భక్తి జ్ఞాన సంగమం… .మహనీయులు – 2020… అక్టోబరు 8



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తి జ్ఞాన సంగమాన్ని కేశవ తీర్థస్వామిలో చూడవచ్చును. ఈయన బాల్యంలో ధృవనారాయణులు చిత్ర పటాన్ని ప్రక్కలో ఉంచుకొని నిద్రించే వాడు.

ఒకనాటి రాత్రి నృసింహస్వామి స్వప్నంలో కనిపిస్తే, మట్టపల్లి వెళ్లి నృసింహస్వామిని దర్శించి, తన హృదయంలో ప్రతిష్టించుకున్నాడు.

కృష్ణా జిల్లాలోని వేదాద్రికి వెళ్లి, నృసింహస్వామి దర్శనం కానిదే, అన్న పానీయాలు ముట్టనని శపథం చేశాడు.

మూడు దినాలు ఉగ్ర తపస్సు చేశాడు. శయన ఏకాదశి పర్వ దినాన, తెల్లవారు జామున నరసింహులు ప్రత్యక్షమై “నీవు నీ ఆశ్రమానికి పోయి, భక్తి, జ్ఞాన, కర్మ యోగాల ద్వారా కార్యాలు ప్రారంభించు” అన్నారు.

కొండ దిగుతుంటే అతీంద్రీయ శక్తులు వచ్చాయని అయన గ్రహించాడు. నృసింహస్వామి ద్వారానే మంత్ర దీక్ష పొంద దలచాడు.

దృఢ సంకల్పంతో తపస్సు చేయసాగాడు. మాఘ పూర్ణిమ నాడు (1944) ఈయన కోరిక నెరవేరింది.

అర్ధరాత్రి గుడి గంటలు మ్రోగాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే, వెలుగులో 32 అక్షరాల నృసింహస్వామి మహా మంత్రం సాక్షాత్కరించింది.

కేశవ తీర్థులు ఆ మంత్రాన్ని కంఠస్థం చేసుకుని, నృసింహుని కీర్తించాడు.

ఒకసారి కేశవ తీర్థులు నర్సరావు పేటలో రామతీర్థుల గ్రంథాలను చదవటం తటస్థించింది.

అది ఆయన జీవితంలో మరో మార్పు. జ్ఞాన యోగి రామతీర్థులతో ఆయన తాదాత్మ్యం పొందాడు. పిడుగురాళ్లలో రామతీర్థ సేవాశ్రమమును స్థాపించాడు.

రామతీర్థుల గ్రంథాలను ఆయన తెలుగులో అనువదించసాగాడు. ఎడతెరిపి లేకుండా, ఆ కార్యక్రమాన్ని చేయటం వలన నరాల బలహీనత వచ్చింది.

నోరు సగం బంధింప బడ్డది కుడి చేయి పనిచేయటం మానింది. ఎడమ చేతితో తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడా విక్రమార్కుడు.

రామతీర్థుల గ్రంథాలపై ఉపన్యసిస్తూ విను వారిలో భక్తి, జ్ఞాన బీజాలు నాటారాయన. ఆయన వాక్కులో వివేకానందుల సింహ గర్జన వినవచ్చేది.

రామతీర్థుల మార్దవం తొణికిసలాడేది. తన ఆధ్యాత్మిక మాస పత్రిక ద్వారా చదువరులకు రామ దర్శనం అయ్యేది.

ఈయనతో నవ్య నాగరికత, వైదిక రుషిత్వం కానవచ్చేవి. తులసీదాసుని రామ చరిత మానస్ ను తెలుగులో ద్విపదగా అందించాడు నేటి తరానికి.

సాయిబాబా రామ విజయాన్ని శ్రవణం చేసి, దేహాన్ని విడిచారు. కేశవతీర్థులు జ్ఞానదేవ్ హరి కథను శ్రవణం చేసి దేహాన్ని విడిచారు. కేశవతీర్థుల జనన, మరణాలు అక్టోబర్ లోనే.

తన గురువైన రామతీర్థుల జనన, మరణాలు కూడా అక్టోబరు నెలలోనే! ఇది కాకతాళీయమా? అక్టోబర్ 8, 1917న కేశవతీర్థులు జన్మించారు.

నేడు ఆయన జయంతి. ఆయనను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles