Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
పరీక్షలంటే ఎవరికైనా గుండె దడగానే ఉంటుంది. సాయి భక్తులైన విద్యార్ధులను సాయియే పట్టించుకోవాలి.
ఇది 1917లో జరిగిన సంఘటన. ఒక వైద్యా విద్యార్ధి తన పరీక్షలకు తయారవుతున్నాడు.
ముందు రోజు కల వచ్చింది. కలలో మరునాటి ప్రశ్నాపత్రం కాదు కనపడ్డది. సాయిబాబా కనిపించాడు.
అతనికి అది సంతోషమే కదా! సాయి ఆ వైద్యా విద్యార్ధితో ”నాకు కడుపు నొప్పిగా ఉంది. నీవు డాక్టరువు గదా నాకు మందివ్వు” అన్నాడు.
అతడు ”బాబా! నేను వైద్య విద్యార్ధినే కాని, వైద్యుడను కాదు ” అన్నాడు బాబాతో. ”వెళ్ళు మందు తీసుకురా” అని సాయి ఆదేశించారు అతనిని.
అతడు లోపలికి వెళ్ళి మందు తెచ్చేలోగా సాయిబాబా అదాృశ్యులయ్యారు.
సాయిబాబా మాటలు, చేతలు చమత్కారంగా ఉంటాయి స్వప్నంలో కూడా. కల అంతరించింది.
కల కదా అని ఊరుకోలేదు అతను. సాయి తెలిపిన విషయంపై పూర్తిగా అవగాహన చేసుకుని, పరీక్షకు వెళ్ళాడు.
ఆ పరీక్షలో కడుపు నొప్పికి సంబంధించిన ప్రశ్న వచ్చింది. ఇది కదా సాయి చమత్కృతి అని సాయికి ధాన్యవాదాలర్పించాడు ఆతడు.
అది 1969 జూన్ నెల. శ్రీముఖం వెంకట సుబ్బయ్యగారి ప్రథమ కుమార్తె తిరుపతిలో మొదటి సంవత్సరం ఎం.బి.బి.యస్. పరీక్షలు వ్రాస్తున్నది.
తండ్రి వలె ఆ వైద్య విద్యార్ధిని సుబ్బలక్ష్మమ్మ కూడా సాయి భక్తురాలే. ఆ రోజు బుధావారం.
సుబ్బలక్ష్మమ్మ పొరపాటున మరుసటి రోజు గురువారం జరిగే పరీక్షకు సంబంధించిన పుస్తకం చదవకుండా, వేరే పుస్తకం చదివింది.
ఇక రాత్రి 12 గంటలకు నిద్రాపోయింది. బాబా పటం ముందే పుస్తకం ఉంచి నిద్రించసాగింది.
ఆమెకు నిద్రాపట్టవచ్చును కాని, సాయికి నిద్రాపట్టదుగా. ఆమెకు స్వప్నంలో కనిపించి ”పరీక్ష వ్రాయవలసిన పాఠములు చదువక వేరేవి చదివినావు. భయపడకు. నేను ఉన్నాను” అని అన్నాడు బాబా.
ఆమె ఉలిక్కిపడి లేచింది. అధైర్యపడలేదు. అప్పటికప్పుడు మరునాడు వ్రాయవలసిన పరీక్షకు చెందిన పుస్తకం చదివింది.
పరీక్షలో ఉత్తీర్ణురాలయినది.
ఈ విషయం తెలిసిన తండ్రి ”శంకరునికన్నా, అతి త్వరలో ఆయన (సాయి) భక్తులను కాపాడుతుంటారు ” అన్నారు.
అది సత్యమేకదా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy.
Latest Miracles:
- సాయి అందరకి లొంగడు. ఎన్నో ఆటంకాలు, చికాకులు, పరీక్షలు పెడతాడు. దానికి నువ్వు తట్టుకోగలిగితే సాయి నీ వశమవుతాడు.
- సాయి స్పీడ్ పోస్ట్…..సాయి@366 జూన్ 27…Audio
- హెచ్చరిక …..సాయి@366 జూన్ 5…Audio
- సాయి సేవలో 65 ఏండ్లు …..సాయి@366 ఏప్రిల్ 23….Audio
- గౌరవం అక్కరలేదు, ద్వేషించకు …..సాయి@366 జూలై 23…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “పరీక్షలు – పొరపాట్లు …..సాయి@366 జూన్ 23….Audio”
Neelima
June 23, 2019 at 9:15 pmOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam