సాక్షాత్తు బాబాయే నన్ను ఆరకంగా ఆశీర్వదించాడనిపించింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను ఉద్యొగం నుండి రిటైర్డ్ అయ్యాను కానీ నాకింకా రెండేళ్లు చేయాలని వుంది. అప్పుడే రిటైర్ అవ్వడం నాకు ఇష్టం లేదు.

ఆఫీస్ లో అడిగాను, నాకు ఇంకా రెండేళ్లు పొడిగింపు కావాలి అని, కానీ వాళ్ళు ఒప్పుకొలేదు. పొడిగింపుకోసం చాలా తాపత్రయాలుపడ్డాను. అయినా అవ్వలేదు.

బాబా ముందు ఏడ్చాను, “బాబా నాకు అప్పుడే రిటైర్ అవ్వాలి అని లేదు, ఇంకో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేయాలని వుంది” అని అనుకున్నాను.ఆఫీస్ వాళ్ళు అందులో కొనసాగటానికి ఒప్పుకోలేదు.

కానీ బాబా దయ వల్ల మాకు తెలిసిన వాళ్ళబ్బాయికి మైనారిటీ మినిస్టర్ బాగా తెలుసు. ఆయన దగ్గర ఆ అబ్బాయి నన్ను OSP గా వేయించారు.

నేను నష్ట పోయాను అనుకున్నాను కానీ బాబా నన్ను ఈ విధంగా నిలబెట్టాడు. ఏం ఉద్యోగం అయినా నేను చేస్తాను కానీ నాకు బాబా సేవకి ఎటువంటి అంతరాయం ఉండకూడదు అని అనుకున్నాను.

నేను సప్తాహాహలు, పారాయణాలు, భజనలు, ఏం వున్నా నేను ఆఫీసుకి వెళ్ళను. నా పనిలో మాత్రం ఎటువంటి రిమార్క్స్ రాకుండా చూసుకుంటాను. వేరే వాళ్ళు పని అశ్రద్ధ చూపినా నేను ఏ మాత్రం ఊరుకోను.

శిరిడీలో ఒకసారి సమాధి మందిరంలో ముఖమండపం స్టేజి పై పాటలు పాడే అవకాశం వచ్చింది.

శిరిడీలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి వెళ్లి వుండిపోయిన తెలుగువాళ్లు చాలా మంది వున్నారు . అందులో డాక్టర్ శ్రీహరి గారు అని వున్నారు. ఆయన ఒక అవదూత.

నేను లీనమయి పాటలు పాడుతున్నాను. స్టేజి మీద మాతో పాటు మా శ్రీమతి, శ్రీహరి గారితో పాటు ఇంకా కొంత మంది వున్నారు. అయన కూడా నా పాటలు వింటూ ఆనందిస్తున్నారు.

ఉన్నట్టుండి శ్రీహరి గారు లేచి స్టేజి దిగి గబగబా బాబా ముందుకి వెళ్లి, ఒక పూజారితో బాబాకి వేసిన దండ ఏమైనా దొరుకుతుందా అని అడిగారు.

ఆ పూజారి గారు వెంటనే సమాధి దగ్గరికి వెళ్లి ఒక దండ తీసుకువచ్చి ఆయనకిచ్చారు. బాబాకి వేసిన దండలు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు.

ఆ దండ తీసుకువచ్చి తన్మయత్వంలో పాటలు పాడుతున్న నాకు వేసాడాయన. నా శరీరం పులకరించింది. అది నేను మర్చిపోలేని అనుభవం. సాక్షాత్తు బాబాయే నన్ను ఆరకంగా ఆశీర్వదించాడనిపించింది.

The above telugu TEXT typed by : Mr Sai Krishna

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles