నేను అలిగానని బాబా వచ్చారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయి రామ్.

గురుభందువులకు నమస్కారం.

నా పేరు లక్ష్మి ప్రసన్న.

మేనల్లుడైన తాత్యా మీద బాబా, బాబా మీద తాత్యా అలకలు మామూలే.

బాబా వైనం ఒక్కోసారి ఈ  జగాన్ని  ఏలే భగవంతుడు మనకోసం మానవ జన్మ తీసుకొని మనతో ఆడీ, పాడి, కోపం, ప్రేమ. ఒక్కోసారి ఏమి తెలియని వాని వలే నటించేవారు. అటువంటి తండ్రి మీద నేను అలిగాను.

ఒకసారి నేను ద్వారకామాయి లో ఉన్నాను. షిర్డి వెళితే నేను ఎక్కువగా ద్వారకామాయి లో గడుపుతాను.

ఎందుకంటే  60 సంవత్సరాల పాటు బాబా ఉన్న ప్రదేశం మరియు మనం ఈరోజు చదువుతున్న ప్రతి ఒక్క సంగటన అక్కడ జరిగిందే కదా. అలా ఒక తన్మయత్వంతో అంతా తనివితీరా చూస్తూ ఉంటాను.

ఆవిధంగా నేను ఉన్నపుడు సంస్తాన్ వాళ్ళు, బాబా కి నైవేద్యం తెచ్చారు. ధుని పూజ చేసిన తరువాత ఆ ప్రసాదం పంచుతారు. అది దొరుకుతుంది అని నా ఆకాంక్ష, కనుక వేచి ఉన్నాను.

ఒక సెక్యురిటి అతను నన్ను బయటకు వెళ్ళమని నేట్టేసారు. అది సహజమే కదా అందరూ అంత, అంత సేపు ఉంటె ఎలా, అక్కడ భక్తులు పెరుగుతారుకదా.

ఇది నాకు తెలుసు, కాని నన్ను మా తాతగారు నేట్టేసారు అని కోపంగా చావడి దగ్గర కూర్చొని చాలా మాటలు అన్నాను.

నేను నీ దగ్గరకు వచ్చానని నీకు అలుసు, నీకేంటి బాగా కూర్చున్నావు, నీకోసం నేను వస్తే వెల్లగొడతావా ముసలివాడివి కదా ప్రేమ ఎలా చూపించాలో తెలియడంలేదా. (దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు బాబా తో నా చనువు అదీ) అని కోపంగా కూర్చొని ఉన్నాను.

ఇంతలో ఒక ఆవిడ నా వద్దకు వచ్చి నేను ఇందాక నుండి నిన్ను చూస్తున్నా, కాని నువ్వు నన్ను చూడడంలేదు. ఇదిగో ద్వారకామాయి ప్రసాదం తిను అని ఇచ్చి వెళ్ళిపోయారు.

ఆవిడ ఎవరో నాకు తెలియదు. ఆ ప్రసాదం అన్నం, కాకరకాయ పొట్లం. నాకు చాలా ఇష్టమైన వంట అది.

 హ…హ సరే ప్రసాదం పంపితే కోపం పోతుందా ఏంటి మనవరాలిని అలా వెల్లగోడతావా అని పాపం తాత మీద చాలా కోపంగా ఉన్నా.

చాలా సమయం చావడి వద్ద దిగాలుగా కూర్చున్నా. ఇది మీకు మామూలుగా ఉండవచ్చు కాని నేను షిర్డి వెళ్లేదే తాత తో మాట్లడడానికే కదా.

ఇక సరే అని పారాయణ హాల్ వద్దకు  వెళితే అక్కడ దత్తమందిర్ ఉందికదా అక్కడ ఉన్నారు తాత.

ఏ అమ్మాయి ఇటురా అన్నారు, వెళ్లాను.  ఏంటి నీ బాధ ప్రసాదం కోసం ఇంత  అలుగుతావా నేను వండి పెడితే తిన్నావు, నా పక్కన ఎన్నో ఏళ్ళు కూర్చొని తిన్నావ్, ఇప్పుడు ఆ బొమ్మకి పెడితే ఆ ప్రసాదం నీకు కావాలా చెప్పు.

నా కళ్ళ ధార ఆగని గోదారి అయ్యింది. ఏమి మాట్లాడాలో నాకు తెలియలేదు. తాత నా కోసం వచ్చారని మాత్రం నాకు తెలిసింది.

ఆపు ఏడుపు, ఇది సంతోషమేనా, హా సంతోషమే, కూర్చో . సారి తాత , ఎందుకు, మరి నిన్ను ముసలోడా అన్నాను.

హహః నువ్వు నన్ను అన్నప్పుడల్లా వచ్చీ రాని మాటలతో చిన్న పిల్ల మాటలు ఎలా ఉంటాయో అలా నువ్వు నన్ను అంటూ ఉంటె నేను చంకలు ఇలా, ఇలా కొట్టకుంటాను .

ఇంకా నాకు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఇంకా కొద్ది సేపు ఉండు తాత అంటే నువ్వేనా నాకు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక నేను వెళ్ళాలి అని,  నువ్వు ఎప్పుడూ ఏడవకు మా తల్లి కదూ అని నన్ను దగ్గరకు తీసుకున్నారు.

ఆ రోజు నాకు నిజంగా కొత్తగా అనిపించి ఆనందం తట్టుకోలేక తల నొప్పి వచ్చింది. కాని ఇప్పటివరకూ బాబా పాదాలు మాత్రం తాకనివ్వలేదు.

నేను మందు తెచ్చుకుందామని గుడిలోనే దావకాణ్ కి వెళితే !! ఆ వైద్యులు నీకు ఇక మీదట ఏ నొప్పి రాదు మా (मां), బాబా ఊది నీటిలో కలుపుకొని తాగు అని నా చెయ్యి పట్టుకొని చాల ప్రేమగా నిమిరారు.

నాకు తలనొప్పి కొద్ది నిమిషాలలోనే పోయింది, అంటే అక్కడ కూడా తాత వచ్చారు, లేకపోతె మందు ఇవ్వకుండా అతను ఎందుకు అలా చెప్తారు.

కాని అప్పుడప్పుడు కాకుండా నేను ఎప్పుడూ బాబా దగ్గర ఉండాలనేది నాకోరిక. దానికోసం పరితపిస్తూ , నా మనసు ఎప్పుడూ నామస్మరణ వదలకుండా ఉంటుంది.

సాయి నాథ్ మహా రాజ్ కి జై.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles