నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

సాయి రాం.అందరికి.నాకు ఈ మధ్య బాబాగారు చూపిన అద్భుతమైన లీల మీతో  పంచుకోవాలని రాస్తున్నాను.

సాయి చరిత్రలో బాబా  భక్తుల కోసం చేసిన ప్రతి ప్రతిజ్ఞ ఎంత అక్షర సత్యమొ మీకు తెలుస్తుంది.

ఈ లీల చదివితే.నాకు భువనేశ్వర్ నుంచి  శంబల్పూర్ అనే ఊరికి బదిలీ అయ్యింది.

మా వారు silchir అనే ఊరిలో ఉండేవారు.ఆయనకు భువనేశ్వర్ బదిలీ అయ్యింది.అదే రోజు నాకు శంబల్పూర్ వెళ్లాల్సి వచ్చింది.

నేను మా వారూ చాలా సంవత్సరాలుగా వేరు,వేరు ఉన్నాము.ఇంకా అలా వేరు ఉండడం నాకు ఇష్టం లేదు.కానీ ఉద్యోగం.

మరి ఏమి చేయలేము.చాలా దుఃఖం తో నేను అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యాను.

ఇల్లు లేదు.ఉండటానికి.అందుకని quarter  ఇచ్చేవారకు సెలవు పెట్టి భువనేశ్వర్ వెళ్ళాను.

15 రోజుల తరువాత quarter ఇచ్చారు.అప్పుడు రామనవమి పండగ వచ్చింది.

అందుకని మా వారిని వెళ్లి ఇల్లు ready చెయ్యమని చెప్పాను.

నేను రామనవమి తరువాత వెళ్తాను.అనుకున్నాను.మా ఆయన వెళ్లి ఇల్లు అంత బాగా clean చేయించారు.

ముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్లు ఇంట్లో చాలా చెత్త వేసి వెళ్లారు.

మా వారు మొత్తం clean చేయించి.అంత చెత్త బయట పడేసి కాల్చేయమన్నారు.

పనివాళ్ళు మొత్తం చెత్త తీసుకెళ్లారు.నేను భువనేశ్వర్ లో రామనవమి రోజు చాలా బాధ పడుతూ బాబా ముందు,

” బాబా,నువ్వు లేకుండా నేను అంతదూరం ఎలా వేళ్లను? నాకు ఇంత పరీక్ష ఎందుకు పెట్టవు.”

అని చాలా వికల మనసుతో బాధ పడుతున్నాను. పాపం, బాబా నా బాధ చూడలేక పోయినారు.

నాదేకాదు..ఎవరు దుఃఖపడిన ఆయన చూడలేరు.మా వారికి అదే టైం లో శంబల్పూర్ లో ఇల్లు clean చేస్తుండగా ఒక పెద్ద బాబావారి ఫోటో దొరికింది.

అది మట్టిలో మాణిక్యం లాగా.రాజదిరాజ్ యోగిరాజ్.ఎంతో దర్జాగా  విరాజమాన్ అయ్యి,

“నేనుండ భయమేల” అంటూ కనపడినారు ఫోటో రూపం లో. ఆశ్చర్యం లో కెల్ల ఆశ్చర్యం అది మా ఇద్దరికీ. ఎలా వచ్చింది ఆ ఫోటో అక్కడికి? ఎవరు ఇచ్చారు? ఏమో..

ఇంతవరకు తెలీదు.అంతే. మా వారి కళ్ళలో నీళ్ళు..ఆ ఫోటో రూపం లో బాబా రామనవమి రోజు మా ఇంటికి వచ్చారు.

మా వారు నాకు ఫోన్ చేసి చెప్పారు”,నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు.

నీ దుఃఖం దూరం చెయ్యడానికి” ఇప్పుడు చెప్పండి. సాయి చరిత్ర లో బాబా ఫోటో రూపం లో రెండు సార్లు వెళ్లారు.

ఒకసారి శ్యామకు, ఒకసారి హేమాదపంత్ కు. ఇంకా ఎన్నోసార్లు ఇలా బాబా యెంతో మందికి అనుభూతి ఇచ్చి వుంటారు.

కానీ ఆ సమయం లో,రామనవమి రోజు ఆ రూపం లో నన్ను ఆశీర్వదిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు.

సాయి చరిత్ర అక్షరసత్య గ్రంధము”.ప్రాణజాయ్ పర్ వచనం నా జాయే” అని తులసిరామయణం లో ఉన్నట్లు ఆయన శతదినోత్సవం లో రామనవమి రోజు నాకు రుజువు చేసి చూపించారు.

ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. ఎంతో సంతోషంగా ఉన్నాను.ఆయనే మళ్ళీ నన్ను మావారి దగ్గరికి చేరుస్తారు.  అని నమ్మకం నాకు ఉంది. మాధవి

సాయి బాబా …సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్ఫూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికీ అన్ని విధాలా నేను సహాయ పడతాను. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles