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, లేకుంటే చాలా ప్రమాదం అయి ఉండేది అని చెప్పారట.

ఇక్కడ మిరాకిల్ ఏంటి అంటే ఆ బైక్ పై తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని ఎవరికీ తెలియదట. అంతకు ముందు కానీ, ఆ తరువాత కాని, ఆ వ్యక్తిని అక్కడున్న వాళ్ళెవరు చూడలేదట.

బాబానే అలా ఆవ్యక్తి రూపంలో వచ్చి కాపాడారు అని బాబాకి హృదయపూర్వకంగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నారు ఆ దంపతులు.

       ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

*** సాయిసూక్తి: 

  “సాయి స్మరణం సర్వపాప హరణం”

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “భక్త రక్షణలో సదా అప్రమత్తుడు

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles