”నీ కామెర్లు ని బాబా గారు తీసేసుకున్నారు. నీకు నయం అయిపోయింది .”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


చిక్కడపల్లి లో చోడవరపు సాంబమూర్తి గారని ఉన్నారు .అందరు ఆయన్ని చిక్కడపల్లి బాబా అనేవారు. అయన బాబా భక్తుడు .

శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి గురువుగారు  ఆయన, ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో కూర్చుంటే ,ఆయన ఎదురుగుండా ఎవరు కూర్చున్నా ఆయనకు కళ్ళు తెరవకుండానే తెలిసిపోయేది .

ఆయన బాబాతో ”ఎందుకు బాబా ఈయనను ఇక్కడకు పంపావు ?” అంటూ అడిగేవారు . బాబాయేమో ఆయనకేదో చెప్పేవారు . ఇదిలా జరుగుతుండేది.

భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఆయనను  కలవకుండా వెళ్లేవారు కారు.

ఒకసారి  దిల్ సుఖ్ నగర్ లో ప్రముఖ హోటల్ [శివాని] యజమానికి పచ్చ కామెర్లు వచ్చాయి . ఆయన ఇంటికి సాంబ మూర్తి  గారు వెళ్లారు .

అప్పటికే ఆయనకీ కామెర్లు బాగా ముదిరిపోయి ,చివరి స్టేజి లో ఉన్నాడు . బ్రతకడు, కష్టం అని డాక్టర్స్ చెప్పేసారు.

సాంబమూర్తి గారు ఆ యజమానికి, తల్లికి, భార్యకి ” మీ ముగ్గురికి విడి విడిగా కలలు వస్తాయి. నేను రేపు మళ్ళీ వస్తాను .ఆ కలలు ఏంటో నాకు చెప్పండి ‘‘అంటూ వెళ్లిపోయారు.

ఆయన మరునాడు వచ్చి ఒక్కొక్కళ్ళని  ఏం కల వచ్చింది అని అడిగాడు .మొదట యజమాని చెప్పాడు ”నాకు తెల్లని బట్టలతో బాబా కనబడ్డాడు .ఆయన నా దగ్గరికి వచ్చాక ఆయన బట్టలు పచ్చగా అయిపోయాయి ”అని చెప్పాడు .

భార్య తల్లి కూడా అవే కలలు అలాగే వచ్చాయని చెప్పారు .అంతే సాంబమూర్తి గారు అప్పుడు ”నీ కామెర్లు ని బాబా గారు తీసేసుకున్నారు. నీకు నయం అయిపోయింది .” అని చెప్పి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఆయన పరమపదించడానికి ఒక నెల రోజులు ముందు తానుగా ఒక శిష్య  పరమాణువు ఇంటికి వెళ్లి సరిగ్గా ఒక నెల తర్వాత నేను మీ అమ్మగారికి అన్యాయం చేసి పోతున్నాను. అని చెప్పారట. ఆయన చెప్పినట్లు గానే నెల తర్వాత అలాగే వెళ్లిపోయారు.

సమయానికి నేను ఊళ్ళో లేను. మర్నాడు అంత్యక్రియలకు హాజరు అయ్యాను. చాలా మంది బాబా భక్తులు వచ్చారు. ఆయన చితికి నిప్పు పెట్టిన తర్వాత {అది సరిగ్గా మధ్యాహ్న హారతి సమయం] నన్ను హారతి పాడమన్నారు.నేను పాడాను.

ఆయనతో నా అనుబంధం ఏమిటంటే బాబా గుడులకి ఎలా అయితే గురువారాలు, శ్రీ రామనవమికి జనాలు వచ్చేవారో ఆ సమయాలలో ఆయన దగ్గరికి ఆలానే వచ్చేవారు .వారందరికీ భోజనం ఏర్పాట్లకు  నేను సేవ చేసేవాడిని.

The above text has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “”నీ కామెర్లు ని బాబా గారు తీసేసుకున్నారు. నీకు నయం అయిపోయింది .”

Sai Baba

Sai Baba…Sai Baba…Thank you Baba….

Madhavi

Baba, na thandri Pina cheppinatuga, na bartha anarogyani thisivesi na kutumbani kapadu thandri, nive dikku, ma kastani thisivesi mamalni munduku nadipinchu Baba,

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles