Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ముంబై నుండి ఒక సాయిబంధువు అనుభవం ఆమె మాటల్లో…
2017లో నేను మా చెల్లెలు షిర్డీ వచ్చాము.సంతోషముగా బాబాని దర్శించుకున్నాము.
మేము షిర్డీ నుండి తిరిగి వెళ్ళటానికి రిటర్న్ టికెట్స్ కూడా చేయించుకున్నాము.
మేము రిటర్న్ అవ్వాల్సిన రోజు,మా చెల్లెలు నాతో,ఈరోజు ప్రయాణం కాన్సుల్ చేసుకుందాము అన్నది.
ఎందుకంటే నాకు బాబా వెళ్ళటానికి మనకి అనుమతి ఇచ్చినట్లు అనిపించటం లేదు మనసుకు అనిపిస్తుంది అంది.
కానీ నేను తన మాట వినకుండా,వెళదాము అని మెయిన్ రోడ్ కి వెళ్ళాము.ఆ రోజు రంగపంచమి పండుగ జరిగిన సందర్భంగా బాగా రోడ్ రద్దీగా ఉంది.
హఠాత్తుగా ఒక పెద్ద ట్రావెల్ బస్సు నా మీదకి వస్తున్నా ఆ విషయం నేను గమనించలేదు.
నా పక్కనే వస్తున్నమా చెల్లెలు అది చూసి నన్ను వెంటనే చెయ్యి పట్టి గట్టిగ లాగింది.
నేను ఒక వైపు తోసినట్లుగా కింద పడిపోయాను.నాకు పెద్ద ప్రమాదం తప్పింది.
కనురెప్పపాటు కాలంలో బాబా నన్ను కాపాడారు.ఈ ప్రమాదం జరుగుతుంది అని బాబాకి ముందే తెల్సు కాబట్టే, మా జర్నీ కాన్సుల్ చేసుకుందామని మా చెల్లి మనసులో ప్రేరణ కలిగించారు.
నేను బాబా ఆజ్ఞ గమనించకుండా సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళటం వల్ల ఇబ్బంది పడ్డాను.
బాబా ఉన్నపుడు కూడా చాల మంది మంది భక్తులు బాబా ఆజ్ఞ లేకుండా వెళ్లి ఇబ్బందులకు గురి అయ్యారు.
బాబా అనుమతి,ఆశీర్వాదం లేకుండా షిర్డీ నుండి వెళ్లలేము.
“నా ఆజ్ఞ లేక ఆకు అయినా కదలదు ” అన్న బాబా మాటకు తిరిగేది.ఘటానా ఘటన సమర్థుడైన ఆ సర్వాంతర్యామికి ఈసృష్టిలోని ప్రతి కదలిక విదితమే కాబట్టి ఆయన మనల్ని సదా వెన్నంటి రక్షిస్తారు.
సద్గురు సాయి నాథార్పణమస్తు
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా-Audio
- ప్రాణ గండం నుండి కాపాడిన కాలాతీతుడు
- గ్యాస్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు
- నన్ను చావు నుండి తప్పించింది. నన్ను మనీషిగా మార్చింది–Audio
- చైతన్య గారిని మరణ శయ్య నుండి సాయి మరియు సాయి మాస్టర్ కాపాడిన అద్బుత లీల–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “మృత్యు ముఖం నుండి నన్ను కాపాడిన సమర్ధ సద్గురు సాయిబాబా-10”
srinivasa murthy
December 7, 2017 at 9:41 amSai Baba…Sai Baba…Sai Baba