Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రాం.
నేను Sadha Siva.
ముందుగా సాయి బాబా చారణకమలాలకు కోటి కోటి ప్రాణామములు సమర్పించుకుంటున్నాను.
తప్పులుంటే మన్నించమని బాబా ను ప్రార్థిస్తున్నాను.
నమ్మినవాళ్లకు ఆపద్భాంధవుడు. అనాధారక్షకుడు. ఎలా నన్ను రక్షించారో చెప్పబోతున్నాను.
కలియుగం లో నామాసంకీర్తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క నామం చాలు, భవసాగరాన్ని దాటడానికి అన్నారు పెద్దలు. భగవంతుని నామస్మరణ తోనే ఎంతోమంది తరించారు అని మనం రోజూ వింటూవుంటాము.
నేను ఇది ఎలా సంభవం? అనుకునేవాడిని.అందుకేనేమో నాలాంటి వాడికి తెలియచేయాలని బాబా వేసిన ప్లాన్ ఏమో ఈ సంఘటన.
ఈనెల 20 వ తరీఖున నేను నా డ్యూటీ ఐపోయినాక నా motorcycle లో మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వెళ్తున్నాను.
సాయిబాబా నామం స్మరణ చేస్తూ, ఎండాకాలం అవ్వడం మూలాన రోడ్ పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలో నా వెనకాల ఒక పెద్ద truck వచ్చి(ఎలా వచ్చిందో నాకు ఇప్పటికి తెలీదు) నా motorcycle కు ఆక్సిడెంట్ చేసింది.
ఒక్క క్షణం నాకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. కానీ, ఓ నా సాయి బంధువులరా! నన్ను నమ్మండి, చావు, బతుకుల మధ్య సాయి బాబా, ఎలా రక్షించారో చెప్పనలవి కాదు నాకు. అంతపెద్ద ఆక్సిడెంట్ నుంచి నన్ను గట్టున పడేసారు బాబా.
నాకు ఏమి కాలేదు. ఒక్క చిన్న మచ్చ కూడా పడలేదు. నా motorcycle కొంచెం వెనకాల లైట్స్ విరిగిపోయినాయి, అంతే.
అప్పుడు అర్థం అయ్యింది. నామ స్మరణ మహిమ. ఆ సాయిబాబా నామమే నన్ను కాపాడింది.
అప్పుడు, నేను కళ్ళలో నీళ్లతో ఇంటికి పోకుండా,ముందు బాబా గుడికి వెళ్ళాను.
“బాబా, ఈరోజు నువ్వు నన్ను కాపాడకపోతే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది, నన్నే కాదు, నీ స్మరణ లో వుండే ప్రతి భక్తుడికి నీవే రక్ష ప్రభు” అని నమస్కరించుకొని, ధన్యవాదాలు చెప్పుకొని ఇంటికి వెళ్ళాను.
ఏదో పూర్వజన్మలో చేసిన కర్మ ను బాబా కొంచెం లో తీసేసారు. నన్ను కాపాడి బాబా “ఆపదలో బంధావుడు”( అపద్భాంధవాయ నమః) అని నిరూపించుకున్నారు.
ఓం సాయి రాం.
సర్వం సాయినాతర్పణమస్థు.
Latest Miracles:
- సాయిబాబా నామమే నన్ను కాపాడింది.–Audio
- మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా-10
- నన్ను ఎవరూ చంపలేదు. నేను చనిపోలేదు…సాయిబాబా
- 22 సార్లు చెక్ బౌన్స్ కేసులైతే నన్ను ఒకసారి కూడా కోర్టు బోను ఎక్కకుండా, నాకు సమస్యలేమీ రాకుండా బాబాగారు నన్ను కాపాడారు.
- ‘‘బాపూగిర్ అని బాబా ఒక్కరే నన్ను పిలిచేది. ఇంకెవరూ నన్నలా పిలవరు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments