ఆ వ్యక్తీ రూపంలో వచ్చింది బాబాయేనా?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

భువనేశ్వర్ నుండి మాధవి గారికి షిర్డీలో జరిగిన ఒక అనుభవం:

2013 ఏప్రిల్ నెలలో మేము షిర్డీ వెళ్ళాము. నేను మా తోడికోడలు ఇద్దరం కాకడారతి చూసుకొని బయటకు వచ్చాము. అప్పుడు టైం 6 గంటల 30 నిమషాలు అయ్యింది. సమాధి మందిరం బయట నిలబడి ఉన్నాము.

ప్యాంటు, షర్టు వెసుకుని సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక వ్యక్తీ మా దగ్గరకి వచ్చి ఏమి చేస్తున్నారు అని హిందీలో అడిగారు. ఇప్పుడే కాకడారతి చూసుకొని బయటకి వచ్చాము అని నేను హిందీలో ఆయనకు చెప్పాను.

ఆయన నన్ను చూసి తెలుగు అమ్మయివా? అన్నారు. నేను అవును అన్నాను. “కొంచం దూరంలో బాబాకు నివేదించిన హల్వా ప్రసాదం ఇస్తున్నారు. నా వెంట రా. నేను నీకు ఇప్పిస్తాను” అన్నారు. మేము ఆయనతో వెళ్ళాము. అక్కడ క్యూ ఉంది, అందులో నిలబడ్డాము.

అప్పుడు అయన “సమాధి మందిరం లోపల ఏమి చూసావు” అన్నారు. నేను మాములుగా “బాబా”ని అన్నాను. ఆయన ”మార్బెల్ విగ్రహం బాబానా, లేక నిజమైన బాబానా” అని అడిగారు. ఆ ప్రశ్నకి షాక్ అయ్యి ఇదేమి ప్రశ్న? అనుకున్నాను.

అప్పుడు అయన “మార్బుల్ బాబా అన్ని చోట్ల ఉన్నారు, కాని ఇక్కడ నిజమైన బాబా ఉన్నారు” అని “మళ్ళి వెళ్లి చూసిరా!” అని కాస్త గట్టిగానే శాసించారు. నేను ఆశ్చర్యం పట్టలేక మా తోడికోడలి తోపాటు మళ్ళీ క్యూలో సమాధి మందిరం లోపలకి వెళ్ళాను. ఈసారి అయన చెప్పినట్లు నిజమైన బాబాను చూసాను.

ఆ క్షణంలో నాకు సాయి లీలామృతం బుక్ లో “బాబా ఎంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడడానికి శిరిడి లో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు” అని ఖపర్డే తన డైరీ లో వ్రాసుకున్నారు ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన ఆ వాక్యం అక్షర సత్యం అనిపించింది. ఆ చూపు జన్మ జన్మల మన పాపాలను దగ్ధం చేసే చూపు. ప్రేమకు మారుపేరు ఆ చూపు. ఇంతకన్నా ఆ అనుభూతిని నేను వర్ణించలేను.

ఆ ఆనందాన్ని మది నిండా నింపుకుని బయటకు వచ్చాము. అప్పుడు టైం 8.30 అయ్యింది. లెండిబాగ్ లోని దత్తత్రేయునికి 108 ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టాను. ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా నాకు ముందు కనపడిన ఆయన మళ్ళి వచ్చారు. పైగా “ఇక్కడున్నావా నువ్వు, ఆ పసుపురంగు పట్టుచీర కట్టిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అందరిని అడుగుతూ వచ్చాను” అన్నారు.

తర్వాత అయన “బాబా దర్శనం అయిందా?” అన్నారు. నేను సార్, మీరు చెప్పింది నిజమే అండీ అని ఆయన కాళ్ళ మీద పడిపోయాను. అప్పుడు ఆయన నాకు ఒక పండు ఇచ్చి, ఇది ఏమిటి? అని అడిగారు. నేను మామిడిపండు అన్నాను. అయన “కాదు, నీ పూజకు ఫలం” అన్నారు. తర్వాత చాలా విభూతి ప్యాకెట్లు, బాబా పొటోలు ఇచ్చారు. చివరలో తెలుగు సాయి సచ్చరిత్ర కూడా ఇచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయారు.

ఆయన వెళ్ళిన తర్వాత బుక్ తెరిచి చూస్తే పెద్ద షాక్! ఏమిటో తెలుసా? ఆ బుక్ లో “with best wishes and full of blessings, Madhavi”  అని వ్రాసి ఉంది. ఆయనకీ నా పేరు ఎక్కడ చెప్పలేదు, మరి నా పేరు ఆయనకి ఎలా తెలిసింది?

షిర్డీలో ఉన్న ఆణువణువూ బాబా యొక్క ప్రతి రూపమే….

సాయిరామ్

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఆ వ్యక్తీ రూపంలో వచ్చింది బాబాయేనా?

Maruthi

Sai Baba…Sai Baba.mea aaseasulu ma py kuda vundalani korukuntunnamu Baba.Sai Baba…Sai Baba

Baba blessings andhari paina vuntaayi..Maruthi garu..keep on belive..

Maruthi

Sai Baba…Sai Baba.yes correct madhavi garu.Baba vari Blessings Andari py vuntai.even in critical situation also Baba vari blessings vunnai mana py ane nammakam koncham kuda thaggakudadu,manalni Baba varu aapada nundi kaapadatharu ane nammakam koncham kuda thaggakudadu.but oka aapada vunna time lo a aapada nundi kaapadamani anduku Baba varini adiganu mea aaseassulu ma py vundalani korukuntunnamu ani ante a aapada tolaginchamani adigindi sandarbam

Maruthi

Manam adigina ,adagakunna Baba vari aaseasulikshanam mana py appudu vuntai.but in some critical situations adagakunda vundalemu kada. Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles