ఆ వచ్చింది సాక్షాత్తు బాబానే….G.A రాజ్య లక్ష్మి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా ఆడపడచు భర్తకి హార్ట్ ఎటాక్ వచ్చింది. నేను బాబా పూజలు చేస్తానని మా వాళ్లందరికీ తెలుసు. ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. చాలా సీరియస్ అని చెప్పారు.

రాణి (ఆడపడుచు) నా దగ్గరికి వచ్చి వదినా ఏదయినా చెయ్యి నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంది ఏడుస్తూ, నా పసుపు కుంకుమలు నిలుపు వదినా అంది.

నేను వెంటనే ఉదయం మొదలు పెట్టి సాయంత్రం వరకూ శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చెయ్యి అన్నాను. అది చేసింది. మా ఇంట్లో నేనూ చేశాను. ఇద్దరిది సాయంత్రానికి అయిపోయింది.

హారతిచ్చాము హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది సీరియస్ నుండి బయట పడినట్లుగా. మా రాణి ఆనందానికి అవధులు లేవు. నేనూ ఆనందించాను.

మా చెల్లెలికి బాబా తెలియదు. ఒక సారి దానికి హెర్నియా వచ్చింది. ఆపరేషన్ చేయాలన్నారు.

ఆపరేషన్ అంటే ఎవరికైనా భయమేగా చాలా భయపడుతోంది. హాస్పిటల్లో చేర్పించారు, నేనూ వెళ్ళాను. దానికి నేను బాబా కథలు చెప్పడం మొదలు పెట్టాను.

అంతా బాబా మీద భారం వెయ్యి అన్ని ఆయనే చూసుకుంటాడు అనే దాన్ని. ఒకరోజు అది నువ్వు అన్నీ బాబా గురించి చెబుతుంటే నాకెంతో బావుందే అక్కా నేను బాగయి ఇంటికి వెళ్ళగానే పారాయణ చేస్తానే అంది.

నీకు శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం కొనిస్తాను అని చెప్పాను. నేను ఏదో పని మీద బయటికి వచ్చాను.

ఇంతలో ఒక పెద్దామె చెల్లెలి మంచం దగ్గరికి వచ్చి మీరు ఈ పుస్తకం గురించే కదా అనుకుంటున్నారు. ఇదిగో నువ్వీ పుస్తకం తీసుకో అంటూ సాయి సచ్చరిత్ర పుస్తకం ఇచ్చి వెళ్ళిపోయింది.

మరలా అక్కడికి వెళ్ళేటప్పటికి నేనా పుస్తకం చూసి ఒసేయ్ భ్రమరాంభ! నీకు కొనిస్తానని చెప్పానుగా ఈ లోపు శంకరం గారిని (మరిది గారు) పంపించి ఎందుకే ఈ పుస్తకం తెప్పించుకున్నావ్ అన్నాను.

అక్కా నువ్వు అలా  వెళ్ళగానే ఒకామె వచ్చి నువ్వు ఈ పుస్తకం కోసమే కదా ఎదురు చూస్తున్నావు అంటూ నా చేతిలో ఈ పుస్తకం పెట్టి వెళ్ళిపోయింది అంది .

నేను  చాలా ఆశ్చర్య పోయాను . ఒసేయ్ భ్రమరాంభ ఆ వచ్చింది సాక్షాత్తు బాబానే, నీకా పుస్తకం స్వయంగా ఆయనే తన స్వహస్తాలతో అందచేశాడే నువ్వు చాలా అదృష్ట వంతురాలివే అన్నాను. చెల్లెలు కూడా కళ్ల నీళ్లు పెట్టుకుంది సంతోషంతో చిన్న పిల్లలాగా.

మా చెల్లెలి కొడుకు కార్తీక్ పెళ్లి పల్లవితో అయింది.పెళ్లి అయినా వెంటనే పెళ్లి వాళ్ళు  షిర్డీ కి ప్రయాణం అయ్యారు. వాళ్ళతో షిర్డీ కి నేనూ వెళ్ళాను.

పెళ్ళిలో మా మరిది గారు బాగా అలసిపోయిన కారణంగా ఆయనకీ ఒంట్లో బావుండని కారణాన మా చెల్లెలు, మరిదికి బదులుగా దాని మరిది తోడికోడలు మాతో పాటు షిర్డీ కి బయల్దేరారు.

ఆ అమ్మాయికి అసలు బాబా గురించి తెలియదు. బాబా గురించి అసలు వినలేదు కూడా. నేను ఆమెకి బాబా గురించి కథలు అన్నీ చెప్పాను.

అక్కా నువ్వు చెబుతూంటే నాకు ఆ పుస్తకం చదవాలని ఉంది. సరే ఆ పుస్తకం తమిళ్ లో కనుక దొరికితే నేను కొనిస్తాను అని చెప్పాను నేను. ఇంగ్లీషులో దొరికితే నువ్వే కొనుక్కోమ్మా అన్నాను.సరే అంది.

ఒక షాప్ లో ఒకే ఒక తమిళ్ బుక్ ఉంది. అది కొనిచ్చాను తనకి. అది చూసి మా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తే నేను పారాయణ చేస్తాను మరియు మా వారు రిటైర్డ్ అయ్యాక ప్రశాంత జీవితం గడపాలి, ఈ రెండు నెరవేరితే నేను తప్పకుండా పారాయణం చేస్తాను అంది.

కొన్ని రోజుల తర్వాత ఆమె నాకు ఉత్తరం రాసింది. అక్కా నువ్వు కొనిచ్చిన పుస్తకం వలన మా అబ్బాయికి మంచి ఉద్యోగం దొరికింది. మా వారు నేను ఉన్న దాంట్లో ప్రశాంతమయిన జీవితం గడుపుతున్నాము.

నేను పారాయణం చేశాను. చాలా హాయిగా ఉన్నాము. ఆ సాయినాథుడి కరుణ మాపై కురిసింది అని రాసింది. నేను ఇప్పుడు సాయినాథుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాను అని కూడా రాసింది.

ఆయన ఎక్కడెక్కడి పిట్టలనో తన దగ్గరికి లాక్కుంటాడు దారాలు కట్టి.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles