సీతా నీ కష్టాలన్నీ పోతాయి. బాబా నీకు పూర్ణ కలశం ఇస్తున్నారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మావారు బాగా నీరసించిపోయారు. ఆ తర్వాత రిపోర్ట్ లు, CD లు ఉషా ముళ్ళపూడి కార్డియాలజీకి పంపించాము.

వాళ్ళు అవి చూసి పర్వాలేదు ఆపరేషన్ చేసేంతగా ఏమిలేదు మందులతోటి తగ్గిపోతుంది అన్నారు.

మౌలానా బాబాగారు ఇంకెక్కడా చూపించకమ్మా మీ ఆయనకేంకాదు. మనం ఇంట్లో సాయి చాలీసా చేద్దాం అన్నారు.

నేను కూడా అలాగే అనుకున్నాను. ఆ విషయం ఆయనకీ చెప్పను. ఆయనకీ నీరసం తగ్గేటప్పటికీ మూడు నెలలు పట్టింది.

ఆ తర్వాత ఒక రోజు మా ఇంట్లో సాయిబాబా చాలీసా 108 సార్లు, హనుమాన్ చాలీసా 108 సార్లు, దత్త చాలీసా 108 సార్లు వరుసగా చదివారు, వేరే వేరే ఊర్ల నుండి కూడా భక్తులు వచ్చారు.

రాత్రంతా కూడా చదువుతారు, రాత్రి మౌలానా బాబాగారు ఇంటికి వెళ్తుంటే నాకు రేపు ఉదయం పొంగలి చేయటానికి పాలు కావాలని అడిగాను.

ఆయన ఆశ్రమం లో ఆవులు వున్నాయి, ఒక పెద్ద గిన్నెడు పాలు పంపించారు, ఒక్కొక్క సారి చదవటం పూర్తి అయ్యాక ఒక్కొక్కరితో హారతి ఇప్పిస్తాను, అలా అందరం చదవటం పూర్తి అయ్యింది.

వంటలు అయ్యాయి, పూజ అయ్యింది, నైవేద్యం సమయం అయ్యింది, పొంగలి గిన్నెలో ఒక గొట్టము పెట్టి తీసినట్లుగా లోపలిదాకా గుంట కనిపించింది.

అందరం అక్కడే ఉన్నాము, ఎవరు వచ్చి ఆలా పొంగలి తీసారు? అంటే ఎవరికీ తెలియదు అన్నారు.

మా స్నేహితురాలికి మాత్రం బాబా గారు నిలబడి దర్శనం ఇచ్చారట, బాబా గారే ఆ ప్రసాదం తిన్నారు అని చెప్పింది.

నేను విషయం చెపుదామని మౌలానా బాబా గారికి ఫోన్ చేశాను, ఆయన బాబాగారు “పొంగలి తిన్నారు ఇదేగా నువ్వు నాకు చెప్పటానికి ఫోన్ చేశావు” అన్నారు.

ఇది మీకెలా తెలుసు అని ఆశ్చర్యం గా అడిగాను, దానికి ఆయన నువ్వు రాత్రి పాలు అడిగినప్పుడే తెలుసు,

నాకు బాబాగారు స్వయానా చెప్పారు. మా స్నేహితురాలికి బాబా గులాబి బట్టలతో కనిపించి ఆ ప్రసాదం నేనే తీసుకున్నాను అని చెప్పినట్లు అయ్యింది.

మౌలానా బాబా గారు ఆ విషయాన్నీ ధ్రువ పరిచారు. ఆయన లేని ప్రదేశం వుంటుందా? ఆయనకు చెందని పూజ వుంటుందా?

షెగావ్ అని మహారాష్ట్ర లో వుంది. అక్కడ గజానన్ మహారాజ్ గారు వున్నారు, నేను మౌలానా బాబాగారు, విఠల్ బాబా గారి శిష్యులు కొంతమందిమి కలిసి వెళ్ళాము.

ఉదయాన్నే దర్శనానికి వెళ్తున్నాము మాతో బాటు వచ్చినవాళ్లు ముందుగానే దర్శనానికి వెళ్ళిపోయారు మాకు కొంచెం ఆలస్యం అయింది.

నేను నా మిత్రురాలు అన్నపూర్ణ, వారి అబ్బాయి ముగ్గురము నడుస్తున్నాము, ముందుగ మేమిద్దరమూ అనవసరంగా ఆలస్యం అయింది మిగతా వారంతా వెళ్ళిపోయారు, ఈపాటికి దర్శనం చేసుకున్నారేమో అనుకుంటూ అడుగులు వేస్తున్నాము.

మా వెనకాల వస్తున్న మా స్నేహితురాలి కొడుకు కొంచెం దూరం లో ఆగిపోయి అమ్మ, ఆంటీ అంటూ అరుస్తునాడు మేము ఏమిటి ఇప్పటికే ఆలస్యం అయింది అన్నాము. కాదు ఆంటీ మీరు ఇలా రండి అంటూ పిలుస్తున్నాడు ఏమిటో అనుకుంటూ వెనక్కి వెళ్ళాము.

అక్కడ రోడ్ డివైడర్ మీద కాళ్ళు బార చాపుకొని పొడుగాటి చేతులతో ఒక 8 సంవత్సరాల ఒక బాలుడు కూర్చుని వున్నాడు, అతన్ని చూపించి ఇతను ఎవరిలాగా కనిపిస్తున్నాడో చుడండి అంటున్నాడు.

మేము చాలా ఆశ్చర్యపోయాము అతన్ని చూస్తే అచ్చంగా గజానన్ మహారాజ్ ఫోటో లో చూసినట్లే వున్నాడు, ఆ బాలుడు నన్ను చూసి నాకు రూపాయి ఇవ్వు అన్నాడు. నా దగ్గర రూపాయి లేదు అన్నాను.

నా చేతిలో ఉన్న పర్సు లాక్కున్నాడు, అందులో డబ్బు బాలుడు తీసేసుకుంటాడు అన్న ఆలోచన కూడా నాకు రావటం లేదు, నా ప్రక్కనే ఉన్న నా స్నేహితురాలు 5 రూపాయల కాగితం యిస్తోంది, అది నాకు వద్దు అన్నాడు.

నా రూపాయి అంటూనే నా పర్సు లోంచి లేని రూపాయి బయటకు తీసాడు. ఈ హడావిడికి కొంతమంది గుమిగూడారు, అయ్యో అంటూనే నా పర్సు లాక్కున్నాడు.

ఇంకేముంది పారిపోతాడు ఆ పర్సు లో ఎంత డబ్బు ఉందొ పాపం అంటున్నారు.

ఆ బాలుడు పర్సు లోనుండి 1 రూపాయి తీసి ఇచ్చి దాచుకో అన్నాడు, పొట్లం కట్టడానికి నా దగ్గర కాగితం లేదు, అక్కడే ఒక షాప్ ముందు వున్న ఒక కాగితం తెచ్చిపొట్లం కట్టేంతవరకు వదలలేదు.

మరల నా పర్సు లో నుండి మరొక రూపాయి తీసి ఇది నాకు అని తీసుకున్నాడు. నా ప్రక్కన వున్నా ఆవిడ తనకీ ఒక రూపాయి కావాలంటే, ఆవిడకి ఏమి ఇవ్వలేదు.

ఆ సమయంలో మేము చాలా ఆర్థిక ఇబ్బందులలో వున్నాము, మా వారికీ చాలా తక్కువ జీతం వచ్చేది.

దానికి సాయంగా గ్యాస్ ఏజన్సీ తీసుకున్నాము, మాకు లాభం మాట ఏమోగానీ మాకొచ్చే రూ. 800 జీతంలో నుంచి రూ.400 వేసి సిలిండర్స్ ఇస్తూ ఉండాల్సిన పరిస్థితి వున్నది.

గజానన్ మహారాజ్ దర్శనం కోసం పైకి వెళ్ళాక అక్కడ ధ్వజస్తంభం ఉంది, మరెక్కడా కూడా దత్తక్షేత్రాలలో ధ్వజస్తంభం లేదు, ఇక్కడ మాత్రమే ఉంది.

ఆ ధ్వజస్తంభానికి రెండు సార్లు ప్రదక్షిణ చేసి తల ఆనించి కళ్ళు మూసుకొని మొక్కుతుంటే నాకు సముద్రము, అందులో ఒక సుడిగుండం కనిపించింది ,

నేను నా ప్రక్కన ఉన్నావిడతో – ఏమండి ఏమిటో నాకు ఇలా సముద్రము` మరియు అందులో సుడిగుండం కనిపించాయి, నాకు ఎందుకో భయంగా ఉన్నది అన్నాను,

ఆవిడ మనం బాబాను నమ్ముకున్నాము, మనం బాబాకు చెందిన వాళ్ళం కనుక పాల ముంచినా నీట ముంచినా అయినదే భారము,

ఇంకా మరొక ప్రదక్షిణ ఉందిగా ఈసారి ఏమి కనిపిస్తుందో చూద్దాం అన్నది,

సరే అని మరొక ప్రదక్షిణ చేస్తే ఈసారి నిండు కలశం సముద్రంలో నుండి బయటకు వస్తూ కనిపించింది, అదే ఆవిడకి చెప్పాను,

సీతా నీ కష్టాలన్నీ పోతాయి. బాబా నీకు పూర్ణ కలశం ఇస్తున్నారు అని అన్నది.

అంతే ఆ తరువాత మా కష్టాలన్నీ మబ్బులు విడిపోయినట్లు విడిపోయాయి. అప్పటి నుండి మాకు మంచి రోజులు వచ్చాయి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles