Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా “నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు లోటుండదు” అంటారు.
భగత్ బేణిని గూర్చిన ప్రసక్తి నాభాజీ రచించిన భక్తమాలలో వస్తుంది.
ఇంకా ఆయన పలికిన కొన్ని మాటలు శిక్కుల మత గ్రంథమైన గురుగ్రంథ సాహెబ్ లో చోటు చేసుకున్నాయి.
ఈయన గూర్చి నానక్ పలుకుట వలను నానక్ సమకాలికుడంటారు ఈయనను.
ఈయన ఆస్నే అనే గ్రామంలో జన్మించిన బ్రాహ్మణుడు. ఆ ఊరిలోని వారి గృహాలకు పోయి భగవత్ కథలు, గాథలు చెప్పి కుటుంబమును పోషించుకునే వాడు.
ఒకనాడు ఒక యోగి కనిపించి, నీవేమి చేస్తుంటావని అడిగితే సమాధానం చెప్పాడు.
“ఇతరులకు మహనీయుల జీవిత కథలు చెబుతావు కద, ఆ మహనీయుల వలె నీవెందుకు జీవించరాదు? వారివలె నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోలేవు?
నీవు చెప్పే మహనీయుల కథలు, గాథలు వినిన వారు నీకు ధనాన్ని ఇస్తున్నారు కదా, నీవే ఆ మహనీయులవలె జీవిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు” అన్నారు ఆ యోగి.
బేణి ఆలోచించాడు. ఇక ఆ యోగినే తన గురువుగా స్వీకరించాడు.
ఇంటికి వెళ్ళి “ఇక నేను వ్యక్తుల గృహాలకు పోనక్కరలేదు. ఒక మహారాజు దగ్గర ఉంటాను” అని చెప్పాడు.
ఉదయమే దగ్గరలో నున్న అడవిలోనికిపోయి భగవంతుని ధ్యానం చేస్తూ ఉండేవాడు. సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేవాడు.
ఒకనాడు ఇంట్లో ఆహార పదార్దాలు అయిపోయాయి. ఆ విషయాన్నే భార్య బేణీకి చెప్పింది. కానీ బేణి ప్రార్థనలో మునిగిపోయాడు.
పూట గడవటమే కష్టమైందా కుటుంబానికి. తెల్లవారింది. మరల అడవికి పోయాడు దైవ ధ్యానానికి.
అదే సమయంలో ఒక రాజు ఆ ఇంటికి పుష్కలంగా ఆహార పదార్దాలను, వస్తువులను ఇచ్చి “బేణీ జీతం నా దగ్గరే ఉన్నది. ఇంకా ఎన్ని కావాలన్నా ఇస్తాను” అని చెప్పి నామసంకీర్తన చేస్తున్న బేణీని కౌగలించుకున్నాడు.
గురు అర్జున్ దేవ్ “తన దివ్య కాంతితో బేణీని ప్రకాశింపచేశాడు. ఓ మనసా! నీవు కూడా ఆ దైవానికి బానిసకా” అని అన్నాడు.
ఒకసారి ఆయనను కొందరు తమతో త్రివేణీ సంగమానికి రమ్మన్నారు. “అక్కడకు పోనక్కరలేదు. త్రివేణీ సంగమం నాలోనే ఉంది” అన్నాడు భగత్ (భక్త) బేణి.
ఆయన జనన, మరణ ఇతర వివరాలు తెలియరాలేదు.
ఆయన రచించిన కీర్తనను స్మరిద్దాం….
“కృష్ణుని (నిరాకారుడు)కి ప్రేమతో ఆత్మ, శరీరం అర్పించిన వారు జాగరూకులై ఉంటారు.
అసత్యాలు పలుకరు. పంచేంద్రియాలను వారి అధీనంలో ఉంచుకుంటారు. గురు బోధలు మనసులో నిలుపుకుంటారు”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భక్తి జ్ఞాన సంగమం… .మహనీయులు – 2020… అక్టోబరు 8
- ఇంటి బావిలో గంగమ్మ! …. మహనీయులు – 2020… నవంబర్ 26
- వాతాపి గణపతిం భజే… …. మహనీయులు – 2020… మార్చి 24
- ఎచట నుండి వీచెనో …. మహనీయులు – 2020… మార్చి 13
- శ్రీరామ రక్ష…. మహనీయులు – 2020… అక్టోబరు 26
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments