ఆ ఆటోవాని రూపంలో వచ్చినది, నన్ను ఆశీర్వదించింది, సాక్షాత్తు బాబాయే!!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా ఆడపడుచు గృహ ప్రేవేశం అయితే వెళ్లి తిరిగి వచ్చాము. చెన్నై నుంచి మా వారే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు .

అప్పట్లో మా వారు సిగరెట్లు బాగా కాల్చేవారు, ఆ రోజు రాత్రి నాకెందుకో గుండెల్లో మంటగా వుంది అని అయన అన్నారు.

నాకు అప్పటికి విభూతి రాస్తే గుణం వుంటుంది అని, దానికి మహత్యం వుంది అనేది తెలియదు. తను భాద పడుతుంటే “మూవ్” అనే పెయిన్ బామ్ రాసాను, అలాగే పడుకున్నారు.

తెల్లవారిన తరువాత బ్యాంకుకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే నేను వద్దు అన్నాను. బ్యాంకులో ఆడిటింగ్ జరుగుతుంది నేను వెళ్ళాలి, అని అనేసి వెళ్లిపోయారు.

ఆయన ఆడిటింగ్ పనిలో బిజీగా వుండటం వలన నేను ఆయనకు వెంట వెంటనే ఫోన్ చేయలేక పోయాను.

ఏది అయినా వుంటే తానే కాల్ చేస్తాను అన్నారు. నేను నా రొటీన్ పనిలో పడిపోయాను. సాయంత్రం దాక నాకు ఎటువంటి ఫోన్ రాలేదు.

నాకు ప్రతి బుధవారం దేవుడి గూడు అంతా శుభ్రం చేయటం అలవాటు. ఆ రోజు కూడా అలానే చేశాను.

సాయంత్రం 4:30 గంటలకి నాకు బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. ‘ అమ్మా గుండె దిటవు చేసుకోమని ‘ అవతల గొంతు. “ఫర్వాలేదు చెప్పమన్నాను ” నేను ఇవతల.

“అమ్మా నెహ్రుకి చాలా ప్రమాదం గా వుంది, సివియర్ హార్ట్ ఎటాక్ వచ్చింది, మేము హాస్పిటల్ కి  తీసుకొని వచ్చాము ” అంటూ హాస్పిటల్ పేరు చెప్పారు.

నేను గబగబా బయటకి వచ్చాను హాస్పిటల్ కి వెళ్దామని, ఆ సమయంలో బయట ఒక్క ఆటో కూడా లేదు,

దూరంగా ఒక షాపు ముందు కిరాణా సామాన్లు కొనుక్కుంటూ ఒక ఆటో అతను కనపడ్డాడు. గబగబా అక్కడికి వెళ్ళాను,

నాకు కన్నడ భాష రాదు, ఎవరైనా మాట్లాడితే కొంచెం అర్థం అవుతుంది.

ఆ ఆటో అతన్ని అడిగాను హాస్పిటల్ కి వెళ్ళాలి వస్తావా అని, అతను నేను రాను ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు.

నేను మరో నాలుగు అడుగులు వేసి మరో ఆటో ఏదైనా దొరుకుతుందేమో అని చూసాను, ఎక్కడా ఆటోలు నాకు కనపడలేదు.

మళ్ళీ కిరాణా కొట్టు సామాన్లు కొనుక్కుంటున్న ఆటో అతని దగ్గరకే వచ్చి బాబు నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తాను, నన్ను హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టు  అంటే,

అతను ఏమి అనుకున్నాడో గాని , ఏమైంది అని అడిగాడు . నేను ” మా వారికి హార్ట్ ఎటాక్ వచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేసారు చాలా ప్రమాదం గా వుంది ” అని చెప్పాను.

వెంటనే ఆటో అతను ఆటోలో పెట్టిన కిరాణా సామాన్లు పక్కన పెట్టి నన్ను కూర్చోమన్నాడు . నేను ఆటో ఎక్కాను.

అతను ఆటోను హాస్పిటల్ ముందు ఆపాడు. ఆ ఆసుపత్రి సరిగ్గా వారం రోజుల ముందే ఓపెన్ చేసారు.

మేము దాని ముందు నుండి వస్తూ పోతూ ఈ హాస్పిటల్ చూడటానికి ఏమీ బాగోలేదు, ఇందులో ఏ పేషెంట్స్ ని చేర్చుకుంటారు అని అనుకునేవాళ్లం .

ఆటో దిగి ఆటో అతనికి డబ్బులు ఇవ్వబోయాను , అతను నాకు డబ్బులు వద్దు అన్నాడు.

కాదు బాబు నేను ఏదీ ఊరికే తీసుకోను నువ్వు డబ్బులు తీసుకో అంటూ 10 నోట్లు 4, 5  అతని చేతిలో పెట్టి, గబగబా ఎమర్జెన్సీ వైపు నాలుగు అయిదు అడుగులు వేసాను.

ఆటో అతను ‘ అమ్మా ‘ అంటూ పిలిచాడు . మళ్ళీ ఇతను ఎందుకు పిలుస్తున్నాడో అనుకుంటూ వెనక్కి తిరిగాను.

అతని కుడి చెయ్యి బాగా పైకి ఎత్తి దీవిస్తున్నట్లుగా ‘ మీ ఆయనకి ఏమి కాదమ్మా ‘ అన్నాడు కన్నడంలో. .

అప్పుడు నేను ఆ వచ్చినది, నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళింది, నన్ను మీ ఆయనకి ఏమీ కాదంటూ ఆశీర్వదించింది, సాక్షాత్తు బాబాయే అని, నాకు తర్వాత ఎప్పుడో ఎదో ఒక సందర్భంలో ఎవరితోనో మాట్లాడుతుండగా బాబా నాకు స్ఫురణకు తెచ్చాడు.

 .The above Telugu text  typed by : Mr. Sai Krishna

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles