Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు విజయలక్ష్మి. మేము ప్రస్తుతం NGO’s కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్ లో ఉంటున్నాము. మాది బొబ్బిలి. మా వారిది అత్తిలి.
మాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయ్యింది. మా వారు గవెర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేసి రిటైర్ అయ్యారు.
నేను అడపా దడపా నాటకాలు వేస్తూ, పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటాను.
అలాగే టెలిఫోన్స్ (ల్యాండ్ లైన్ ఫోన్స్) క్లీనింగ్ చేసేదాన్ని. నాకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి.
మాకు మొదట్నుండి బాబా అంటే అసలు తెలియదు. 35 సంవత్సరాల క్రితం మేము చాలా ఇబ్బందులు పడ్డాం, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాకు తినడానికి కూడా లేని రోజులు వచ్చాయి.
నేను చాలా స్టేజి నాటకాలలో వేసాను. నేను వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించేదాన్ని,
తరచుగా తిరుపతి వెళ్లడం, శ్రావణ మాసంలో శనివారం నాడు చలిమిడి తాయారు చేసి, ఆ చలిమిడిని ప్రమిదలాగా చేసి, అందులో వత్తి వేసి, ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసేదాన్ని. అలా చేస్తే చాలా మంచిదనేవారు.
కాలం ఖర్మం కలిసి రాక మమ్మల్ని వదిలి మా వారు ఇల్లు విడిచి వెళ్లిపోయారు.
ఒక నెలలో వస్తాను, తీర్థ యాత్రలకు వెళ్తాను అని చెప్పి ఇంట్లోంచి వెళ్లి మూడు నెలలైనా రాలేదు. పిల్లలు చిన్నవాళ్లు, నేను నాటకం వేస్తే ఒక్క నాటకానికి 100 రూపాయలు ఇచ్చేవారు.
నేను తినాలి కదా! నాటకాలంటే సాంఘిక నాటకాలు కావు, భక్తి నాటకాలు. పండగలప్పుడు పరిషత్తుల వాళ్ళ పందిళ్ళలో వేయించేవారు.
ఎక్కవమందికి అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కాబట్టి టెలిఫోన్ క్లీనింగ్ అంటే ఎక్కవ డబ్బు వచ్చేది కాదు. సంగీతం చెప్పించుకునే పిల్లలు కూడా పెద్దగా డబ్బులు ఇచ్చేవారు కాదు.
ఇలాంటి పరిస్థితులలో ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. చేతిలో పెద్దగా డబ్బు లేదు. నాకేం చేయాలో తోచలేదు, చేతిలో ఎక్కువ డబ్బులు లేవు.
చుట్టు పక్కన వాళ్ళని ఏం అడుగుతాం. అయినా ఒక్క రోజుది కాదు కదా! కడుపులో కాళ్ళు పెట్టుకొని పడుకున్నారు పిల్లలు.
వాళ్ళ ఆకలి తీర్చడానికి, ఎవరినైనా డబ్బులు అడుగుదాం అని బయటికి వచ్చాను.
నా అడుగులు తడబడుతున్నాయి, నీరసం గా ఉంది. నేను భోజనం చేసి కూడా రెండు రోజులైంది. కొంచెం బియ్యం ఉంటే పిల్లలకు పెట్టుకు వస్తున్నాను.
నేను తినే నాలుగు మెతుకులు కూడా వాళ్ళకో పూట ప్రాణాలు నిలుస్తాయనిపించి అలా చేశాను. డబ్బు కోసం రోడ్డున పడవలసి వచ్చినందుకు నాకు ఏడుపు ఆగటం లేదు.
అడుగులు తడబడుతున్నాయి. పవిటకొంగు నోటికి అడ్డం పెట్టుకొని ఏడుపుని గొంతు దగ్గరే ఆపే ప్రయత్నం చేసుకుంటూ అడుగులు వేస్తున్నాను.
కొంచెం దూరం వెళ్ళాక మా వారి స్నేహితుడు కనపడి ” ఏమ్మా! ఏమైంది, ఇంకా ఎన్నాళ్ళు పడతావమ్మా ఈ కష్ఠాలు, నీ కష్ఠాలు చూడలేకపోతున్నాను. బాబా నీ నమ్ముకోమ్మా నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీ బాధలన్నీ తీరిపోతాయి. ” అని చెప్పారు.
ఇంక వెళ్లలేక పోయాను. ఇంటికి తిరిగి వచ్చేసాను, ఆయన చేత బాబా గురించి చెప్పించుకోవడానికే వెళ్లినట్లు అయ్యింది.
ఇంటికి డబ్బు లేకుండానే తిరిగి వెళ్ళిపోయాను. వచ్చి ఇంట్లో పాలు మాత్రం ఉన్నాయి, నెలకి ఒక సారి డబ్బులు ఇచ్చేటట్లుగా పాలు మాత్రం పోయించుకునే దాన్ని.
అమ్మ ఏమైనా తెచ్చావా తినడానికి అడిగారు పిల్లలు, నేను ఏమి లేదు అని చేతులు తిప్పాను.
వెంటనే వాళ్ళు మాకేమి ఆకలి వేయడం లేదు మేమేమి తినం, పాలు ఉన్నాయి గా మేము పాలు తాగుతాం అమ్మ, నువ్వు తాగమ్మా అని నాకు పాలు తెచ్చి ఇచ్చారు.
తరువాత నేను పిల్లలతో బయట జరిగింది చెప్పాను. మా వారి స్నేహితుడు కనపడి బాబాని నమ్ముకోమని చెప్పడం గురించి చెప్పాను.
The above miracle has been typed by: Mrs: Rajarajeswari SaiNathuni
Latest Miracles:
- సీతా నీ కష్టాలన్నీ పోతాయి. బాబా నీకు పూర్ణ కలశం ఇస్తున్నారు
- తెలియగలేరే నీ లీలలు …..సాయి@366 డిసెంబర్ 2….Audio
- పాల గ్లాసులో మేడి పండు
- “బాబా నాకు తెలియకుండానే నేను నీ అండన చేరాను. నీ ఒడి లోనే ఉంటున్నాను. నన్నెదుకయ్యా బాధ పెడతావు.”
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments