Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
Author:Kota Prakasam Garu
మనసా ! అదుపుతప్పకే
*****
ఎవరు కాదన్నా ,అవునన్నాసరే , ప్రతి మనిషికి ఏదో విషయంలో ఎటూ తేల్చుకోలేక అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది అన్నది నిజం ..
మనిషిది రెండు నాల్కల ధోరణి అంటారు ..
మనసు విస్తరించిన సామ్రాజ్యానికి చక్రవర్తిలా వ్యవహరిస్తుంది , అంతలోనే మళ్లీ మహామంత్రిలా “జాగ్రత్త”” అని హెచ్చరిస్తుంటుంది …
అవకాశాలకోసం అవకాశవాదాన్ని ఎంచుకొనేది మనసే, ఆశయానికి గండిపడితే , కోలుకోలేక క్రుంగి , కృశించిపోయేది మనసే…
చూసే చూపునుబట్టి ఆలోచనలు , ఆలోచనలనుబట్టి నిర్ణయాలు అంటారు ..
నిర్ణయాధికారం పెత్తనం చెలాయించే మనసుకు అప్పచెబితే దాని వ్యవహారతీరు అచ్చేసిన ఆంబోతులా తయారౌతుంది ..
ఒక మనిషి , రాజ్యాధికారాన్ని చేబట్టి నియంతలా దేశాన్ని శాసించగలడు ..
నిత్యము పోరుపెట్టి సతాయించే భార్యను అదుపుచేసుకోగలడు ..
పూటకు తిండిలేకపోయినా భరించగలడు కానీ మనసును అదుపుచేసుకొన్నానని , ఛాతీమీద చెయ్యివేసుకొని ధైర్యంగా చెప్పగలిగినవారు కొట్లలో వొకరున్నారంటే , ప్రపంచంలో అది ఎనిమిదో వింతగా చెప్పుకోవొచ్చు ..
గడచిన యుగాలు , స్వర్ణయుగం అంటారు ..
త్రేతాయుగానికి , ద్వాపరయుగానికి మద్య నాగరికతలో వ్యత్యాసం కనిపిస్తుంది .
పగలు రాత్రిలో తేడా కనిపించదు ఏ యుగంలోనూ ..
వృద్ధి చెందుతున్న మానవ మేధస్సుకు , మానసిక అన్వేషణ తోడైంది ..
అవసరానికి మించిన సౌకర్యాలకి , వేట మొదలయ్యింది ..
స్థాయికి మించిన తాపత్రయాలు పెరిగాయి , కొంత అనాగరికత చోటుచేసుకొని , ఆకర్షణలు అవధులు దాటుతున్నాయి.అణుగుణంగా మనిషి స్వభావము మారిపోతోంది ..
ఈ లక్షణాలు ఇలా ఉంటాయనే కలియుగ ప్రాబల్యం ఇలా ఉంటుందని ఎప్పుడో పురాణాలలో కూడా వర్ణించబడుతూ , స్వభావాలను స్వాంతనపరుచుకొనే ఉపాయాన్ని కూడా అందించబడింది ..
మనిషి తనకు తన ప్రయత్నంతో అదుపు చెయలేని , మనసు పగ్గాలను , విశ్వాసముంచి గురువు పాదాలకర్పించు , ఆ మనసు గతులకు ఏది శ్రేయమో అది ఆయన అనుగ్రహంతో ప్రసాదింపబడుతుంది అని .. ఇదే సచ్చరిత్రలో ఆయన ప్రబోధాల్లో అందరూ చదువుతున్న మాట కూడా …
ఒక సద్గ్రంధమైనా , ఒక మాహాత్ముని ప్రభోదమైనా మనిషి తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం ఉన్నంతవరకు , మనసు హద్దులుమీరి ప్రవర్తిస్తూనే ఉంటుంది ..
మనసా , వాచా , కర్మణా దాని పగ్గాలను ఆయనకప్పచెప్పే తెగింపు మొదలయితే , అది ఉత్తమ గతులను పొందే ప్రయత్నం చేస్తుందని పెద్దలమాట …
సద్గురువారం , అందరూ ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలని మనసావాచా కోరుకొంటూ
శ్రీ గురు చరణార్పణమస్తు
*******
Latest Miracles:
- మోక్ష గురువు …..సాయి@366 జూన్ 9…Audio
- గురువు తాను గురువును అని ఎవరికి చెపుకోడు,కానీ తన ఆచరణ ద్వారా తాను గురువు అని తెలుసుకుని సేవించుకోవలసినది మాత్రం మనమే.
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- బాబా (తల్లి,తండ్రి,గురువు)—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments